ఉత్తరాయణం

నేతన్నకు భరోసా ఇవ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలకు అవసరమైన కూడు, గూడు, గుడ్డ సమకూర్చే దిశగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. కూడుపెట్టే రైతన్నకు ఏటా పదివేలు, నిరుపేదలందరికీ ఇళ్లు సమకూర్చుతోంది. గుడ్డ నేచే నేతన్న పరిస్థితే విషమంగా ఉంది. చిలప నూలుపై కేంద్రం పన్ను విధించింది. కుల వృత్తిని నమ్ముకుని వేరే దారిలేక లక్షల కుటుంబాలు మగ్గం గోతికే పరిమితమయ్యాయి. సొసైటీల్లో కోట్లాది రూపాయల వస్త్రాలు నిల్వలతో తయారుచేసే వస్త్రాలకు అమ్మగలమనే నమ్మకం లేక నేతన్న దిగాలుగా చూడవలసి వస్తోంది. కుటుంబమంతా కష్టపడ్డా ఒకపూట తిండికీ దిక్కులు చూడవలసిన దయనీయ స్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే భావితరాలకు మగ్గంపై నేతలు నేచే వారని పుస్తకాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖద్దరు వాడకంపై విరివిగా ప్రచారం రాయితీలు, భార్యాభర్తలిరువురికీ పింఛను అందించటంతోపాటు రైతన్నలకు ఇస్తున్నట్లు ఏటా పదివేల సాయంతోపాటు చేనేత మండలి ఏర్పాటుచేయాలి. అలాగే యువతకు సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలు తర్ఫీదు సమయంలో పారితోషికం చెల్లించే ఏర్పాటుచేయగలిగితే రాష్ట్రంలో నేతన్న భరోసాగా జీవితం కొనసాగించగలడు.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
వివాదాల గవర్నర్లు
మంచి ఉద్దేశంతో ఏర్పర్చబడ్డ రాజ్యాంగ పదవి గవర్నర్ పదవి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయానికి, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు తగువిధంగా స్పందించడానికి, రాష్ట్రంలో కార్యనిర్వాహక వ్యవస్థకు పెద్దగా వ్యవహరించడానికి అలానే మరిన్ని ఉన్నత బాధ్యతలు కలిగిన పదవి ఇది. అయితే మొదటి నుండి కేంద్రం ప్రతినిధిగా మారిపోయి రాష్ట్రాన్ని ఇరుకునపెట్టే వ్యవహారాలు అధికమై వివాదాస్పదంగా తయారైంది. ఆ పదవికి వనె్న తెచ్చేవాళ్లు ఉన్నట్టుగానే, స్థాయి తగ్గించిన వాళ్ళు కూడా ఉన్నారు. కేంద్రంలోని పాలక పార్టీ రాష్ట్రంలో తమ ఏజెంటుగా వారిని మార్చడమన్నది పరంపరగా సాగుతోంది. ఏ పార్టీ కూడా ఇందుకు అతీతంకాదు. సుప్రీంకోర్టు గానీ, సర్కారియా కమిషన్ గానీ రాజకీయాలకతీతంగా వివాద రహిత మేధావుల నుంచే గవర్నర్ నియామకం జరగాలని చెప్పినా అమలుమాత్రం జరగడం లేదు కాబట్టి పరిస్థితుల్లో మార్పు కూడాలేదు. తాజాగా మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ సెలవిచ్చారు. ‘కాశ్మీర్ యువతని అందరూ బహిష్కరించాలని’. కాశ్మీరు యువత భారతీయుల్లో భాగం. ఇప్పటికే పుల్వామా ఘటన వేడిలో వారిపై దేశంలో వివిధచోట్ల దాడులు, బహిష్కరణలు జరుగుతున్నాయి. వాటిని సమర్థించడం ద్వారా ఆ పెద్దమనిషి ఏం సాధించాలనుకొంటున్నారు? కాశ్మీరులో ఉన్నవారంతా దేశద్రోహులా? అలా అనుకోవడమంటే మనవాళ్లని మనం దూరం చేసుకోవడం కాదా? ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడినందుకు కేంద్రం అతనిపై చర్య తీసుకోవాలి కదా! మా పార్టీయే అని ఉపేక్షిస్తే ఇలాంటి పిలుపులు మరిన్ని పెరగవా? ఇక గత వారంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ పట్ల నిరసనగా వారంరోజులు ధర్నా చేశారు. ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలకు గవర్నర్ ఆమోదించాలి. మంత్రివర్గ నిర్ణయాలకు పెద్దపీట వెయ్యడం, వారిని శాసనసభకు జవాబుదారీ చెయ్యడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వౌలిక లక్షణం. అందుకు వ్యతిరేకంగా సమాంతరంగా ప్రభుత్వం నడపడానికి గవర్నర్లకు అధికారం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రికీ ఇవే సమస్యలు. కర్ణాటక గవర్నర్ నిర్ణయం కూడా వివాదాస్పదమే. కాబట్టి గవర్నర్ల, లెఫ్టినెంట్ గవర్నర్ల పాత్రలపై సమీక్ష జరగాలి.
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం