క్రైమ్/లీగల్

హత్యకేసులో ఇరువురికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఆగస్టు 7: మార్కాపురం సబ్‌డివిజన్ పరిధిలోని రాచర్ల పోలీసుస్టేషన్ పరిధిలో 2014 సెప్టెంబర్ 13వతేదీన జరిగిన ఓ హత్యకేసులో ఇరువురు నిందితులకు జీవితఖైదు విధిస్తూ మరొకరిని నిర్ధోషిగా మార్కాపురం ఆరవ అదనపుజడ్జి రామకృష్ణ మంగళవారం తీర్పు చెప్పారు. పోలీసుల కథనం మేరకు రాచర్ల మండలం సోమిదేవుపల్లికి చెందిన కటారు శ్రీరంగయ్యను అదేగ్రామానికి చెందిన గంగుల శ్రీరాములు, బ్రహ్మయ్యలు హత్య చేసినట్లు అప్పట్లో పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణ జరిపిన జడ్జి నిందితులు నేరం చేసినట్లు సాక్ష్యాలు రుజువుకావడంతో మంగళవారం గంగుల శ్రీరాములుకు, గంగుల బ్రహ్మయ్యలకు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న టి కోటేశ్వరరెడ్డిని నిర్ధోషిగా ప్రకటిస్తూ తీర్పుచెప్పారు. ఈ హత్య కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న శ్రీరాములుకు గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం ఉండటం, మృతుడు శ్రీరంగయ్య గమనించడంతో ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో గొర్రెలు కాసుకుంటున్న ప్రాంతానికి వెళ్లి హత్య చేసినట్లు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా శిక్షపడిన ఇరువురికి 1000 రూపాయల చొప్పున జరిమానా విధించారు.