క్రైమ్/లీగల్

ముగ్గురు మావోలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాల చేతుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం.. దంతెవాడ జిల్లాలోని కిరణ్‌డోల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కుట్రీమ్ దండకారణ్యంలో డీఆర్‌జీ బలగాలు, కిరండోల్ పోలీసులు సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ జిల్లాలో ఈనెల 23న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోలు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహం పన్నారనే పక్కా సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. అడవుల్లో కూంబింగ్ చేపడుతుండగా మావోలు తారసపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మలంగీర్ దళానికి చెందిన సభ్యుడు మండవి లచ్చు, గుమియాపాల్ జనమిలీషియా కమాండర్ పొడియాలు మృతి
చెందినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. వీరిపై రూ.లక్ష చొప్పున రివార్డులు ఉన్నాయన్నారు. సంఘటన స్థలంలో 9ఎంఎం పిస్టల్, 12 ఎంఎం బోర్‌రైఫిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. భారీ ఎత్తున విప్లవ సాహిత్యం, మందుపాతరలు, నిత్యావసరాలు, మందులు దొరికినట్లు ఎస్పీ వివరించారు. అలాగే బీజాపూర్ జిల్లా ఆవుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని పున్నూరు అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మరో మావోయిస్టు మృతి చెందాడు. ఇతని వద్ద 315రైఫిల్‌తో పాటు భారీగా పేలుడు సామాగ్రి లభ్యమైందని బీజాపూర్ ఎస్పీ దివ్యాంగ్‌పటేల్ వెల్లడించారు.

*చిత్రం...సంఘటనా స్థలంలో లభ్యమైన పేలుడు సామగ్రి