పఠనీయం

తరతమ భేదాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
===========================================================
ఒకసారి జైలునుంచి తిరిగి వచ్చేసరికి ఇంటివద్ద ఆయన స్నేహితుడు పొలాక్ భార్య చాలా బలహీనంగా చిక్కిపోయి కనిపించింది. ఆమె శిశువుకు తల్లిపాలు మానిపించాలని ప్రయత్నిస్తోంది. ఆ పిల్ల ఎప్పుడు ఏడుస్తూ తల్లికి నిద్ర, విశ్రాంతి లేకుండా చేస్తోంది. ఆ రోజు రాత్రే గాంధీ శిశువు బాధ్యతను తీసుకున్నాడు. రోజంతా నాలుగు మైళ్ళు నడిచి, బహిరంగ సభలలో ప్రసంగించి కష్టపడి దాదాపు రాత్రి ఒంటిగంటకు ఇంటికి చేరిన తర్వాత కూడా ఆ శిశువును తల్లి వద్దనుండి తీసుకుని తన వద్ద పడుకోబెట్టుకునేవాడు. కానీ నీళ్ళకోసం కూడా లేవకుండా శిశువు ఆయన పక్కకు హాయిగా నిద్రపోయేది. దాదాపు ఒక పక్షం రోజుల తర్వాత ఆ బిడ్డకు తల్లిపాలు విజయవంతంగా మానిపించగలిగింది.
పెద్దలపట్ల గాంధీకి వున్న గౌరవం అపారమైనది. గాంధీ వద్ద గోఖలే ఉన్నపుడు గాంధీ ఆయన కండువా ఇస్ర్తిచేశాడు, ఆయనకు పక్క వేశాడు, ఆయనకు ఆహారం వడ్డించేవాడు, పాదాలు వత్తేందుకు కూడా సిద్ధంగా ఉండేవాడు. గోఖలే అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకొనేవాడు కాదు. మహాత్ముడు కాక ముందు గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చినపుడు కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యాడు. అక్కడ మరుగుదొడ్లు శుభ్రం చేశాడు. ఆ తర్వాత ఒక వృద్ధ కాంగ్రెస్ నాయకుడిని ‘నేను మీకేమైనా సహాయం చేయగలనా?’ అని అడిగాడు.
‘‘సమాధానం రాయాల్సిన ఉత్తరాలు గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి. ఆ పని చేసేందుకు నాకు గుమస్తాలు లేరు. నువ్వేమైనా ఆ పని చేయగలవా?’’ అని ఆ నాయకుడు అన్నాడు. ‘‘తప్పకుండా. నాకు చేతనైన పనేదైనా చేయడానికి నేను సిద్ధమే’’ అంటూ గాంధీ ఆ పనిలోకి దిగి త్వరలోనే ఆ పని పూర్తిచేశాడు. తర్వాత ఆ నాయకునికి సహాయకునిగా వ్యవహరిస్తూ ఆయన కోటు బొత్తాలు పెట్టాడు, ఇతర చిన్న చిన్న పనులలో సహాయం చేశాడు.
ఆశ్రమంలో అనుభవంగల సహాయకుడి అవసరం ఎప్పుడు కలిగినా ఆ పనికి హరిజన సేవకుడిని ఉపయోగించేందుకు గాంధీ ఆసక్తి చూపేవాడు. తద్వారా అంటరానితనమనే అడ్డంకిని నిర్మూలించాలని ఆయన ఉద్దేశ్యం. ‘‘మనం సేవకులను జీతాలు తీసుకునే కార్మికుల్లా కాకుండా సహోదరుల్లా చూసుకోవాలి. దానివల్ల కొన్ని ఇబ్బందులు, దొంగతనాలు, కొంచెం ఎక్కువ ఖర్చు ఉండొచ్చు. కానీ దాని మంచి ఫలితం తప్పకుండా కనపడుతుంది’’ అనేవాడాయన.
ఆయనకు ఎవరినైనా సేవకులుగా ఎలా ఉంచుకోవాలో తెలియదు. కానీ భారతీయ జైలులో ఉండగా ఒక సందర్భంలో ఆయన సహఖైదీల సేవలు పొందాడు. ఒకరు ఆయన తినే ఫలాలు కడిగిపెట్టారు. మరొకరు మేకలకు పాలు తీసి పెట్టారు. ఇంకొకరు ఆయనకు వ్యక్తిగత సహాయకునిగా పనిచేశారు. ఒక బ్రహ్మణుడు ఆయన కంచాలు కడిగాడు. ఇద్దరు యూరోపియన్లు ఆయన మంచం మోసుకొచ్చి పక్కవేశారు.
ఇంగ్లాండులోని ధనవంతుల కుటుంబాల్లో ఇంటి పనిమనుషులకు, యజమానులకు మధ్య కుటుంబ తరహా సంబంధాలుండటం గాంధీకి సంతోషం కలిగించింది. అతిథులకు సేవకులను పరిచయం చేసేటప్పుడు వారు తమ కుటుంబ సభ్యులుగా యజమాని పరిచయం చేయడాన్ని ఆయనెంతో మెచ్చుకొనేవాడు.
ఒకసారి ఒకరింట్లో చాలాకాలం అతిథిగా ఉండి వచ్చేస్తున్న సందర్భంలో ఆ ఇంటి సేవకులకు వీడ్కోలు చెబుతూ ‘‘నేను మీకెంత కృతజ్ఞుడినో చెప్పలేను. నా జీవితంలో ఎవరినీ సహోదరులుగా తప్ప సేవకులుగా భావించలేదు. ఇక నుంచి మీరు కూడా నా సహోదరులే. మీ సేవలకు బదులు చెల్లించడం నా పరిధిలో వున్నది కాదు. కానీ భగవంతుడు మీకు తప్పక ప్రతిఫలం చెల్లిస్తాడు’’ అన్నాడు గాంధీ.
వంటవాడు
గాంధీగారిని మహదేవ దేశాయి ఒకసారి అడిగాడు ‘‘బాపూజీ, ఫీనిక్స్ సెటిల్‌మెంటులో (దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షతకు వ్యతిరేకంగా అహింసాయుత నిరసన (పాసివ్ రెసిస్టెన్స్)ను ఆచరించడానికి వీలుగా దర్బన్ సమీపంలో 1904లో గాంధీ స్థాపించిన ఆశ్రమం) చేరకముందు ‘‘మీకు వంటవాడు ఉండేవాడా?’’ ‘‘లేదు. నేను అంతకన్నా ముందే వంటవాడిని వదిలించుకున్నాను. మాకు మొదట్లో మంచి వంటవాడు ఉండేవాడు. ఐతే సుగంధద్రవ్యాలు, మసాలా లేకుండావంట చెయ్యలేనన్నాడు.