పఠనీయం

వెలుగు..వెనె్నల ఇచ్చేది ఒక్కరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నల్లో సూర్యుడు
(కవిరాజు కావ్యాల్లో ఆధ్యాత్మికత)
రచన: డా.శ్రీమత్తిరుమల
వేంకట రాజగోపాలాచార్యులు
వెల: రూ.120/-
ప్రతులకు
నవజ్యోతి పబ్లిషర్స్,
జి.1, బ్లాక్ 1, డైమెండ్ ఎస్టేట్స్,
రామ్మూర్తినగర్, సిబిసిఐడి కాలని,
హైదర్‌నగర్, హైదరాబాద్-85.

సప్తాశ్వరథమారూఢం...అన్నట్లుగా కవిరాజు సూర్యరథం, సూర్యాధ్వజం, సూర్యకధారి, సూర్యాంశువులు, సూర్యపుత్రి, సూర్యోదయం, సూర్య పర్వాలు అనే ఏడు కవితా సంపుటాలను జవనాశ్వాలుగా పఠితృలోకంపై వెలుగుల జాలుగా వదలి, ఆనందనందనం అంతరంగాలలో ప్రతిష్ఠితం చేసినవాడు. చంద్రుడు- సూర్యుడు సౌందర్యానికీ, ఆధ్యాత్మికతకూ కేంద్ర బిందువులు. సౌందర్యం తల్లిగా ప్రయోజనం తండ్రిగా కవిత్వం ఒక రసానంద కల్పవల్లిగా పేర్కొంటారు కుందుర్తి. కవిరాజు కృతులలో ఆ రెండూ వున్నాయి. డాక్టర్ శ్రీమత్తిరుమల వేంకట రాజగోపాలాచార్యులుగారు కవిరాజు కావ్యాల్లోని ఆధ్యాత్మికతను ‘వెనె్నల్లో సూర్యుడు’గా గ్రంథస్థం చేశారు. ఆయనే అన్నట్లు ‘‘చంద్రునినుండి మనసు, సూర్యుని నుండి ఆత్మ అంటారు వేద ఋషులు. ఆ ఆత్మయే మనస్సుని, ప్రాణాన్ని, వాక్కుని ప్రచలితం చేసి వాఙ్మయం అవుతుంది. చంద్రుడు పరతూ ప్రకాశకుడు. చంద్రునిలోని చల్లని వెనె్నల సూర్యునిదే. కనుకనే కవిరాజు కృతుల్లో విసిరిన ఆధ్యాత్మికతకు ‘వెనె్నల్లోసూర్యుడు’అని నామకరణం చేయటం జరిగింది. కవిమిత్రుని కవితా కౌముదిలో ప్రతిబింబించిన ఆధ్యాత్మిక సూర్యుని దర్శింపచేసే గ్రంథం ఇది.
కవిరాజు తణుకు తాలూకా కాకరపర్రులో 1944లో జన్మించారు. ఐడిపిఎల్ హైదరాబాద్ భద్రతా విభాగంలో ఉద్యోగించి సూపర్‌వైజర్‌గా రిటైరయ్యారు. కీ.శే.ఆచార్య తిరుమల కవిరాజును సాహితీప్రపంచానికి పరిచయం చేయగా ఇప్పుడు తిరుమలవారి సోదరులు రాజగోపాలాచార్యులు ఈ సిద్ధాంత రచనతో కవిరాజు ఉన్నతిని బహిర్గతం చేస్తున్నారు. కవిరాజు కృతులు కొన్ని ఆంగ్లంలోకి కీ.శే.వడలి మందేశ్వరరావుగారు, హిందీలోకి ఎం.రంగయ్యగారు సంతరింపచేయగా నవలా కథారచయిత పి.చంద్రశేఖర్ అజాద్ తెలిమబ్బుల ఛాయ నవలను కవిరాజు జీవితం కవిత్వం ఇతివృత్తంగా రచించి ఆటావారి పోటీలో గెలుపొందారు కూడాను.
కవిరాజు కావ్యాలన్నింటినీ ఒక క్రమణికలో రాజగోపాలాచార్యులుగారు ఈ గ్రంథంలో పరిశీలించి కృష్ణ్భక్తి తత్పరుడయన కవిరాజు కవిత్వంలోని ఆధ్యాత్మిక కోణాలను విశే్లషించారు.
కృంగిపోతున్న సూర్యుణ్ణి చూసి బెంగపడకు
పొంగివస్తున్న చీకటిని చూసి కంగారుపడకు
అస్తమిస్తూకూడా హాయిగా నవ్వే
అతని ఆదర్శపు అరుణిమతో
నీ మనోదీపాన్ని వెలిగించుకో
అప్పుడు అనిపిస్తుంది
సూర్యుడు అస్తమిస్తున్నది అబద్ధమని
ఆవలిదిక్కున విస్తరిస్తున్నది నిబద్ధమని
అంటాడు కవిరాజు సూర్యరథంలో. తదాదిగా తన సప్తమ కావ్యం ‘సూర్యపర్వాలు’లో
అంతరిక్షం ఒక దివ్య ప్రయోగశాల
కిరణాలతో ఆత్మల్ని బట్వాడా చేసే సూర్యుడు
ఒక ఆరని హోమజ్వాల!
ఆత్మల ఖలేవని అవనిమీద నన్ను వదలినందుకు అనునిత్యం సూర్యునికి నమస్కరిస్తున్నాను సహ జీవనానికి అనుమతించినందుకు
..... అంతటా క్రీడించే ఆత్మలకు అంజలి ఘటిస్తున్నాను అని తత్త్వశిఖరాలను అధిరోహించిన కవిరాజు ఆధ్యాత్మిక కవిత్వ ఫణితిని రాజగోపాలాచార్యులు నిశిత పరిశీలనతో దృష్టారసహితంగా విశదపరిచారీ గ్రంథంలో. ఆధ్యాత్మిక తత్త్వదృష్టి, ప్రకృతి పరిరక్షణి దృష్టి జమలికలుగా కవిరాజు కవిత్వం అధిదైవతాన్ని చేరుకుంటూ పాఠకుడిని వెంట తీసుకువెడుతుందని చెప్పారు.
‘‘ఏదియొ అపూర్వ మధురశక్తి స్ఫురించుగాని అర్థమ్ముకాని భావగీతమ్ములది’’అని దేవులపల్లి అన్నట్లు కవిరాజు కవిత్వంలో అర్ధంకాని వున్నాయనీ అయినా ఆలోచింపచేస్తాయనీ అంటూ కవిరాజు కవిత్వంలో అనుభవం నినదిస్తుంది. ఆనంద వేదన పలకరిస్తుంది.
సామాజిక అవగాహనా పరోక్షంగా కనిపిస్తూనే ఆధ్యాత్మిక ఆముష్మిక చింతనలో సత్యం శివం సుందరం దృగ్గోచరవౌతూ మోక్షదాయకమవుతుంది అంటారు గ్రంథ రచయిత. ఇది ఒక సువ్యాఖ్యాన గ్రంథం.

- సుధామ