క్రైమ్/లీగల్

స్నేహితుడే హంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సౌమ్య హత్యకేసులో వీడిన మిస్టరీ
* వివాహేతర సంబంధమే కారణం
* నిందితుడిని అరెస్టు చేసిన
* ఎస్‌ఆర్ నగర్ పోలీసులు
హైదరాబాద్, సనత్‌నగర్, ఏప్రిల్ 7: నగరంలోని ఎర్రగడ్డ ప్రాంతంలో వివాహిత సౌమ్య దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఇంటోనే ఆమెను తగులబెట్టిన కేసులో ఎలాంటి ఆధారాలు తొలుత లభించకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. హంతకుడు సౌమ్య భర్త స్నేహితుడేనని తేల్చారు. అంతేకాకుండా సౌమ్య, హంతకుడికి మధ్య గతం నుంచీ ఉన్న వివాహేతర సంబంధం కూడా మరో కారణంగా బయటపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పశ్చిమ మండల డిసిపి ఎఆర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. కేసును సవాల్‌గా తీసుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు పట్టిపాటి ప్రకాశరావు (28) నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ప్రకాశరావు, విశాఖపట్నంకు చెందిన సౌమ్య భర్త నాగభూషణం (28) నవయుగ కనస్ట్రక్షన్స్‌లో 2010లో డిచ్‌పల్లిలో పని చేశారు. అనంతరం ఇద్దరు అస్సాం రాష్ట్రంలో జరిగే నిర్మాణ పనుల్లో ఉద్యోగాలు చేసేందుకు అక్కడకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ స్నేహంగా ఒకే చోట పని చేస్తున్న సమయంలో సౌమ్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త నాగభూషణ ఇంట్లో లేని సమయంలో చాలా సార్లు అస్సాంలో సౌమ్య, ప్రకాశరావు కలుసుకునే వారు. 2016 డిసెంబర్‌లో అస్సాం నుంచి ప్రకాశ్, నాగభూషణం ఇద్దరూ హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్‌లో ఎల్‌అండ్‌టి మెట్రోలో నాగభూణంకు లాంచింగ్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, అనారోగ్య కారణాలతో ప్రకాశ్ తన స్వస్ధలం అనంతపురం జిల్లాకు వెళ్లిపోయాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆర్ధిక ఇబ్బందులు పెరగడంతో అప్పులపాలయ్యాడు. ఉద్యోగం లేకపోవడంతో చాలా సంక్షోభంలో కూరుకుపోయిన ప్రకాశ్ సౌమ్య వద్దకు వెళ్లి డబ్బు అడిగాలని తమకు గతం నుంచీ ఉన్న వివాహేతర సంబంధం చనువుతో ప్రణాళిక సిద్ధం చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. హైదర్‌నగర్‌లోని తన స్నేహితుడి గదిలో ఉండి ఈ నెల 2న సౌమ్య భర్త నాగభూణం విధి నిర్వహణకు వెళ్లిన తర్వాత రాత్రి 8.30 గంటలకు వెళ్లి సౌమ్యను కలిశాడు. వెళ్లే ముందు తన రెండు మొబైల్స్‌ను స్నేహితుడి గదిలోనే ఉంచి వెళ్లాడు. పోలీసుల నేర పరిశోధనను మళ్లించేందుకు గాను ఇలా ఫోన్లను వదిలివెళ్లాడు. సౌమ్య ఇంటికి వెళ్లిన తర్వాత ఇద్దరు సెక్స్‌లో పాల్గొన్నారు. అనంతరం తన ఆర్ధిక సమస్యల గురించి ఆమెతో ప్రస్తావించాడు. డబ్బు అవసరం ఉందని, నగలు ఇస్తే వాటి ద్వారా ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కుతానని ప్రకాశ్ కోరడంతో సౌమ్య తిరస్కరించింది. ఈ అంశంపై ఇద్దరి మధ్య చాలా తీవ్రమైన వాగ్వాదం జరిగింది. నగలు ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్న డంపుల్ రాడ్‌తో సౌమ్య తలపైనా, ముఖంపైనా తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయిన సౌమ్యను షేవింగ్ బ్లేడ్‌తో గొంతుకోసి బంగారు నగలను అపహరించాడు. ఒక వేళ బతికితే తన గురించి ఎక్కడ బయటపెడుతుందోనని భావించి పూజ గది, వంటగదుల్లో ఉన్న ఆయిల్‌ను తీసుకు వచ్చి ఆమె శరీరంపై పోసి నిప్పంటించాడు. బయటకు వెళ్లిపోయే ముందు ఆమె సెల్‌ఫోన్‌ను టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో పడేసి, వంటగదిలో ఉన్న గ్యాస్‌ను లీక్ చేసి ఇంటి తలుపులు బయట గడియపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోజు హైదర్‌నగర్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో తన స్నేహితుడు సుబాష్ సహకారంతో నగలను తాకట్టు పెట్టాడు. ఇలా సౌమ్య హత్యకేసును చేధించేందుకు 10 విచారణ బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ వాహిదుద్దీన్ నేతృత్వంలోని బృందం నిందితుడిని అరెస్టు చేసింది.