క్రైమ్/లీగల్

ముక్తేశ్వరంలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, అక్టోబర్ 28: విద్యుత్ షార్ట్‌సర్య్కూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమై నాలుగు లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిన ఘటన బల్లికురవ మండలం ముక్తేశ్వరంలో ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో దాసరి నాగేశ్వరరావు, ఉమ్మనబోయిన అంజమ్మ, నాగిశెట్టి చినఅంజయ్య, చెన్నూరి వీరయ్యకు చెందిన పూరిళ్లు భస్తీపటలమయ్యాయి. మక్తేశ్వరంలో అందరూ పొలం పనులకు వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దాసరి నాగేశ్వరరావు ఇంటిలో చెలరేగిన మంటలు పరిసరాల మిగిలిన వారి ఇళ్లకుకూడా వ్యాపించడంతో ఆసమయంలో ఇళ్లవద్ద ఉన్నవారు వచ్చి మంటలను ఆర్పేందకుచేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అద్దంకి నుండి అగ్నిమాపక దళం వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే నాలుగు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మనుషులెవ్వరూ ఇళ్ల వద్ద లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. బాదితుల కదనం మేరకు రు.4 లక్షల మేర ఆస్థి నష్టం సంభవించినట్లు అంచనా.