అంతర్జాతీయం

హెచ్-1బితో నష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వీసా విధానాన్ని రద్దు చేసి తీరాలి: ట్రంప్
వాషింగ్టన్, మార్చి 11: హెచ్-1బి వీసాల వల్ల ఎవరికైనా నష్టమేనని, అందువల్ల ఈ విధానానికి స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల రేసులో అందరికన్నా ముందున్న డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాను కూడా తన వ్యాపార సంస్థల్లో హెచ్-1బి వీసాలను ఉపయోగిస్తున్నానని అంగీకరించిన ట్రంప్ అయితే ఇది అమెరికా వర్కర్ల ఉద్యోగాలను లాగేసుకుంటోందని, అందువల్ల ఇది ఉండకూడదని ఆయన అన్నారు. మయామీలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నలుగురు అభ్యర్థుల మధ్య చిట్టచివరి చర్చ ప్రధానంగా ఈ హెచ్-1బి వీసా సమస్యపైనే ప్రారంభం కావడం గమనార్హం. చర్చలో పాల్గొన్న అందరూ ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. అభ్యర్థుల్లో ఒకరైన ఫ్లోరిడా సెనేటర్ మార్కో రుబియో అయితే హెచ్-1బి విధానాన్ని వ్యతిరేకించే సందర్భంగా టాటాలను, భారత్‌ను కూడా విమర్శించారు.‘ హెచ్-1బి వీసా గురించి నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే నేను కూడా దీన్ని ఉపయోగిస్తున్నాను. అయితే మనకు ఈ విధానం వద్దు. వర్కర్లకు ఇది చాలా అన్యాయం చేస్తుంది’ అని విదేశీ వర్కర్లు ముఖ్యంగా హెచ్-1బి వీసాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్ అస్తులు అమెరికాలోని వర్జీనియా, ఇల్లినాయిస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, నెవాడా, న్యూయార్క్, కాలిఫోర్నియా, కనెక్టికట్, హవాయి రాష్ట్రాల్లోనే కాకుండా కెనడా, టర్కీ, పనామా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, భారత్, ఉరుగ్వే దేశాల్లో విస్తరించి ఉన్నాయి. అమెరికా కంపెనీలు తాత్కాలికంగా ప్రత్యేక కేటగిరీ ఉద్యోగాల్లో విదేశీ నిపుణులను నియమించుకోవడానికి ఉపయోగపడే హెచ్-1బి వీసాల వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతున్నది మన దేశానికి చెందిన ఐటి నిపుణులే. కాగా, అమెరికా కార్మికుల స్థానంలో విదేశీ వర్కర్లను నియమించుకోవడానికి హెచ్-1బి ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకోవడం చట్ట వ్యతిరేకమని రుబియో అన్నారు. ఒకసారి ఏదైనా ఒక కంపెనీ దీన్ని దుర్వినియోగం చేసినట్లు రుజువైతే భవిష్యత్తులో మరోసారి దాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించకూడదని కూడా ఆయన అన్నారు.