క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, మార్చి 21: అద్దంకి మండలం వేలమూరిపాడులో బుధవారం ఉదయం రుణబాధలతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి(చిన్న)(45) వేలమూరిపాడు గ్రామంలో భూమి కొనుగోలు చేసుకుని పంటలు సాగుచేసుకుంటున్నాడు. నిత్యం తన స్వంత గ్రామమైన ధర్మవరం నుండి వేలమూరిపాడు గ్రామంలోని పొలాలకు వచ్చి వెళ్ళేవాడు. పంటలు పండక అప్పులపాలై, అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక మంగళవారం రాత్రి తన ఇంటి నుండి వేలమూరిపాడు గ్రామంలోని పొలానికి వచ్చి కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగుమందు కలుపుకుని త్రాగి పొలంలోనే మృతి చెందాడు. బుధవారం ఉదయం చుట్టుపక్కల పొలాలకు చెందిన వారు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సుబ్బరాజు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భర్త
కంభం, మార్చి 21: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చేతిలో భార్య మృతిచెందిన సంఘటన కంభం మండలంలోని రావిపాడులో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం జె భూలక్ష్మి (26) భర్త నాగరాజుపై అనుమానం పెంచుకుని తరచూ గొడలకు పాల్పడేవారు. ఈనేపథ్యంలో బుధవారం ఇరువురూ ఘర్షణ పడ్డారు. ఇందులో భర్త కొట్టడంతో భూలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నాగరాజు ప్రయత్నించాడు. చుట్టుపక్కలవారు రావడంతో నాగరాజు పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.