సాహితి

స్వేచ్ఛగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదుగో వస్తున్నా..!
రుూ మొక్క చుట్టూ వరదగూడులా
పాదుకట్టీ.. కాసిన్ని నీళ్లు పోసీ..!

ఆకు కళ్లు తెరచి
రేపిది రెమ్మ తొడిగితే..
మనం చిగురించినట్టు!

కాసేపాగు వస్తున్నా..!
కొండవాలులోంచి దూకే రుూ వాగు నాగును
ఎండిన పొలాలమీదకు మళ్లించీ..!

తడిదేరీ నేల నవ్వితే..
రేపటితరం పెదాలమీద నెలవంకలా
మనం పచ్చని నవ్వైనట్టు!

ఒక్క క్షణమాగు వస్తున్నా..!
రెక్క విరిగిన రుూ పావురానికి
కాసేపు ఊపిరూదీ.. వెన్ను నిమిరీ..!

తేరుకోనీ.. విడిచిన బాణమై
రేపిది నింగినీ చీల్చుకుపోతే..
మనం స్వేచ్ఛగా రెక్క విచ్చినట్టు!!
*
- సిరికి స్వామినాయుడు