క్రైమ్/లీగల్

‘బాబ్లీ’ కేసు విచారిస్తున్న న్యాయమూర్తికి బెదిరింపు లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 28: బాబ్లీ ప్రాజెక్టు వివాదం తాలూకు నమోదైన కేసును విచారణ జరుపుతున్న మహారాష్టల్రోని ధర్మాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తికి తాజాగా బెదిరింపు లేఖ అందడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని కమ్మ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు మూడు పేజీల బెదిరింపు లేఖను స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ లేఖలో హెచ్చరించినట్టు తెలిసింది. ఈ బెదిరింపు లేఖ గురించి న్యాయమూర్తి ధర్మాబాద్ పోలీసుల దృష్టికి తేవడంతో వారు ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపు లేఖ వెనుక ఉన్న అదృశ్య శక్తుల ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలనే పట్టుదలతో దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. ఆంగ్లంలో రాసి ఉన్న లేఖలోని అంశాలను బట్టి చూస్తే, చంద్రబాబుకు వారెంట్ జారీ చేయడం వల్లే ఆయనను అభిమానించే వ్యక్తులు ఈ బెదిరింపు లేఖను పంపించి ఉంటారని అనుమానిస్తున్నారు. జిల్లా సరిహద్దున గోదావరిపై మహారాష్ట్ర చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 2010లో అప్పటి ఉమ్మడి రాష్ట్రం ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి నిరసన తెలిపేందుకు హాజరైన సందర్భంగా సరిహద్దులోనే ధర్మాబాద్ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అయితే ఈ ఉదంతానికి సంబంధించి ధర్మాబాద్ కోర్టు గత రెండు మాసాల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు సహా మరో 15మందికి నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది. బాబు సహా మిగతా వారంతా నేరుగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది.