Others

చదువుకున్నాక కీకరకాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరికీ విద్య మన ప్రభుత్వాల లక్ష్యం. మనమంతా తెలుగువారమని గర్వపడుతుంటాం. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చదువుల్లో తెలుగు భాషను దూరం పెడుతున్నాం. మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం రద్దు చేస్తున్నట్లు రెండు నెలల క్రితం ఏపి మున్సిపల్ మంత్రి ప్రకటించారు. అయితే, వివిధ వర్గాల నుంచి నిరసనలు రావడంతో ఆ ప్రతిపాదనకు తాత్కాలికంగా తెరపడింది. కానీ, తెలుగు మాధ్యమంపై ప్రభుత్వ ఉద్దేశం మాత్రం బహిర్గతమైంది. మన మాతృభాషకు పుట్టగతులు లేకుండా చేసే చదువులేం చదువులు? ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రితో చర్చించకుండానే మున్సిపల్ మంత్రి నారాయణ హడావుడిగా తన నిర్ణయం ప్రకటించి నిరసనను ఎదుర్కొన్నారు. ‘ఉద్యోగాలు దక్కాలంటే ఆంగ్ల భాషలో పరిజ్ఞానం అవసరం’ అని ఏపి సిఎం చంద్రబాబు ఆమధ్య ఓ సమావేశంలో అన్నారు. ఆంగ్లాన్ని అసలు వద్దనే మూర్ఖులెవరూ ఉండరు. కానీ, మాతృభాష తెలుగుని పణంగా పెట్టి ఆంగ్లాన్ని నేర్చుకోవాలనడం సరికాదు.
ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమాన్ని అనివార్యం చేయాలి. మాతృభాషలో చదవడం, రాయడం బాగా నేర్చాకే మరే భాషనైనా నేర్చుకోవడం సులువవుతుంది. తెలుగు మాధ్యమంలో చదివినవారంతా నిరుద్యోగులవుతున్నారా? ఆంగ్లభాషను నేర్చిన వారందరికీ ఉద్యోగాలు వచ్చి పడుతున్నాయా? నిరుద్యోగ సమస్య మూలాల గురించి పాలకులు ఆలోచించాలి. విదేశాల్లో ఉద్యోగాలకు ఆంగ్లభాష అవసరం అని చాలామంది చెబుతుంటారు. అమెరికాలో ఉద్యోగాలకు వెళ్లేవారిలో ఒక్క భారతీయులే లేరు. ఎన్నో దేశాలవారు అమెరికా వెడుతున్నారు. చైనా, జపాన్,ఫ్రాన్స్, జర్మనీ, ఇతర యూరోపియన్ దేశాల వారు ఎందరో పాఠశాల విద్యను తమ మాతృభాషలోనే చదివి, ఆంగ్లాన్ని తర్వాత నేర్చుకుని విదేశాలకు వెడుతున్నారు. ఆంగ్ల భాషాప్రావీణ్యం వల్లనే వారు అమెరికా వెడుతున్నారనడంలో నిజం లేదు. వారు చదువుకున్న శాస్త్రాలలో ప్రతిభ ఉంటేనే అమెరికాలోనైనా, మరే దేశంలోనైనా ఉద్యోగాలు లభిస్తాయి.
తెలియని భాషలో బోధన ప్రారంభిస్తే ఇప్పటికే పాఠశాలల్లో వున్న ‘డ్రాపవుట్స్’ సంఖ్య మరింత ఎక్కువవుతుంది. చదువుఒంటపట్టడానికి మాతృభాష మాధ్యమమే ఉత్తమం. మాతృభాషలో విద్య నేర్పినట్టయితే విద్యార్థుల మధ్య అంతరాలు కూడా తగ్గుముఖం పడతాయి. గ్రామీణులు, వనవాసులు, వెనుకబడిన వర్గాల వారికి మాతృభాషలోనే విద్యను అందించాలి. వీరికి బలవంతంగా ఆంగ్లం నేర్పిస్తే- బ్రిటిష్ వారు మనల్ని వదిలిపోయిన తరువాత కూడా ‘ఆంగ్ల భాషకై వెంపర్లాడే వారి దేశం’గా భారత్ నిలిచిపోతుంది. ఇది మన స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నుండి ఆంగ్లేయులు మన జాతిని సర్వనాశనం చేయడానికి ప్రయత్నించినా, బ్రిటన్ అధికార పాలన 1857 నుండి 1947 వరకు సాగింది. ఈ 90 ఏళ్ల కాలంలో బ్రిటిష్‌వారు ఎటువంటి మేధావుల్ని తయారు చేసారంటే- ‘మన స్వతంత్ర దేశంలో వారనుకున్న వినాశన కార్యాన్ని సాధించిపెట్టే వారిని’ రూపొందించి వెళ్లారు. స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో భారతీయ భాషలకు మనమిచ్చిన గౌరవం, ప్రాముఖ్యతలను స్వతంత్రం వచ్చాక మరచిపోయేలా చేయడానికి మన విద్యాధికులే కారణమంటే ఆశ్చర్యం లేదు. ఆంగ్లంపై వ్యామోహాన్ని పెంచుతూ, మాతృభాషను పక్కనపెట్టే స్థితికి తెస్తున్నారీ విజ్ఞులు. వీరి నుండి భాషలను కాపాడుకోవాలంటే ప్రాథమిక స్థాయి విద్యను మాతృభాషలో ప్రారంభించాలి. మన భాషలను రక్షిస్తున్న గ్రామీణ, వనవాసీ, ఇతర వెనుకబడిన వర్గాల వారిని విద్యావంతుల్ని చేద్దాం. వారందరినీ విద్యావంతుల్ని చేస్తున్నామనే సాకుతో ‘చదవకముందు కాకరకాయ.. చదువుకున్నాక కీకరకాయ’ అన్నట్టు పరాయి భాషా దాస్యంలోకి వారినీ, జాతినీ నెట్టేయరాదు.

-దుగ్గిరాల విశే్వశ్వరం