మీకు మీరే డాక్టర్
కరోనా వ్యాధి.. నిజాలు - అపోహలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సారొఛ్చారొచ్చారు అని సినిమా పాటలు పాడుకునే రోజులు పోయాయి. ఇప్పుడు సార్స్ (SARS) వస్తున్నారు. Severe acute respiratory syndrome తీవ్రంగా, ఆకస్మికంగా వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి అనే పేరుతో కొత్త వ్యాధి లోకాన్ని ముంచెత్తుతోంది. దీన్ని తెస్తోంది కరోనా వైరస్.
ప్రపంచం అంతా కొత్త సంవత్సరం వేడుకల్లో ఉండగా, 2019 డిసెంబర్ 31 అర్ధరాత్రి చైనాలో ఈ వ్యాధికి కారణం అవుతున్న ఒక కొత్త వైరస్‌ని గుర్తించారు. దాని ఆకారం కిరీటం లాగా పిల్లలు సరదాగా పెట్టుకునే అట్టటోపీలాగా ఉంటుంది. అందుకని ఈ వైరస్‌ని కరోనా వైరస్ అని పిలిచారు. కరోనా లోంచి COI, వైరస్‌లోంచి VI, డిసీజ్‌లోంచి DI ని తీసుకుని కోవిడ్-2019 అని మొదట దీనికి నామకరణం చేశారు. రోజులు గడిచే కొద్దీ దీనివలన వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి తీవ్రతరం అవుతున్న లక్షణాలు బయటపడుతుండటంతో దీన్ని 2020 మార్చి 4, 5 తేదీల్లో ‘‘సార్స్ కరోనా వైరస్ వ్యాధి-2’’ అనే పేరుతో వ్యవహరిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. SARS-CoV మరియు SARS-CoV-2 అనేవి ప్రస్తుతం దీని సాంకేతిక నామాలు.
నిజానికి ఈ వ్యాధి బయటపడిన అతి స్వల్పకాలంలోనే దీని పుట్టుపూర్వోత్తరాలను బాగానే తెలుసుకోగలిగారు శాస్తవ్రేత్తలు. 2020 జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ SARS-CoV-2 విజృంభణ కారణంగా పౌర ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర స్థితిని ప్రకటించింది. మార్చి 6వ తేదీ నాటికి 92,000 మందికి కరోనా వైరస్ సోకిందని గుర్తించగా, 3,100 మంది ఈ వ్యాధి కారణంగా మరణించినట్టు గుర్తించారు.
మొదటగా చైనాలోని Wuhan ప్రాంతంలో ఈ వ్యాధి బయటపడింది. అంత పెద్ద చైనాలో ఆ ప్రాంతంలోనే ఎందుకు బయటపడిందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరికితే ఈ వ్యాధికి మూలాలు కొంత మేర తెలుసుకునే అవకాశం ఉంది.
మొత్తంమీద ఇది మొదటగా మనిషి శరీరంలోకి ప్రవేశించింది 2019 నవంబర్ మాసాంతంలో గానీ, డిసెంబర్ మొదటి వారంలో గానీ అయి ఉండాలి. కరోనా వైరస్సుల్లో పెద్ద ప్రమాదకరం కానీ 229E, NL63, OC43, HKU1, MERSCOV అనేకం ఉన్నప్పటికీ SARS-COV-2 తరహా బీటాకరోనా వైరస్ సోకిన తరువాతే మానవాళి మనుగడకు ప్రమాదం వాటిల్లిన పరిస్థితి ఏర్పడింది.
20 ఏళ్ల నుండీ ఇది కేవలం కొన్ని జంతువులకు మాత్రమే పరిమితంగా ఉంది. ఒక్కసారిగా ఇది మనుషుల్ని చుట్టబెట్టటం మొదలుపెట్టి 2020ని ఒక భయానక నామసంవత్సరంగా మార్చేసింది. మొదట్లో దీన్ని 2019-nCoV అని మామూలుగా వ్యవహరించారు. ఇప్పుడు మరింత అధ్యయనం తరువాత ప్రమాదకర లక్షణాలను తెస్తోన్న కరోనా వైరస్‌ని ప్రత్యేకంగా గుర్తించి, దాని తీవ్రతను అర్థం చేసుకోవటం కోసం డ్గడళ్యే2 తీవ్రమైన ఆకస్మిక కరోనా వైరస్ వ్యాధి-2 అని నామకరణం చేశారు.
గబ్బిళాయి, చీమల్ని తిని జీవించే పాంగోలిన్ అనే ఒక రకం జీవి, ఇంకా కొన్ని అడవి జీవుల్లో పెరిగే కరోనా వైరస్ ఈ ‘సార్స్ కరోనా వైరస్’కి దగ్గరగా కనిపిస్తోందని తేలింది. వెంటనే చైనా ప్రభుత్వం గబ్బిళాయిల్లాంటి అడవి జంతువులను తినటాన్ని నిషేధిస్తూ ప్రకటన చేసింది.
వ్యాధికారక కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో ప్రవేశించి, శరీరం అంతా వ్యాపించి వ్యాధి లక్షణాలు రావటానికి పట్టే కాలాన్ని ఇంక్యుబేషన్ పిరియడ్ అంటారు. ఇది 10-14 రోజుల వరకూ ఉండవచ్చు. అందాకా ఏ లక్షణాలూ కనిపించనంత మాత్రాన ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడనటానికి వీల్లేదు. కానీ, ఆ సమయంలో పరీక్షలు చేసినా వైరస్ దొరక్క పోవచ్చు. ఇంక్యుబేషన్ పీరియడ్‌లో ఉన్న వ్యక్తి ఈ వ్యాధి వ్యాపించటానికి పెద్ద కారణం కాకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరి 1న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
కరోనా వైరస్ ప్రమాదం దేశదేశాలకూ విస్తరిస్తున్న కొద్దీ ఈ వ్యాధి గురించిన అవగాహన కలిగించే ప్రయత్నాల కన్నా భయపెట్టేవీ, అపోహల్ని కలిగించేవీ ప్రచారంలోకి రావటం గురించి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన ప్రకటించింది.
ఇది ముసలి వాళ్లకే వస్తుందని, పిల్లలకు రాదనీ ఒక ప్రచారం బాగా జరుగుతోంది. వచ్చిన వారిలో 55 ఏళ్ల సగటు వయసున్న వారే ఎక్కువ ఉన్నప్పటికీ అన్ని వయసుల వారికి ఇది సోకే ప్రమాదం ఉంది. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువగా ఉంటుంది. అందువలన త్వరగా సోకే అవకాశం ఉంది. కానీ, పిల్లల్లో ఎక్కువ తీవ్రంగా రాకపోవచ్చునంటున్నారు.
ఇది కూడా మామూలు ఫ్లూలాంటిదేననే అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చాలా మంది రాస్తున్నారు. కరోనా వైరస్‌ల్లో కూడ్ COVID-19 లాంటి తక్కువ ప్రమాదకరమైన వైరస్‌ల వలన వచ్చే ఊపిరితిత్తుల లక్షణాలు ఎక్కువ మందిలో తేలికగా తగ్గే అవకాశం ఉంది. కోవిడ్ 19 కన్నా సార్స్ కరోనావైరస్ ఎక్కువ ప్రమాదకారి. అయితే గతంలో వచ్చిన ఎబోలా లాంటి వ్యాధులు ఇంతకన్నా ప్రమాదకరమైన వాటినే మానవాళి తట్టుకుంది. నిరోధించగలిగింది. ప్రమాదంలోంచి బయటపడటానికి శాస్ర్తియంగా ఆలోచించటమే ముఖ్యం.
చేతులకు, ముఖానికి, సర్జికల్ స్పిరిట్ రాసుకుంటే కరోనా వైరస్ రాదనుకోవటం ఒక అపోహ. దాని వలన ఫలితం తక్కువ కాగా, కొత్త చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మామూలు స్నానం చేసే సబ్బుతో చేతులు కడుక్కోండి. భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు, కాళ్లు, ముఖం కడగండి. అందుకోసం రసాయనాలు కలిసిన సబ్బు ద్రవాలు వాడకండి. ఈ రసాయనాలు చేతిని అంటి ఉండి ఆహారంతో పాటు కడుపులోకి చేరి కొత్త సమస్యలకు కారణం అవుతాయి. సబ్బే చాలు. ఇంకేమీ వాడకండి. కరోనా పోయిందని ధైర్యం కలిగేవరకూ నాలుగు పూటలా హస్త, పాద ముఖ ప్రక్షాళనలు చేసుకోండి.
ఈ వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా గాలి ద్వారా ఇది సోకదు. ఆరు అడుగుల అవతల ఉన్న వ్యక్తికి ఈ వ్యాధి అంటుకోదు. అయితే జలుబు, దగ్గు, తుంపర్లు పడిన వస్తువుని ఇతరులు వాడితే అంటుకునే ప్రమాదం ఉంది.
కరోనా నేరాన్ని అన్యాయంగా కుక్కలు, పిల్లులు, పెంపుడు పక్షుల మీదకు నెడుతున్నారని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. చైనాలో ఒకాయనకు కోవిడ్ 19 వచ్చింది. ఆయన పెంపుడు కుక్క హాంకాంగ్ పామెరేనియన్‌ని పరీక్ష చేస్తే దానికి కోవిడ్ వైరస్ పాజిటివ్ వచ్చిందట. కానీ, దానికి ఎలాంటి వ్యాధి లక్షణాలూ కలగలేదని చెప్తున్నారు.
ఒక వైరస్ శరీరంలో ఉండటానికి, దాని వ్యాధి లక్షణాలు ఆ వ్యక్తిలో బయటపడటానికి మధ్య తేడాని మనం గుర్తించాల్సి ఉందని, ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకే స్థితి దాటి మనుషుల నుండి మనుషులకు సోకే స్థితికి చేరిందనీ, బ్రిటన్ నాటింగ్ హామ్ విశ్వవిద్యాలయం మాలిక్యులార్ వైరాలజీ ఆచార్యులు జోనాథన్ బాల్ ప్రకటించారు.
ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పుకోసం ఒకడు ఏడ్చినట్టు, మానవాళి విధ్వంసక ముఖచిత్రాన్ని ఊహించుకుని జనం భయపడుతుంటే ముఖం మాస్కుల్ని దాచేసి, కృత్రిమ కొరతను సృష్టించి, కొందరు వ్యాపారులు లాభాల కోసం చూస్తున్నారు. దీనివలన మన దేశంలోకి ఇంకా కరోనా రాకమునుపే సర్జికల్ మాస్కులు కరువై, ఆపరేషన్ థియేటర్లకు ఇబ్బంది ఏర్పడింది. ఇంతకీ ఈ సర్జికల్ ముఖం మాస్కులు కరోనా వైరస్‌ని ఆపుతాయనుకోవటం నిజమా? లేకా మన భ్రమేనా? disposable face masks are unlikely to provide such protection అని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృఢంగా ప్రకటించింది. నిజంగా వైరసే మీదకు వస్తే, ఈ మాస్కులు ఏమీ ఆపలేవు. వ్యాధి వచ్చిన వాడి నుంచి తుప్పర్లు వచ్చి పడకుండా ఇవి కొంతవరకూ ఆపుతాయంతే! మాస్కు తొడుక్కుంటే చాలనే ధీమా పెరిగి తక్కిన శరీర పరిశుభ్రత గురించి మనం అశ్రద్ధ చేసే ప్రమాదం కూడా దీనివలన ఉంది. సర్జికల్ మాస్కులు కట్టుకుని తిరుగుతుంటే జనం ఇతనికి వ్యాధి సోకిందేమోనని అనుమానించే అవకాశం కూడా ఉంది.
సర్జికల్ మాస్కులు దేన్ని ఆపగలవో దాన్ని గుడ్డమాస్కులు కూడా ఆపగలవు. గుడ్డ మాస్కులు ఉతుక్కుని తిరిగి వాడుకోవటానికి వీలుగా ఉంటాయి. వాతావరణ కాలుష్యం, దుర్వాసనలు, దుమ్ము ధూళి ఉన్న చోట్ల వాడుకోదగిన గుడ్డ మాస్కులు కరోనా వైరస్ విషయంలోను వాడదగినవే! దాని కోసం ఆపరేషను థియేటర్లలో వాడేవాటిని దుర్వినియోగ పరచనవసరం లేదు.
చేతులు కడుక్కున్న తరువాత వేడి గాలి వచ్చే పరికరం కింద చెయ్యి పెడితే వైరస్ చచ్చిపోతుందనుకోవడం కూడా ఒక అపోహ. జుట్టు ఆరబెట్టుకునే డ్రయర్లతో వేడిగాలి కొడితే వైరస్ చస్తుందని ఒక నమ్మకం. ఎండాకాలంలోనూ, ఎండామండిత ప్రదేశాల్లోనూ, కరోనా రాదని ఒక అపోహని సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యాధి వ్యాపించటానికి, ఎండకీ, చల్లదనానికీ సంబంధం నిర్ధారణ కాలేదు.
ఎవరితోనైనా 10 నిమిషాలకు మించి మాట్లాడవద్దనీ, మాట్లాడితే ఒకరి వైరస్ మరొకరికి అంటుకుంటుందనీ ఒకాయన సోషల్ మీడియాలో రాశారు. ఉప్పు నీళ్లతో ముఖం కడుక్కుంటే వైరస్ రాదని ఇంకొకాయన రాశారు. క్లోరిన్ కలిపిన నీళ్లను పుక్కిలిస్తే రాదని మరొకాయన సలహా! రోజూ రెండు పూటలా యాంటీ బయటిక్స్ మింగితే వ్యాధి నిరోధకశక్తి పెరిగి కరోనా అంటుకోకుండా ఉంటుందట. అల్లం, బెల్లం తినండి, వెల్లుల్లి నమలండి, తులసి తీర్థం తాగండి లాంటి వన్నీ ఉచిత సలహాలే.
***