బిజినెస్

మార్కెట్‌లో సంస్కరణల జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 25: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సంస్కరణాత్మక నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాల మధ్య మదుపరులు పెట్టుబడులకు అమితాసక్తిని కనబరిచారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 576 పాయింట్లు ఎగిసి 25,881.17 వద్ద ముగియగా, దాదాపు 3 నెలల గరిష్ఠాన్ని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 186.05 పాయింట్లు ఎగబాకి 7,934.90 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్స్, ఐటి, టెక్నాలజీ, పవర్, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 3.17 శాతం నుంచి 2.01 శాతం వరకు పెరిగింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.97 శాతం, స్మాల్-క్యాప్ 0.94 శాతం మేర పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ సూచీలు 2.71 శాతం నుంచి 0.60 శాతం వరకు లాభపడ్డాయి. ఐరోపా మర్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలూ 1.30 శాతం నుంచి 0.65 శాతం వరకు పుంజుకున్నాయి.