పఠనీయం

శ్రమదోపిడి అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
=======================================================
ఆశ్రమ సరిహద్దులకు బయటున్న నూతిలోంచి నీరు తోడుకురావటం రోజువారీ పనుల్లో ఒకటి. ఒక రోజు గాంధీకి కొంచెం నలతగా ఉంది. ఐనా పిండి విసరడంలో పాలుపంచుకున్నాడు. గాంధీని మరింత శారీరక శ్రమ నుంచి రక్షించాలనుకున్న ఒక సహచరుడు ఇతర ఆశ్రమ వాసుల సహాయంతో ఆశ్రమంలో వున్న చిన్నా పెద్దా పాత్రలన్నింటినీ నీటితో నింపేశాడు. గాంధీకి ఈ ఆలోచన నచ్చలేదు. ఆయనకు బాధ కలిగింది. ఒక చిన్నపిల్లాడి స్నానపు తొట్టిని తీసుకెళ్ళి దాన్ని నీటితో నింపి తలమీద పెట్టుకొని మోసుకొచ్చాడు. తన పొరపాటును సహచరుడు పశ్చాత్తాపపడ్డాడు. ఏదైనా పని చేయడం శారీకరంగా అసాధ్యమైతే తప్ప, తాను పెద్దవాడిననో, మహాత్ముడిననో రోజువారీ పనుల నుంచి దూరంగా ఉంచడం గాంధీకి అసలు నచ్చేది కాదు. ఏ పని చేయడానికైనా ఆయనకు అసాధారణమైన శక్తి, పట్టుదల ఉండేవి. ఆయనకు విసుగు తెలియదు.
బోయర్ యుద్ధంలో (రెండవ బోయర్ యుద్ధం 1899లో మొదలై 1902 వరకు సాగింది. ఆరెంజ్ స్టేట్, సౌత్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లపై యునైటెడ్ కింగ్‌డమ్ జరిపిన ఈ యుద్ధంలో బ్రిటీష్ సామ్రాజ్యపు సైన్యాలు మద్దతునిచ్చాయి. ఈ యుద్ధంలో బ్రిటన్ గెలిచి ఆ రెండు దేశాలను తన సామ్రాజ్యంలో కలుపుకుంది) స్ట్రెచర్ మోసేవాడిగా ఆయన రోజుకు 25 మైళ్ళవరకు నడిచేవాడు. ఆయన గొప్ప పాదచారి. టాల్‌స్టాయ్ ఫార్మ్ నుంచి తరచు రోజుకు 42 మైళ్ళు నడిచేవాడు. ఇంటివద్ద చేసిన తినుబండారాలు తిని మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరితే, కొనుగోళ్ళు ముగించుకొని రాత్రికి తిరిగి వచ్చేవాడు. ఇతర స్నేహితులు, చిన్నవారైన సహచరులు ఆయన ఉదాహరణను ఉత్సాహంగా అనుసరించేవారు.
ఒకసారి ఒక చెరువును కొంతమంది పనివారు తవ్వుతున్నారు. ఒక రోజు పని తర్వాత వాళ్ళు తవ్వగాల, పార, తట్టలతో తిరిగి వచ్చేసరికి వారికోసం చాలా పళ్ళాల నిండా ఫలహారం సిద్ధంగా ఉండటం చూశారు. వాళ్ళల్లో ఒకరు ‘‘ఎందుకు మీరింత శ్రమ తీసుకున్నారు? మేము మీతో ఇలా పనిచేయించుకోవచ్చా?’’ అని అడిగారు. ‘‘దానిదేముంది. పని నుంచి తిరిగి వచ్చేసరికి మీరు అలసిపోయి ఉంటారని నాకు తెలుసు. నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి మీకు ఫలహారం సిద్ధంచేశాను’’ అని గాంధీ చెప్పాడు.
దక్షిణాఫ్రికాలోని భారతీయులకు నాయకుడిగా ప్రసిద్ధి చెందిన గాంధీ అక్కడ స్థిరపడిన భారతీయుల గురించి వాదించేందుకు ఒకసారి లండన్ వెళ్లాడు. ఆయన్ను అక్కడున్న భారతీయ విద్యార్థులు శాకాహార విందుకు ఆహ్వానించారు.
ఆ విందుకు కావలసిన వంటలు వాళ్ళు స్వయంగా చేద్దామనుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక బక్కపలుచటి వ్యక్తి వారితో కలిసి గినె్నలు కడగడం, కూరగాయలు కోయడం లాంటి పనులు చేయడం మొదలుపెట్టాడు.
ఆ తర్వాత అక్కడకు వచ్చిన విద్యార్థి నాయకునికి ఆ వ్యక్తి ఎవరో కాదు వారిచ్చే విందులో ముఖ్య అతిథి అయిన మహాత్మాగాంధీనే అని తెలిసింది. పనులు చేయడం విషయంలో కఠినంగా ఉండే గాంధీ తనకోసం ఎవరైనా పనిచేయడం సహించేవాడు కాదు. ఒక రాజకీయ సమావేశం తర్వాత రాత్రి 10 గంటల సమయంలో పడుకొనేముందు ఆయన తన గది ఊడ్చుకుంటూ కనిపించాడు. ఆయన గ్రామాల్లో యాత్రలో వున్నపుడు లాంతరులో నూనె అయిపోయి ఆరిపోతే అలసి నిద్రపోతున్న తన సహచరులను నిద్రలేపటం ఇష్టం లేక, వెనె్నల్లో కూర్చుని ఉత్తరాలు రాసుకొనేవాడు. నోవాఖలి యాత్ర సమయంలో తన శిబిరంలో కేవలం ఇద్దరు సహచరులను మాత్రమే ఉండనిచ్చాడు. వారికి ఖాక్రా (గోధుమ పిండిని గుండ్రటి ముద్దలుగా చేసి నిప్పులో కాల్చి తయారుచేసిన దానిని ఖాక్రా అంటారు) తయారుచేయడం ఎలాగో తెలియదు. గాంధీ వంటింట్లోకి వచ్చి ఒక నిపుణుడిలా కూర్చుని వాటిని ఎలా చెయ్యాలో వారికి చేసి చూపించాడు. అప్పుడు ఆయన వయస్సు 78 సంవత్సరాలు.
ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. రెండు నెలల వయసు తర్వాత ఆయన కొడుకులని ఎప్పుడూ నర్సు సంరక్షణలోగాని, పనివారి సంరక్షణలోగానీ ఉంచలేదు. ఒక శిశువు అభివృద్ధికి తల్లిదండ్రుల ప్రేమ, అభిమానం అత్యవసరమని ఆయన నమ్మకం. ఆయన శివువును తల్లిలా లాలించి, నవ్వించి, ఆహారం పెట్టగలిగి ఉండేవాడు.