స్మృతి లయలు

రైలు బంఢ్లలో ముష్టి పాటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజుల్లో పాసెంజర్ రైలు ఎక్కితే చాలు.. చిడతలు కొట్టుకుంటూ గుడ్డి బిచ్చగాళ్ల పాటలు మొదలు.. ‘ఎంత దూరమో.. లేదూ చెలీ ఆ దేశమే పోదాం..’ అతడు ఆలాపన అందుకుంటాడు. ఆమె అందుకుంటుంది జవాబుగా - ‘దుఃఖము లేదా? దురాశ లేదా?’ అని.. గ్రుడ్డివాడైన చిడతల అన్న శ్రవణపేయమైన కంఠంతో శ్రుతిబద్ధంగా చిడతలు వాయిస్తూ పాట అందుకుంటాడు. ‘దుఃఖమూ లేదూ.. దాస్యమనెడి పాపమూ లేదు, చెల్లీ! ఆ దేశమే పోదాం..’ ప్రయాణీకులు పాత గుడ్డలు మూటలలో కూరుకొని పోయిన గుడ్డలు ఉన్నట్లు కుక్కున్నట్లు ఇరుక్కుని ఉండేవారు. కానీ ఈ పాట వారికి - సేదతీర్చే మధుర గానం. ఎంత గొప్పగా అన్నాడు కవి? ‘దాస్య’మన్నది పాపమట! ఆనాటివి ప్రయాణాలా? అడ్వెంచర్స్ గాని.. ‘అలాగే ఇవాళ సమోసా, చాయ్ కట్లెట్ కూల్‌డ్రింకులూ’ అంటూ అరుపులూ వినబడతాయి కానీ ఆ రోజుల్లో - పుస్తకాలూ, బుక్సూ.. అన్న అరుపులు వినవచ్చేవి. బుక్ దొంతరలు భుజాన ధరించి జనుల మధ్య నుంచి - చాకచక్యంగా నడుస్తూ - కొవ్వలి. జంపనల నవలలండీ.. వ్రతకల్పాలూ.. తలుపు దగ్గర పాటలూ, కాశీ మజిలీ కథలండీ.. అరేబియన్ నైట్ అద్భుతాలండీ అని తిరిగే - సారీ! కాదుకాదు నడిచే బుక్ షాపుల్లాగా - సంచరించేవారు. అయిదారు అణాలకే.. పుస్తకాలు అమ్మేవారు. బుక్స్ పంచుకుంటూ పోయి - ఇస్తే డబ్బులు లేదా వాళ్ల బుక్స్ వాళ్లే కలెక్ట్ చేసేసుకొనేవారు.
ముష్టిపాట లేకుండా మన సినిమాలు ఉండేవి కావు - అది పాడే గాయక బెగ్గర్స్ లేకుండా ఇండియన్ రైలు పెట్టెలూ ఉండేవి కావు గాని, అదే రీతి.. పుస్తకమో, ఓ వీక్లీవో, డైలీవో ఏదో ఒకటి - చేత లేకుండా విద్యావంతులు ఎవ్వరూ ఉండేవాళ్లు కారు. నాటి నవీన స్వతంత్ర భారతంలో అలా పెరిగింది అక్షరారాధన. మా లైబ్రరీలో అంటే భ్ర.మ.పుస్తకాలయంలో శరత్‌మాబు గారి రెండు పార్టుల పెద్ద నవల శ్రీకాంత్ - లేదు తెలుగులో - కానీ హిందీలో వుంది. అది తీసుకొని కూడా బలుక్కుంటూ - ఎలాగో తంటాలు పడి చదివేశాను. నిజానికి ఒక్క వేలూరి శివరామశాస్ర్తీ గారు మాత్రమే నేరుగా బెంగాలీలో నుంచి తెలుగులోకి చేసేవారట.. వారి ‘డిప్రెషన్’ చెంబు నాటికీ నేను భూమీదకి దిగానేమో. అంతే మహానుభావుడు. ఆధునిక తెనుగు కథకి గోత్రంలో ముగ్గురు ఋషులు.. ఒకరు శ్రీపాద రెండు వేలూరి మూడు మల్లాది రామకృష్ణ శాస్ర్తీగారు అనేవాన్నీ; అడుగు జాడ గురజాడ వారిదే.
‘డిటెక్టివ్’ల రాజ్యం.. ఏది ఏమైనా మరో చెంప - మన తెలుగునాట వైవీ రావులు, టెంపోరావులు, విశ్వప్రసాద, డాక్టర్, భగవాన్, ప్రసాద్ (రామ్‌ప్రసాద్ - పత్రికలో నాకు కొలీగ్ - ఫ్రెండ్) మరో ప్రక్క కుటుంబరావు, బుచ్చిబాబు, గోపీచంద్ వగైరాలు - తెలుగు సంఘ జీవితానికి - పాఠకులకు అర్థం అవగాహన ఆనందం ఇచ్చే విధంగా నవలను తీర్చిదిద్దేరు. శ్రీ భగవాన్ డజన్ల కొద్దీ నాళాలు అవలీలగా రాసేసేవాడు. కనబడితే చాలు ముసిముసి నవ్వులతో వచ్చి నాతో కొంతదూరం నడిచి వెనుదిరిగేవాడు. అతనికి రైల్వే ‘ఇన్‌స్టిట్యూట్’ హాలులో అనేక సంస్థలు కలిసి సన్మానం చేసేరు. మేళతాళాలతో ఊరేగించారు. నాకు పెద్దరికం ఇచ్చి వేదిక మీదకి ఎక్కించారు. అట్లా అపరాధ పరిశోధన కల్పన పటిమ సాయంతో ఓ వెలుగు వెలిగింది. నాటి నుంచి నేటి దాకా - నవల క్రమ వికాసం చెందుతూనే ఉంది... నాకు ప్రియాతి ప్రియమైన ‘డిటెక్టివ్’ - ఎర్ల్ స్టానెలీ గార్డెన్ గారి పాల్డ్రేక్ - అతని బాస్ డిటెక్టివ్ లాయర్ పెర్రీ మేసన్‌గారు.. ఇప్పటికి నాకు ఆ అమెరికన్ నవలలు తాయిలాలే.. వ్యామోహమే.
సరే.. ‘లతా’ ఎడారి పూలు, శ్రీదేవి కాలాతీత వ్యక్తులు, మహీధర వారి రథ - చక్రాలు, భాస్కరభట్ల వెల్లువలో పూచిక పుల్లలు, రావిశాస్ర్తీ అల్పజీవి, నా తొలి మలుపు, కొమ్మూరి పెంకుటిల్లు లాంటి నవలలు పాత రూటుని మార్చేశాయి. పలువుర్ని ఆకర్షించిన పది నవలలు అంటూ శ్రీవాత్సవ (యండమూరి సత్యనారాయణ)గారు ఆంధ్రజ్యోతి డైలీలో (జ్యోతి వీక్లీ అప్పటికి లేదు) 1960లో ఫుల్ పేజీ వ్యాసం రాశారు. అందులో నా నవలలు రెండిటికి చోటు దొరికింది. విమర్శకుల కోటలో ‘మన’ (నా) నవల పాగా వేసింది. అట్టి తరి: జన మనోరంజకంగా - కొత్త ట్రెండ్ తెలుగు సాహితీ వీధులలో వూరేగింది వూల్లేలింది. అనువాదాలు వేసే ప్రముఖ వారపత్రికలు కూడా.. కొత్త స్వతంత్ర నవలలకి స్వాగత ద్వారాలు తెరిచాయి. అదంతా, వేరే కథ.. సారీ! చలంగారిని పేర్కొనలేదు. మొత్తానికి నేను చెప్పేది ఏమిటీ అంటే - నా ప్రపంచ సాహితీ గవాక్షం లైబ్రరీయే. ఐతే, 1956 తరువాత గాలి ఎస్సారార్ కాలేజీకి - క్రికెట్ మైదానం వైపు వ్యామోహంగా మళ్లింది... పిల్లల కథలు రాయడానికి స్వస్తి- కవితలకి మాత్రం - స్రవంతి, స్వతంత్ర విశాలాంధ్ర, టాబ్లాయిడ్ మేగజీన్లు కవితల్ని మాత్రం తెగ ఆదరించేవి - అవే తెగ రాసేవాన్ని. కలం చిందుల పేరిట వారంవారం కాలం కూడా విశాలాంధ్రలో రాశాను.. పెద్దవాళ్ల కథలకి శ్రీకారం చుట్టే ముందు. కవితా ఖండికలే నా వ్యాపకం.. మేగజీన్లు ఆనాటి మా యువతీ యువకుల దైనందిన జీవితంలో ట్రెండ్స్‌ని మార్పుని తెచ్చేయి. ఆనక ‘అమ్మాయిల - నవలా’ ఉప్పెన.. వామ్మో అది నిజంగా ఉప్పెనయే.. గ్రేట్.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com