పఠనీయం

పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079

*** ***** ******

ఇట్టి విషయమును విచారించగా ‘యచ్చాప్నోతి’ అనగా ఎందువలన పొందుచున్నాడు? ఏమి పొందుచున్నాడు? గాఢనిద్రలోనున్నపుడు అజ్ఞానము చేతనేకీభావము పొందుచున్నాడు. ఇచ్చట చెప్పబడిన ‘అజ్ఞానము’ కారణ శరీరమునకు చెందినది. అజ్ఞాన స్వరూపమైన కారణ శరీరమును అభిమానించు ఆత్మప్రాజ్ఞుడు. ఇచ్చట ప్రాజ్ఞుడనగా ‘ప్రజా ఏవ ప్రజ్ఞాః’ బాగా తెలిసినవాడు అని ఒక అర్థమయితే రెండవ అర్థం ‘ప్ర+అజ్ఞ’- ఏమియు తెలియనివాడు అని అర్థం. ఇక్కడ సుషుప్తి (నిద్ర)యందు ‘ఆత్మ, అజ్ఞానోపాధియందుండుటచే బయటి విషయములు తెలియనివాడని (ప్ర+అజ్ఞుడని) సంకేతార్థము, వ్యవహారమునకు వచ్చినదనుకోవచ్చు.
యదాదత్తే: మేల్కొని (జాగ్రదవస్థలో) యున్నపుడు తాను పొందిన అనుభవములను, వాసనారూపముగా గ్రహించును. సుషుప్తిలోనున్నపుడు, వానికుత్తేజము కలిగినపుడు, అవి స్వప్నములుగా మారును. ఇచ్చట విచారించవలసినదేమనగా, స్వప్న ప్రపంచము కలగనువానికి లోపల యున్నదా, బయట యున్నదా! లేక లోపల వుండి బయట వున్నట్లు భ్రాంతి కలిగించుచున్నదా!
స్వప్నమున తాను చూచినవన్నియు, స్వప్నమునుండి మేల్కాంచిన పిదప, మిథ్యగా తలంచినట్లుగా, జాగ్రదవస్థయందు, తన బుద్ధి, ఇంద్రియాదులచే తాను చూచిన తెలుసుకొనిన ప్రపంచమంతయును, ఏ గురూపదేశముచేతనో, శాస్తజ్ఞ్రానము చేతనో, సత్యానే్వషణ చేతనో, ఈ దృశ్యమాన జగత్తంతయును స్వప్న తుల్యమని నిర్ణయించుకొను నవకాశము కలదా అని ప్రశ్నించిన యెడల, అట్టి అవకాశము కలదనియే చెప్పవలసి వచ్చును. కఠోరయోగ సాధనచే, నిశ్చల ధ్యానముచే తురీయావస్థను పొందినచో, అపరోక్షానుభూతి పొందినచో, ఈ దృశ్యమాన జగత్తంతయు, స్వప్నతుల్యము, ప్రాతిభాసికయేయగును కదా.
యచ్ఛాత్తి విషయానిక:
ఇంద్రియ భోగములననుభవించుచు, భౌతిక శరీరముపై అనురక్తిచే ఆత్మకు విశ్వుడని ప్రశస్తి కలిగినది. ఇట్టి ఆత్మ విశ్వమందెప్పుడు పరిభ్రమించుచునే యున్నది. అదియెట్లనిన ఒక వ్యక్తి తాను భుజించు అన్నరసాదుల (ఆహారము) చేత, స్ర్తి పురుష, భేదముననుసరించి, శుక్రశోణితములనుపొంది, వాటి కలయికచే ‘అంగాదంగాస్సమ్భవతి’ అను రీతిగా తిరిగి, తిరిగి, పునః పునః కర్మానుసారముగా శరీరములను పొందుచు, ‘పునరపిజననం - పునరపి మరణం- పునరపిజననీ జఠరేశయనం’ అన్న చందమున, ఆత్మవిశద్యుడనబడుచున్నాడు. ఆ విధముగా ఆత్మ. 1.అజ్ఞానరూపమైన శరీరమందుండి, సుషుప్తిలో కారణ శరీరముతో ప్రాజ్ఞుడనియు 2.తేజఃపదార్థ రూపముగల శరీరమునందు స్వప్నములో సూక్ష్మశరీరియై తేజసుడనియు. 3.్భతికపదార్థ శరీరముతో జాగ్రదావస్థయందు, స్థూలశరీరముతో విశ్వుడనియు. 4.సమిష్ఠిరూపమున, ఈశ్వరుడని, విరాట్పురుషుడని చెప్పబడుచున్నా, పైన చెప్పిన అవస్థలన్నింటియందు ఉపాధులు వేరువేరుగానున్నను, అంతర్లీనముగా, అనుస్యూతముగా తానుండుటచే ‘ఆత్మ’ ఒక్కడేయని తెలియుచున్నది. పరిణామ ప్రక్రియలో, అనుస్యూతముగ, ఎడతెగని భావరూపముననున్నది, సదాత్మకమగు (సత్+ఆత్మ) ఆత్మయని తెలియుచున్నది. దేశకాలములకు, సదసదతీతమై అనగా ప్రకృతి, వికృతులకతీతమైనది ఆత్మయని తెలుసుకొనవలెను. ఆత్మస్వరూపము, మరియు ఆత్మ సాక్ష్యాత్కార స్థితిని గురించి ‘ఈశావాస్సోపనిషత్తు’ 4వ మంత్రము నుండి 8వ మంత్ర (శ్లోకం) వరకు రుూ క్రింది విధంగా చర్చించింది. - ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590