సాహితి

ప్రజాసాహితి సాహిత్య సాంస్కృతిద్యమ మాసపత్రిక 400వ సంచిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భరతి’ తరువాత తెలుగు సాహిత్య చరిత్రలో 400కు పైగా సంచికలను పూర్తి చేసుకున్న మాసపత్రిక ‘ప్రజాసాహితి’. నాల్గవ వంతుకు పైగా అంటే 100కు పైగా సంచికలను ప్రత్యేక, విశిష్ట సంచికలుగా వెలువరించటం ద్వారా సాంస్కృతికోద్యమ కర్తవ్య దీక్షను ప్రజాసాహితి ప్రదర్శించింది. ప్రతి వంద సంచికలలో 11 ప్రత్యేక సంచికలను విడుదల చేసిన ఈ పత్రిక ఇప్పుడు ‘‘25 ఏళ్ల ప్రపంచీకరణ: సాంస్కృతిక విధ్వంసం: సాహిత్యోద్యమం’’ అన్న అంశంపై 400వ సంచికను ప్రత్యేకంగా విడుదల చేసింది. ప్రపంచీకరణ సృష్టించిన సాంస్కృతిక విధ్వంసాన్ని ‘‘ఉక్కు డేగపై ధిక్కార స్వరంతో శాంతి పావురపు సృజనగా’’ సాగుతున్న లాంగ్‌మార్చ్’’ అన్న నినాదంతో మోహన్ గీసిన ముఖచిత్రంతో ఈ సంచిక వెలువడింది. 25 ఏళ్ల సామ్రాజ్యవాద ప్రపంచీకరణాన్ని, భారత ప్రజలపై సాగుతున్న విధ్వంసక సాంస్కృతిక దాడిగా కొనసాగుతున్న ప్రజావ్యతగిరేక భూస్వామ్య- సామ్రాజ్యవాద సంస్కృతుల విస్ఫోటనంగా ప్రజాసాహితి పరిగణిస్తూ వస్తోంది. అందుకే దాని ఆర్థిక రాజకీయ స్వభావిలను పాఠకులకు అర్థం అయ్యేవిధంగా అది ఏయే విధంగా సాంస్కృతిక రూపాలలో వ్యక్తం అవుతూ వస్తున్నదో విశే్లషించే వ్యాసాలు ఇందులో ఉన్నాయి. పాపినేని శివశంకర్ రూపొందించిన కొత్త భావనల్ని విశే్లషించిన కొత్తపల్లి రవిబాబు ఓ దళితుని ఆత్మకథను వివరంగా పరిచయం చేసిన భద్రం సోనియట్ విప్లవ ప్రభావంతో వెలువడిన భారతీయ కవిత్వంపై రాచపాళెం రాసిన వ్యాసం ఇందులో ఉన్నాయ. తెలుగు సినిమా రంగంలో భూస్వామ్య వారసత్వ సంస్కృతిని బలోపేతం చేస్తున్న పెట్టుబడిని బహిర్గతం చేసిన వ్యాసం, భాషపై, బాల్యంపై, విద్యార్థి, యువజనులపై, మహిళలపై మతవ్ఢ్యౌంపై ప్రపంచీకరణం ఎలా విధ్వంసక పాత్ర నిర్వహిస్తుందో తెలిపే వ్యాసాలు ఇందులో ఉన్నాయి. 6కథలూ, 17 వ్యాసాలు, ఏడుగురు ప్రముఖుల సందేశాలు, 17 కవితలూ, 2 పాటలూ 4 సమీక్షా వ్యాసాలతో పాటు సాధారణ సంచికల ధారావాహికలను కూడా ఇందులో కొనసాగించారు. గడచిన పాతికేళ్లలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వ్యక్తీకరణలు, మహిళల జీవితాలను ప్రభావితం చేసిన కొన్ని కథలపై విశే్లషణలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు 400సంచికలను కూడా సిడిల రూపంలో విడుదల చేసేందుకు జనసాహితి సిద్ధమవుతోంది. సాహిత్య సామాజిక చరిత్ర పరిశోధకులకు పనికి వచ్చేవిధంగా ఈ సంచిక రూపుదిద్దుకుంది. ప్రజాసాహితి సంచికల కోసం సంప్రదించాల్సిన చిరునామా

*
మంజరి
23-22-123, శివాలయం స్ట్రీట్,
సత్యన్నారాయణ పురం,
విజయవాడ - 520 011.
ఫోన్ నెం. 0866-2535884

మంజరి