డైలీ సీరియల్

యాజ్ఞసేని 55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వధర్మాలు తెలిసిన ‘విదురుని’కి ధనవ్యయమనే కార్యాన్ని అప్పగించాడు.
శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని ఆజ్ఞానుసారం అందరినీ సంతోషపరచే నెపంతో బ్రాహ్మణుల పాద ప్రక్షాళనం చేయసాగాడు. దీనివల్ల ఆయనకు ఉత్తమఫలం లభించింది.
అలా ధర్మజుని యజ్ఞానికి వచ్చిన రాజులలో ఎవరూ వెయ్యి సువర్ణాలకన్నా తక్కువ కానుకలను తీసుకురాలేదు.
రాజసూయయాగాన్ని చూడవచ్చిన రాజులతో హద్దులేని సంపదల సమృద్ధితో మహాత్ముడైన యుధిష్ఠిరుడి ఆ భవనం మిక్కిలి శోభిల్లింది.
యుధిష్ఠిరుని యజ్ఞంలో ఆరు అగ్నులను స్థాపించి భూరి దక్షిణలిచ్చి యజ్ఞాన్ని సాగించారు.
మంత్రభాగాల్లో నిపుణులై మంత్రవేత్తలు చేసిన స్తుతులు, ఆహ్వానాలు, తిలలు మొదలైన పదార్థాలతో ఇచ్చిన ఆహుతులతో దేవతాగణం అంతా సంతృప్తిని పొందారు.
ఆహుతులతో దేవతలు సంతృప్తులైనట్లు బ్రాహ్మణులు గూడా దక్షిణలు, అన్నసామాగ్రి, ధనాదులతో సంతృప్తిని పొందారు. యజ్ఞంతో అన్నివర్ణాల ప్రజలు సంతృప్తిని పొందారు.
ఆ యజ్ఞశాల వేద సంపన్నులైన దేవతలతో, బ్రాహ్మణులతో, మహర్షులతో ప్రకాశించింది. అంత భీష్మపితామహుడు-
‘‘యుధిష్ఠిరా! ఆచార్యుడూ, ఋత్విక్కుడూ, సంయోక్త, స్నాతకుడు, ప్రియమిత్రుడు, రాజు, ఈ ఆరుగురూ పూజింపదగినవారు. వీరిలో ఒక్కొక్కరికీ వేరువేరుగా అర్ఘ్యం తీసికొనిరా! వీరిలో శ్రేష్ఠుడైన, సమర్థుడైన వారికి ముందుగా అర్ఘ్యమిమ్ము’’ అని అనగా ధర్మరాజు-
పితమహా! కురునందనా! ముందుగా అర్ఘమీయదగినవాడొక్కడూ ఎవరిని నీవు భావిస్తున్నావో నాకు చెప్పుము’’ అని అనగా భీష్ముడు-
‘‘ఈ రాజులందరిలో తేజోబలపరాక్రమాలచేత కాంతిగోళాల్లో ప్రకాశిస్తున్న సూర్యునివలె, గాలి లేని చోట వాయువువలె ‘శ్రీకృష్ణునిచే’ ఈ సదస్సు ఇప్పుడు భాసిల్లుచున్నది. ఆనందిస్తున్నది’’ అని అన్నాడు. భీష్ముని అనుమతితో సహదేవుడు యధావిధిగా శ్రీకృష్ణుని కోసం ఉత్తమమైన అర్ఘ్యాన్ని తీసికొనివచ్చాడు. శ్రీకృష్ణుడు దానిని శాస్త్రోక్తమయిన కర్మగా స్వీకరించాడు.
శ్రీకృష్ణునికి అర్ఘమివ్వటాన్ని చేదిభూపాలుడు, శ్రీకృష్ణుని మేనల్లుడు అయిన శిశుపాలుడు అధిక్షేపించాడు. భీష్ముని అనరాని మాటలతో నిందించాడు.
శ్రీకృష్ణుడు శిశుపాలుని జన్మవృత్తాంతాన్ని అక్కడవున్న సభికులందరికీ వివరిస్తాడు. తాను అత్త సాత్త్వతకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆనాటితో శిశుపాలుని నూరు తప్పులు పూర్తిఅయినాయని, ఇక సమయం ఆసన్నమయిందని తన చక్రాయుధంతో శిశుపాలుని శిరస్సును ఖండిస్తాడు. శిశుపాలుని శరీరం నుండి సూర్యతేజస్సువంటి తేజస్సుపైకి వచ్చి శ్రీకృష్ణునిలో కలిసిపోయింది.
అలా ఆ తేజస్సు శ్రీకృష్ణునిలో కలవటం చూచిన రాజులందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు.
ధర్మరాజు యొక్క యోగం సమృద్ధిమంతమై ప్రజలకు ప్రీతికరమై ప్రకాశించింది. ఆ యజ్ఞం శుభారంభంతో విఘ్నాలు లేకుండా ధనధాన్య సంపన్నమై శ్రీకృష్ణవాసుదేవునిచే రక్షింపబడి వెలుగొందింది.
ధర్మరాజు పత్నీసమేతుడై ‘అవభృథస్నాన’ మాచరించాడు.
ధర్మరాజు సార్వభముడయ్యాడు. వచ్చిన రాజులందరినీ ధర్మరాజు తగినట్లుగా సన్మానించగా సంతోషంతో వారందరూ వెనుదిరిగిపోనెంచగా వారిని సాదరంగా సాగనంపారు పాండవులు.
తదుపరి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు. ‘‘రాజా! అప్రమత్తుడవై నిత్యమూ నిలిచి ప్రజలను రక్షింపుము. ప్రాణులు మేఘాన్నీ పక్షులు మహావృక్షాన్నీ, దేవతలు ఇంద్రునీ ఆశ్రయించి జీవిస్తున్నట్లు నీ బంధువులు గూడా నీ ఆశ్రయంలో జీవించాలి’’ అని.
పిమ్మట ధర్మరాజు అనుజ్ఞతో బలరాముడు సాత్యకి, కృతవర్మలతో కలిసి ద్వారకకు పయనమై వెళ్లిపోయాడు.
(రాజసూయయాగం
పరిసమాప్తమయింది)

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము