మీకు మీరే డాక్టర్

కాఫీ-మంచీ చెడూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: పాలు కలిపిన కాఫీ మంచిదా? నల్ల కాఫీ మంచిదా? కాఫీ వలన లాభాలు తెలియజేయండి.
-జి.ప్రహ్లాదరావు
జ: కాఫీ అనేది నిస్సందేహంగా ఒక విషం. కానీ, విషాన్ని విషంగా కాక, ఔషధంగా ప్రయోగించగలగటంలో విజ్ఞత ఉంటుంది. పాషాణాలు, గరళాలతో యోగానుయోగాలను ఆయుర్వేద శాస్త్రం రూపొందించింది. ఆయుర్వేద పరిశోధనలను ప్రభుత్వం బాధ్యతగా కొనసాగింపచేసి ఉంటే మీరాశించినట్టు కాఫీగింజల్లోని విష దోషాలను శుద్ధిచేసే ప్రక్రియను కనుగొని ఉండేవారు. శుద్ధి అనే ఆలోచన ఆధునిక వైద్య శాస్త్రానికి లేదు. అందువలన నిరపాయకరంగా కాఫీ తాగటం మనకు తెలీదు. వస్తుగుణ దీపిక అనే గ్రంథంలో కాఫీని ‘మ్లేచ్ఛ ఫలం’ అంటూ, కాఫీ దోషానికి పాలు, పంచదార అనేవి విరుగుడు వస్తువులుగా పేర్కొన్నారు. భారతదేశంలో మాత్రమే పాలు, పంచదార కలిపిన కాఫీ/ టీలు తాగటానికి కారణం ఈ ఆయుర్వేద ప్రభావమే! కాఫీ వలన లాభాలు చెప్పమన్నారు. నష్టాలు తెలుసుకుంటే లాభాల కోసం కాఫీ వాడాలో అక్కర్లేదో ఎవరికి వారు నిర్ణయించుకోవటానికి వీలౌతుంది.
పాలు కలిసిన కాఫీని ‘విత్ ఫాట్’ అనీ, పాలు లేని కాఫీని ‘వితౌట్ ఫాట్’ అని పిలుస్తారు. కాఫీలో పాలు కలిస్తే కొవ్వు పెరుగుతుందని దీని భావం. పాలు లేకపోతే కాఫీ కొవ్వు తగ్గించే ఔషధంగా పనికొస్తుందని ఆధునిక వైద్య శాస్త్రం చెప్తోంది. ఇది నిజమే. తీపి రుచి కొవ్వుని పెంచుతుంది. చేదు రుచి కొవ్వుని తగ్గిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం చేదు రుచికి చెప్పిన గుణాలన్నీ నల్ల కాఫీకి ఉన్నట్టు ఆధునిక వైద్య శాస్త్రం నిర్ధారిస్తోంది.
కాఫీ తాత్కాలికమైన ఉత్తేజాన్నిచ్చేదే గానీ, శాశ్వతమైన బలాన్నిచ్చేది కాదు. భోజనం లాగా కడుపు నింపేదీ కాదు. ఆకలిని తీర్చేదీ కాదు. బాగా ఆకలైందనుకోండి.. వెంటనే భోజనం చేయటానికి అవకాశం లేకపోతే, ఓ కప్పు కాఫీ తెప్పించుకుని తాగుతాం. అందువలన ఆకలి తీరినట్టా? లేక ఆకలి చచ్చినట్లా? కాఫీ ఆకలిని తీర్చదు. చంపుతుంది. ఆకలి చచ్చిపోయినందువలన ఆ పూటకు అన్నాన్ని చాలా తక్కువగా తినటం జరుగుతుంది. రోజూ ఇలానే చేశామనుకోండి.. ఆహారం తీసుకోవటం బాగా తగ్గిపోయి, మనిషి శుష్కించిపోతాడు. శరీరానికి సంతృప్తి అనేది ఉండదు. అందువలన వాతాది దోషాలు పెరుగుతాయి. కీళ్లనొప్పులు, మైగ్రైన్ తలనొప్పి లాంటి వాత వ్యాధులు తలెత్తటం మొదలౌతుంది. ఇది కాఫీ వలన కలిగే అపకారం. పగలు కాఫీ పదేపదే తాగినందువలన మనకు పగటి ఘనాహారం తీసుకోవటం తగ్గిపోతుంది. ఆహారాన్ని తగ్గించేయటం వలన రక్తంలో కొవ్వు, షుగరు తగ్గిపోతాయి. ఇది కాఫీ వలన కలిగే లాభం. ఇలా కాఫీ వలన అనేక లాభాలున్నాయి. అనేక నష్టాలూ ఉన్నాయి. ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ముఖ్యం.
రోజుకు ఒక కప్పు నల్ల కాఫీ (పాలు, పంచదార లేనిది) తాగితే 13% షుగరు రక్తంలో తగ్గుతోందని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. రోజుకు 13 కప్పులు నల్లకాఫీ తాగితే 67% షుగరు వ్యాధి తగ్గుతుందని కూడా కనుగొన్నారు. ఇది నిజమే! ఈ నిరూపణని మన ఆహార విధానానికి అన్వయించి రోజూ ఇలా 13 కప్పుల నల్లకాఫీ తాగి, పట్టెడన్ని మెతుకులు గతుకుతూ జీవించటం ప్రమాదకరం. అనేక కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఏవో కొన్ని లాభాలు చూపించి మనుషులంతా కాఫీ తాగితే మంచిదనటం సరికాదు.
ప్రోస్టేట్ కేన్సర్, లివర్ సిర్రోసిస్, ఆల్జిమర్ వ్యాధి, పార్కిన్‌సోనిజం లాంటి వ్యాధుల్లో నల్ల కాఫీని ఇవ్వొచ్చని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు. లివర్ కేన్సర్ (హెపటో సెల్యులర్ కేన్సర్) వ్యాధిలో రోజూ ఉదయానే్న ఒక కప్పు నల్లకాఫీ మేలు చేస్తోందనీ, 5 కప్పుల వరకూ తీసుకుంటే ఇంకా ఎక్కువ మార్పులు కనిపించాయనీ, బ్రిటన్‌కి చెందిన సౌత్ యాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్తవ్రేత్త డా.ఆలివర్ కెనె్నడీ పేర్కొన్నారు. కాఫీలో విష దోషాల్ని తగ్గించే గుణాలు(antioxidant), వాపు తగ్గించే గుణాలు (anti -inflammatory) కేన్సర్ నివారక గుణాలు(anti - carcinogenic)ఉన్నాయి.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కేన్సర్‌లో - చిక్కటి కాఫీ త్రాగితే ప్రోస్టేట్ కేన్సర్ రిస్కు బాగా తగ్గిందని పేర్కొన్నారు. 2017 ఏప్రిల్‌లో వెలువడిన నివేదిక ఇది. 6,989 మంది నడివయసు ప్రొస్టేట్ గ్రంథి కేన్సర్ రోగుల మీద చేసిన ప్రయోగం వివరాలు చెప్తూ, ఈ శాస్తవ్రేత్తలు ‘మనుషులంతా రోజూ అంతంత కాఫీ తాగాలని మేం సూచించట్లేదు. అంతకన్నా పెద్ద నష్టాలే కాఫీ వలన కలగవచ్చు’ అని హెచ్చరించారు.
కాఫీ వలన గుండె జబ్బులు పెరుగుతాయి. బీపీ పెరుగుతుంది. జీర్ణాశయ వ్యవస్థ దెబ్బతింటుంది.
*

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com