మీకు మీరే డాక్టర్
వేడిని చల్లార్చే స్వచ్ఛ్ఫలం పుచ్చ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఫ్రశ్న: వేసవికాలంలో తప్ప ఇతర కాలాలలో వచ్చే పుచ్చకాయలు తినకూడదంటున్నారు. ఇది నిజమేనా? పుచ్చకాయ గురించిన వివరాలు తెలియజేయగలరు.
జ: పుచ్చకాయలు ఒకప్పుడు వేసవిలో మాత్రమే దొరికేవి. ఇప్పుడు ఏడాది పొడవునా దొరుకుతున్నాయి. పర్యావరణాన్ని మనమే నాశనం చేసుకోవటం వలన భూతాపం పెరిగి, అన్ని ఋతువులూ మారిపోయి, ఇప్పుడు ఎల్లవేళలా వేసవికాలం మాత్రమే నడుస్తోంది. సీతాకాలంలో కూడా పుచ్చకాయల్ని తినకపోతే శరీరంలో వేడి తగ్గే పరిస్థితి కనిపించటంలేదు. బైట వాతావరణంలో వేడి సరే, శరీరంలో వేడి పెరిగిపోవడానికి మన ఆహార విహారాలు ప్రధాన కారణాలు అవుతున్నాయి. ఆహార పదార్థాల్లో కల్తీలు, పులుపు, మసాలాలు, నూనెల వాడకం మితిమీరటం వలన మనుషుల్లో వేడి మరీ పెరిగిపోతోంది. టీవీలకు అంటుకుపోయి, రాత్రి 11 తరువాతే నిద్రపోయే అలవాటు కూడా శరీరంలో వేడి పెరగటానికి ఒక కారణం. ఇంకా చాలా కారణాలున్నాయి. ఈ పరిస్థితుల్లో పుచ్చకాయల అవసరం మనకి ఎల్లవేళలా ఉంది. ఇది కేవలం వేసవి పండు కాదు, ఉష్ణ మండలం వారికి నిత్య ఫలమే!
పుచ్చకాయలో 92% క్షారజలం ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. తన క్షార గుణంతో శరీరంలో ఎక్కువగా ఉన్న ఆమ్లాల్నీ పలుచన చేసి శరీరంలో వేడి పెరక్కుండా చేస్తుందీ జలం. దీనిలోని గొప్ప రసాయనాలు శరీరంలో విష దోషాల్ని హరిస్తాయి. రక్తపోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, రకరకాల విటమిన్లకు నెలవు ఈ ఫలం.
మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్న వారికి పుచ్చకాయ వరం లాంటిది. లోపలంతా గింజలతో నిండి ఉంటుంది. టొమాటోల మాదిరిగా దీనిలో లైకోఫిన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వీర్యవృద్ధిని కలిగిస్తుంది. వీర్యంలో వేడిని తగ్గించి జీవకణాలు నశించకుండా చేస్తుంది. అందువలన సంతానప్రాప్తి నిస్తుంది. గుండె జబ్బుల్లో మంచి చేస్తుంది. ఎండ నుండి చర్మాన్ని కాపాడుతుంది. కాలిన గాయాల మీద చల్లని పుచ్చకాయ ముక్కల్ని ఉంచితే మంట, పోటు తగ్గి ఉపశమనం కలుగుతుంది.
శరీరంలో కాల్షియం నిల్వలు పెంచి కీళ్లనొప్పుల్నీ వాత రోగాన్నీ నియంత్రిస్తుంది. మూత్రంలో యూరిక్ ఆమ్లాన్నీ తగ్గిస్తుంది. ఎన్నో రకాల ఖనిజాల లవణాలున్నాయి కాబట్టి, బాలింతలకు తినిపిస్తే పాలు పడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచి గుండె జబ్బుల్ని నివారిస్తుంది.
ఎర్రగా ఉండే పండ్లను, కూరగాయలను తప్పనిసరిగా తినటం మంచిది. కెరొటీన్ అవసరం మనకు వీటి ద్వారా తీరుతుంది. శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి, విష దోషాలను హరించడానికి, కేన్సర్ లాంటి జబ్బులు రాకుండా నివారించడానికి వీటి అవసరం మనకుంది. వీటిని తగ్గించి మనం పిజ్జాలు, బజ్జీల మీద వ్యామోహం పెంచుకోవటం వలన కేన్సర్ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు ఓ గ్లాసు పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే మంచిది. అయితే వైద్యుడి సలహా అవసరం. ఎందుకంటే పొటాషియం విషయంలో ఈ పండ్లను తీసుకునేప్పుడు జాగ్రత్త కావాలి. వేసవిలో అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గాలంటే పుచ్చకాయ జ్యూస్ అవసరం.
గర్భాశయ కేన్సర్, నోటి సంబంధిత కేన్సర్ల నుంచి కూడా రక్షణనిస్తుంది. టిఫిన్లను, ఝంక్ ఆహారాన్ని మాని, తరచూ ఇలాంటి పండ్లను తినటానికి అలవాటు పడటం అవసరం అని గమనించాలి. ఒక మనిషి టిఫిన్ చేస్తే అయ్యే ఖర్చుతో ఇంటిల్లపాదికీ ఆరోగ్యదాయకమైన పండ్లను కొనివ్వవచ్చు.
ప్రొస్టేట్ గ్రంథిలో వాపుతో బాధపడేవారు తరచూ పుచ్చపండు తింటూ ఉంటే ఉపశమనం కనిపిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే ఓవరియన్, సర్వికల్, నోటి సంబంధిత కేన్సర్ల నుంచి కూడా రక్షణ నిస్తుంది. ఇంకా కాలిన గాయాల మీద చల్లని పుచ్చకాయ ముక్కల్ని ఉంచితే ఉపశమనం కలుగుతుంది.
అన్ని రకాల జ్వరాలలో నీరసం తగ్గి శక్తినిస్తుంది. పెదవులు ఎండిపోయినట్లు డ్రైగా అనిపిస్తుంటే పుచ్చకాయ, కర్బూజా కలిపి తింటే వేడి తగ్గి చర్మం మృదువుగా అవుతుంది. డ్రైగా ఉండటం ఆగుతుంది.
వేసవిలో ఇబ్బంది పెట్టే మొటిమలు, పులిపిరులు, చెమటకాయలు వీటికి పుచ్చపండు రసం తాగటం ఒక్కటే విరుగుడు. కడుపులో ఎసిడిటీ పెరిగి, పుల్లటి తేపులు వస్తుంటే పుచ్చ జ్యూస్‌లో మిరియాల పొడితో, తినే సోడా ఉప్పు తగినంత కలుపుకుని తాగితే, కడుపులో ప్రశాంతత ఏర్పడుతుంది.
లైకోపీన్ అధికంగా టొమాటోలోనూ, పుచ్చలోనూ, జామలోనూ, నల్లద్రాక్షలోనూ ఉంటుంది. వీటిని చక్కగా ఉపయోగించుకోగల వాళ్లకు హార్టెటాక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు ప్రకటించారు.
నైలూ నుండి కృష్ణ దాకా అతి ప్రాచీన కాలంలోనే జరిగిన జాతుల వ్యాపనంలో పుచ్చకాయ భారతదేశానికి చేరిందని వృక్ష చరిత్రకారుల పరిశోధన.
క్రీ.శ. తొలి శతాబ్దాలలోనే పుచ్చకాయల్ని భారతదేశంలో పండించారు. 7-10 శతాబ్దాల మధ్యకాలంలో పుచ్చకాయలు మన దగ్గర నుండి చైనా చేరాయి. అక్కడ నుండి స్పెయిన్ చేరాయని చెప్తారు. 16-17 శతాబ్దాల కాలంలో యూరప్ అంతటా వ్యాపించాయి. ప్రస్తుత కాలంలో వైన్ తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు.
చైనా వియత్నాం దేశీయులు నల్లని పుచ్చగింజల్ని వేరుశెనగ పప్పుల్లా వేయించుకు తింటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒక్లసోమా రాష్ట్రం 2007లో పుచ్చకాయని తన జాతీయ శాకంగా ప్రకటించింది. ఇంతకీ పుచ్చకాయ కూరగాయా? లేక పండా? ఇదే అంశంపై అమెరికాలో చాలా చర్చ జరిగింది. సొరకాయ, బీరకాయ మాదిరే లేత పుచ్చకాయల్నీ కూరగాయగా వాడుకోవచ్చు. నీరు ఎక్కువగా ఉన్న కాయ కాబట్టి, ఆ నీరు క్షార గుణం కలిగినవే కాబట్టి ద్రవ రూపమైన వంటకాల తయారీలో దీన్ని చక్కగా వాడుకోవచ్చు. తెలుగు వాళ్లకి దీన్ని పండిన తరువాతే తినటం మాత్రమే అలవాటు. బూడిద గుమ్మడికాయతో సమానంగా పుచ్చకాయని కూడా వాడుకోగలగటం ఒక విజ్ఞత. బూడిద గుమ్మడిని కూరగాయ అనుకోవటం మనం ఏనాడో మానేశాం. అది మన దృష్టిలో వీధి వాకిలికి వేలాడదీసే ఒక దిష్టిబొమ్మ. పుచ్చకాయంటే వేసవిలో తాగవలసిన జ్యూస్నిచ్చే పండు. ఇలా కొన్ని గీతలు గీసుకుని ప్రకృతి సంపదని మనం సద్వినియోగం చేసుకోలేక పోతున్నాం. మన ఆలోచనా ధోరణిలో కూడా మార్పు రావలసిన అవసరం ఉంది.
షుగరు రోగులు భయపడవలసిన అవసరం లేని పండు ఇది. ఎర్రగా ఉండే కూరగాయలు, పండ్లలో పుచ్చకాయ షుగరు రోగులకు నిరపాయకారి. 100 గ్రాముల పుచ్చపండు గుజ్జులో కావలసినన్ని కెరటనాయిడ్స్, లైకోపీన్, సి విటమిన్ ఉన్నాయి. వాటి కోసమైనా షుగరు రోగులు పుచ్చని తినాలి. అయితే కేవలం 30 కేలరీలను మాత్రమే ఇస్తుంది. 6% షుగరు ఉంటుంది. అందుకని షుగరుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ పుచ్చని అప్పుడప్పుడు, ముఖ్యంగా వేడి లక్షణాలు కనిపించినప్పుడు ఈ ఫలాన్ని తగు మోతాదులో తీసుకుంటే మంచి ఫలితమే కనిపిస్తుంది.
బూడిద గుమ్మడి, సొరకాయ, పుచ్చకాయలు ఇవన్నీ ఇంచుమించూ సమానంగానే వేడిని తగ్గిస్తాయి. వీటిలో నీరు క్షార గుణం కలిగి ఉంటుంది కాబట్టి పేగుపూత వ్యాధిని నివారించే ఔషధంలా ఈ కాయలు పని చేస్తాయి. తక్షణం కడుపులో మంటని, మూత్రంలో మంటని, వీర్యంలో మంటని, గొంతులో మంటని, అరి కాళ్లు అరిచేతుల్లో మంటని తగ్గిస్తాయి. దప్పిక తీరుతుంది. మలమూత్రాలు ఫ్రీగా అయ్యేలా చేస్తాయి. బడలిక తీరుతుంది. జ్వరాన్ని త్వరగా తగ్గిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే గుణం కూడా వీటికుంది. శరీరం ఎండిపోతున్నట్టుగా ఉండేవారికి మేలు చేస్తాయి.
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట, పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002