క్రైమ్/లీగల్

ఆర్టీసీ సిబ్బందికి సుప్రీంలో నిరాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: ఆర్టీసీ సిబ్బందికి సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలంటూ దాఖలైన మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ఎంఎస్ 138ని అనుసరించి తమ పదవీ విరమణ వయోపరిమితిని కూడా 60 ఏళ్లకు పెంచాలని కోరుతూ సుప్రీం కోర్టులో మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లను ఆర్టీసీ సిబ్బంది తరఫున దాఖలు చేయగా అన్నింటినీ కోర్టు కొట్టేసింది. మొదటి నుంచి కూడా ఆర్టీసీ యాజమాన్యం వయో పరిమితి పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తునే వచ్చింది. సంస్థ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నష్టంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున పదవీ విరమణ వయోపరిమితిని పెంచకూడదని గత జూన్ 19వ తేదీ జరిగిన సంస్థ పాలక మండలి సమావేశం తీర్మానం కూడా చేసింది. ఓ వైపు సంస్థ ఆర్థిక సంక్షోభం, మరో వైపు రహణా రంగంలో ఉండే కష్టపూరిత విధుల నిర్వహణకు అవసరమైన గరిష్ఠ శారీరక దృఢత్వం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకునే పదవీ విరమణ వయోపరిమితిని పెంచరాదని నిర్ణయించుకున్నట్లు యాజమాన్యం కోర్టులో కూడా వాదించింది. సుప్రీం కోర్టులో కార్మికులు దాఖలు చేసిన మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లు మంగళవారం తుది విచారణకు రాగా ఉభయపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు సంస్థ వాదనను సమర్ధిస్తూ ఉద్యోగ, కార్మికులు దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టివేసింది.