బిజినెస్

ఎగుమతుల వృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: నానాటికి పడిపోతున్న ఎగుమతులను వృద్ధిపథంలో తీసుకెళ్ళాలని, అందుకు కావాల్సిన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఇఒ) మంగళవారం డిమాండ్ చేసింది. వరుసగా 16వ నెల క్షీణిస్తూ గత నెల మార్చిలోనూ ఎగుమతులు పతనమైనది తెలిసిందే. సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం మార్చిలో 5.47 శాతం దిగజారి భారత ఎగుమతుల విలువ 22.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య పెట్రోలియం, ఇంజినీరింగ్ ఎగుమతులు పడిపోవడమే దీనికి కారణమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, తగిన ప్రోత్సాహకాలు ఎగుమతుల రంగానికి కరువయ్యాయని ఎఫ్‌ఐఇఒ ఆరోపిస్తోంది. ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాల ఎగుమతులు కూడా పతనం బాటలోనే ఉన్నాయని వాణిజ్య శాఖ చెప్పినది తెలిసిందే. అయతే రుణాల విషయంలో ఎగుమతుల రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించాలని, తగినన్ని నిధులను ఈ రంగానికి సమకూర్చాలని, అంతేగాక ఒక ఎగుమతి అభివృద్ధి నిధిని కూడా ఏర్పాటు చేయాలని ఓ ప్రకటనలో ఎఫ్‌ఐఇఒ డిమాండ్ చేసింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) మొత్తంగా దేశీయ ఎగుమతులు ఐదేళ్ళ కనిష్టాన్ని తాకుతూ 15.8 శాతం పడిపోయి 261.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు మార్చి నెలలో దిగుమతులు కూడా 21.56 శాతం తగ్గి, 27.78 బిలియన్ డాలర్లుగా నమోదవగా, వాణిజ్య లోటు 5.07 బిలియన్ డాలర్లుగా ఉంది.