క్రైమ్/లీగల్

మాజీ ఐఏఎస్ అధికారిపై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 10: మాజీ ఐఏఎస్ అధికారిపై సుపారి గ్యాంగ్ చేసిన దాడిని పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. 5న ప్రశాసన్‌నగర్‌లో ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. క్రికెట్ స్టంప్‌తో యాదాచారి తలపై కొట్టడంతో కుప్పకూలి పోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ హత్యకు సూత్రధారి యాదాచారి సోదరుడైన కరుణాకర్, అతని కుమార్తె మంజుల సపారీ గ్యాం గ్‌తో ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్సుగా రూ.15వేలు ఇచ్చారని తెలిపా రు. హత్యాయత్నంలో పాల్గొన్న బోను దుర్గానరేష్, ఇండియాఅశోక్, ఎం. సాగర్‌ను రిమాండ్‌కు తరలించారు.
మరో ముగ్గురు వెంకటేశ్వర రావు, అయ్యప్ప, రాజేష్ పరారీలో ఉన్నట్లు డీసీపి తెలిపారు. బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్, జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.