స్మృతి లయలు

మధ్రాస్ పోయె.. ఆంధ్రా రెచ్చిపోయె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా అదృష్టం తప్ప వాడు హిందీ సినిమా రౌడీయే.. మా పెడ్రో తలచుకుంటే వాడ్ని తన్నగలడు. కాని భయస్తుడు. మంచోడు. తప్పించుకొనేవాడు కోటిగాన్ని.
ఆ రోజు స్కూలు ఆర్చీ కింద కూర్చున్నాడు మా వాడు. అందరం ఆడుకుంటున్నాం. నంది (కుంటుడు ఆట)లో వున్నాను నేను.
ఓ రాయి చిన్న గులకరాయి తీసి విసిరేడు కోటి.. మా వాడి కాలికి తగుల్కుందా రాయి. తప్పించుకున్నాడు. ఇంకోటి విసిరేడు. పెడ్రో కాలి నేరుగా తగిలేలాగ.. తగిలింది. మనవాడు విగ్రహ పుష్టేగాని.. ‘చెయ్యి ముట్టే సరసం’ ఇష్టపడడు. దుష్టుడికి దూరం బెట్టర్ అని వెళ్లిపోసాగాడు.. వాడు లేచాడు.
‘ఏరా ఆగరా..’
‘ఏం.. ఏం చేశాను బ్రదర్. నేను నీ జోలికి రాను బ్రదర్.. నువ్వు నీ దారంట పో’ అన్నాడు పెడ్రో.
‘మరి? నాయాల.. నువ్వు నా రాయికి అడ్డం ఎందుకు వచ్చావు?’ అన్నాడు వాడు దూకుడుగా.
చూడండి? - తమాషా.. రాయి విసిరింది వాడు.. దానికి అడ్డం వచ్చాడుట వీడు.. అంటే సాకు కావాలి వాడికి. షేక్ ముక్తార్ అంత పర్సనాలిటీ వున్నదని మేం అంటున్నాముగా మా వాణ్ని. కోటికి ఉడుకుపోతుతనం.. కండకావరం.. ‘పెడ్రో కాస్తా.. పెట్రోల్ కెళ్తాడు’ అన్నాడు కోటి.
మనవాడు ఇగ్నోర్ చేశాడు.. వాడు కలియబడ్డాడు. ఎలాగో మేమందరం.. విడిపించాము పెడ్రోని.. మా సింగంపల్లి కూడా అంతే.. బలశాలి. వస్తాదు కూడా కొత్తపేట కుమ్మరివీధిలో - అందరికీ రెస్పెక్ట్ వీడంటే.. మొహాన కాల్చిన మచ్చ ఉంటుంది. తెల్లగా నీటుగా ఉండేవాడు. నేను మద్రాస్ వెళ్లినాక అప్పారావు మా అమ్మ దగ్గరికి - వాళ్ల అమ్మతో పోట్లాడి వచ్చి కొన్నాళ్లు వున్నాడట.. తూర్పోడు - అని వీడికి నిక్‌నేమ్. కాని అప్పారావు సాత్వికుడు. కర్రి వెంకటేశ్వర్లుకి కూడా మంచి పేరు. కర్రసాము చేసేవాడు కాని మార్కుల విషయంలో ఏ సాము చేసేవాడు కాదు. అసలు మా సర్కిల్ అంతా ఇంచుమించు ‘సర్కిల్సే’ (సున్నాలే).. ఓసారి ఏం జరిగిందంటే.. అదో కథా - వేరే వినిపిస్తా. వృథాన్యార్థ భంగుల్ ఎవ్వరో’... ఎరుగన్ శక్యమే ఏరికిన్? అన్న దానికి ఇదొక ఉదాహరణ.
ఈలోగా మా డ్రిల్లు మాస్టారు మధుసూదనరావు మాయమై పోయాడు... సినిమాలోకి పోయాడన్నారు.. ఔను.. మా డ్రిల్లు మాస్టారే - వీరమాచినేని మధుసూదనరావు.. అనక గొప్ప దర్శకుడిగా పెరిగి విక్టరీ మధుసూదనరావు అనిపించుకున్నాడు.. నేను పెద్దయ్యాక - సినిమా ఫంక్షన్‌లో కలిశాము. ఆనాడు అతను చిన్న (ఎక్స్‌ట్రా) వేషం వేసిన ఓ సినిమాకి - రోజులు మారాయి అనుకుంటాను.. క్యూలో పచ్చడి అయిపోయి వెళ్లి మరీ చూశాము.. నేనూ నారాయణ - అభిమానం చెడ్డది.
ఇదండీ మా లంచ్ పార్కు దీని కథ నెక్ట్స్.
* * *
* రెండు నదులా మధ్య/ ఎండు ఎముకలా బొంది/లా రాజధాని మనది/ రంజిల్లునోయ్! చరిత్ర/లో డేరాలకది ఎంతో/ ప్రసిద్ధికెక్కునోయ్! (కర్నూలు అన్నమాట)
* పైపెచ్చు అచ్చు అంటే/ అచ్చు కేసరి/ మంత్రి పదవి తోటే/ గర్జనలన్నీ సరి/ మనవాడేనోయ్/ మొనగాడేనోయ్/ చివర ముక్తాయింపు - ప్రతి హృదిలోను/ ప్రతి గదిలోనూ/ అతిరయముగాను/ విశాలాంధ్ర జ్యోతి వెలుగా..వలెనోయ్!
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ/ గుంట నక్కని బోలిన రాజగోపాలాచారి కూడబలుక్కుని - యాభై రోజుల ప్రాయోపవాసానికి పొట్టిశ్రీరాములుగారు ఆహుతి అయిపోయిన తర్వాత కానీ చలించలేదు. 1952 డిసెంబర్ 29న చేసిన భాషా ప్రాతిపదిక తెలుగు రాష్ట్రం తీర్మానంలో మన చెన్నడి నగరం చెన్నాపట్నం అనగా మద్రాస్ ఆంధ్రులకు సగం ముక్క కూడా రాలేదు.
.. ఆనక అక్టోబర్ 1953 ఒకటో తారీఖున ఏర్పడ్డ రాష్ట్రానికి - బెజవాడ కూడా కాలేదు రాజధాని. నేను హైస్కూలు పదో తరగతి విద్యార్థినే గాని - పత్రికల్లో పడుతున్న రచయితని కనుక.. మనం ఐక్యంగా ఎన్నడూ.. ‘మనం’ (బ్రతకం) అంటూ రాసిన ఆవేదనా కవితలోని రెండు చరణాలు ఇవి (నా కలం చిందులు సంకలనంలో పూర్తిగా ఉంది. స్థల విస్తారభీతి చేత కొంచెం కోట్ చేశాను.) - ఈ కవిత విశాలాంధ్ర, ప్రజావాణి వగైరా పత్రికలలో ఒకేసారి ఆంధ్ర రాష్ట్రావతరణ నాడు ప్రచురణ అయింది. శ్రీశ్రీగారు ఒకటీ బై పది అంటూ రాశాడు నాడు.. నేను, ‘ఆంధ్రులం మనం ఐక్యంగా ‘మనం’ అంటూ పిల్లవాడిని గనుక దుఃఖంతో రాశాను. విశాలాంధ్ర కలలు కంటూ రాశాను. ఆనక 1956లో విశాలాంధ్ర - తెలుగు నిండుగా తియ్యగా మాట్లాడే వారందరినీ కలుపుకుని ఏర్పడ్డది. కానీ నేను యూనివర్సిటీ క్యాంపస్‌లో వున్నాను. సరే.. అమరజీవి - అస్తమయ వార్త రాంగానే - మన నగరాల్లో అగ్నిపర్వతం పేలినట్లు ఆందోళనా.. అల్లర్లు రెండూ భిన్న రీతుల్లో చెలరేగాయి. విద్యార్థులంతా లారీల మీదికి ఎక్కి - ప్రేలుతున్న నాటుబాంబుల్లాగా - అమరజీవి జోహార్! పొట్టిశ్రీరాములు జోహార్! నెహ్రూ డౌన్‌డౌన్ - మద్రాస్ మాది మద్రాసు మాకివ్వండి.. మా రాష్ట్రం మాకివ్వండి..’ అంటూ గొంతు ఎండి సొమ్మసిల్లిపోయేలాగా అరుస్తూ వుంటే - రెండోవేపు అల్లరి మూకలు - విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాలలో షాపులు పగులగొట్టి కొల్లగొట్టారు. బెజవాడ గూడ్సు షెడ్లు చాలా పెద్దవి - ఆరో నెంబర్ ప్లాట్‌ఫారం నుంచి - ప్రకాశం పంతులుగారి విగ్రహం (ఇప్పుడిలా మర్యాదగా రాశాను గాని) దాకా విస్తరించి ఉంటాయి. (ఆనాడు ప్రకాశం పంతులుగారి మీద మండిపోయాం. శ్రీరాములుగారిని కాపాడలేక పోయాడంటూ నిందలు వేశాం)

(ఇంకా బోలెడుంది)

... వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com