పఠనీయం

తిరుగీతికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుగీతికలు
(గోదా తిరుప్పావై - తెలుగు అను సృజన)
-డా.పుట్టపర్తి నాగపద్మిని
పేజీలు: 30.. వెల: రూ.50
ప్రతులకు: ఎన్.సి.హర్షవర్థన్
ప్లాట్ నెం.37, వంశీ నిలయం
తరుణా ఎవెన్యూ, ఈస్ట్ ఆనంద్‌బాగ్
మల్కాజ్‌గిరి, హైదరాబాద్-47

‘తిరుప్పావై’ అనగానే గుర్తుకు వచ్చేది ధనుర్మాసం (మార్గశీర్షము). ఈ మాసంలో గోదాదేవి ధనుర్మాస వ్రతంగా ఆచరించింది. ఈ తిరుప్పావై 30 పాశురాలలో ద్రవిడ ప్రబంధంగా పేరు వచ్చింది. రోజుకొక పాశురం చొప్పున 30 పాశురాలలో మాసమంతా వ్రతం జరుగుతుంది. మొదటి 5 పాశురాలలో వ్రత నేపథ్యం, వరుణ దేవునికి ఆహ్వానం, నామ సంకీర్తనం ఉంటాయి. తరువాత 10 పాశురాలలో గోపికలను నిద్ర నుండి లేపే మేల్కొలుపు తరువాత 10 పాశురాలలో నందగోపుని, యశోదమ్మను, బలరాముని మేల్కొలిపి తరువాత నీలాదేవిగా పురుషాకారంతో శ్రీకృష్ణుని మేల్కొలిపి మంగళాశాసనం చేసి తమ కోర్కెలను తీర్చమనే ప్రార్థనలు ఉంటాయి.
ఇది రచయిత్రి వృషభ గతి రగడలో రచించారు. ఈ వృత్తాలు మామూలుగా ఉదాహరణ కావ్యాలలో ఉంటాయి. పూర్వం ఈ సంప్రదాయం భగవంతుని ఉద్దేశించి రచించేవారు. ఇప్పుడు అలా కాదు. రచయిత్రి ఈ వృషభగతి రగడలను ఎంచుకోవడంలో ఔచిత్యం కనపడుతుంది.
ఎప్పుడు భగవంతుని చింతన, అనుస్మరణ మనస్సులో ఉదయిస్తుంటాయో అప్పుడే ఆ ప్రాణికి సుప్రభాతం. ఆ దివ్యరోచితస్సు కూడా భగవానుని కృపావేశం ప్రసరించకపోతే లభించదు’ అని ముందు మాటలో బులుసు వేంకటేశ్వర్లు అన్నారు. అది ఈ రచయిత్రికి పుష్కలంగా ఉంది.
ఈ ఆర్తి ప్రతి పాశురాన తొణికిసలాడుతున్నది.
రెండవ భాగంలో వేదాంత దేశికుల వారి గోదాస్తుతికి శ్లోకానుసరణ వ్రాసి రచయిత్రి తమ కవితాకౌశలాన్ని ప్రదర్శించారు.
*