పఠనీయం

స్నేహ ప్రపంచంలో విశిష్టవ్యక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా జ్ఞాపకాల్లో కె.వి.ఆర్
వెల: రూ.80/-
వకులాభరణం లలిత, రామకృష్ణ కె.వి.ఆర్ శారదామి స్మారక కమిటీ, శాంతి నర్సింగ్‌హోం,
నిర్మలా కానె్వంట్ ఎదురుగా, పడమట, విజయవాడ-10,
=============================================================
తెలుగు సాహిత్యంలో ఆధునిక, అభ్యుదయ, విప్లవ సాహితీవేత్తగా ప్రముఖుల్లో కె.వి.రమణారెడ్డి ఒకరు. కె.వి.ఆర్‌గా లబ్దప్రతిష్ఠడాయన. కనుపూరు వెంకట రమణారెడ్డి 1928 మార్చి 23న నెల్లూరు జిల్లా కోవూరు రేబాల గ్రామంలో కామమ్మ, చెంచురామిరెడ్డిలకు రెండవ సంతానంగా జన్మించారు. చిన్నతనంలోనే గురుకులం లాంటి వ్యవస్థతో విద్యాపరంగా, సాంస్కృతికంగా మంచి పునాది ఏర్పడిన కె.వి.ఆర్ సంగీత ప్రియుడు కూడాను.
ఉన్నత విద్య బుచ్చిరెడ్డిపాలెం హైస్కూల్‌లో సాగింది. అప్పుడే ఆంగ్ల భాషాభిమానం, చరిత్ర అధ్యయనాసక్తి, రాజకీయ స్పృహ ఏర్పడ్డాయి. నెల్లూరు వి.ఆర్.కళాశాలలో ఇంటర్ చదువుతున్నపుడే నాటి జాతీయోద్యమ దశలో కెవిఆర్ సుభాష్ చంద్రబోస్‌పట్ల ఆకర్షణకు లోనయ్యారు. అలా ఒకరకంగా అతివాద భావాలకు అంకురార్పణ జరిగింది. ‘క్షాత్రవాణి’ అనే లిఖిత పత్రికను సంపాదకునిగా నడిపారు. వామపక్ష భావాలవైపు మొగ్గు ఏర్పడింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించిన కాలంలో ఆయన భావాలకు గట్టి పునాదులు పడ్డాయి.
తెలుగు సాహిత్య కృషి, మార్క్సిస్టు సిద్ధాంత అధ్యయనం అక్కడే మొదలయ్యాయి. 20 ఏళ్ళ వయసులో అనిసెట్టి సుబ్బారావు పరిచయ ప్రభావంతో కెవిఆర్ కవిత్వ రచనకు శ్రీకారం చుట్టారు. అలాగే ఏటుకూరి బలరామమూర్తిగారి రాజకీయ వ్యాసాల పఠనంతో రాజకీయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ‘ఆజాద్ హింద్’ పత్రికను మిత్రులతో కలిసి నడిపారట. వాల్తేరునుండి నెల్లూరు వెళ్లి ఐఎఎస్ పరీక్ష రాసి రాత పరీక్షలో నెగ్గినా వౌఖిక పరీక్షలో ఆయన రాజకీయ నేపథ్యం కారణంగా ఎంపిక కాలేదు. 1949 మే 6న వాల్తేరులో ఆనర్స్ చదువుతూండగానే ఆయనకు శారదాంబగారితో వివాహం జరిగింది. మామది ఆర్‌ఎస్‌ఎస్ భావాలు. ఈ అల్లుడికి వామపక్ష భావాలు. ఆయన జీవితకాలం మొత్తంలో అత్తమామలతో ఒకటి రెండు పొడి మాటలు మినహా మాట్లాడిన సందర్భాలు లేవట! గూడూరులో కాపురం పెట్టి నెల్లూరు ‘అరుణరేఖ’ పత్రికలో పనిచేస్తూ రాకపోకలు చేసేవారట.
1956లో కావలి కళాశాల చరిత్ర విభాగంలో లెక్చరర్‌గా చేరడం ఓ మలుపు. (1965లో ఆ కళాశాలయే జవహర్‌భారతిగా రూపుదాల్చింది) అంతకుముందు కొన్నాళ్ళు ఒంగోలు కళాశాలలో స్పెషల్ ట్యూటర్‌గా చేశారు. కావలికి రావడం ఆయన భవిష్యత్తులో ప్రధాన మలుపు. అప్పటికే అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖంగా వుంటూ వచ్చినా, వామపక్ష భావజాలాన్ని సంతరించుకుని ఆయన సాహిత్య, రాజకీయ ప్రస్థానం, వ్యక్తిత్వ వికాసంతో కావలినుండే దూసుకువెళ్ళింది. క్రమేపీ సిపియం వైపు మొగ్గుచూపి నక్సలైట్ ఉద్యమ భావజాలానికి దగ్గరయ్యారు.
పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్ర రాద్దామని సేకరించిన సమాచారం మార్క్సిస్టు పార్టీకి ఇచ్చేసినట్లే శ్రీశ్రీ జీవిత చరిత్ర రాయాలనుకుని సేకరించిన సమాచారం అంతా ఆరుద్రగారికి ఇచ్చేశారు. అకడమిక్ పరిశోధనలపై కెవిఆర్‌కు సదభిప్రాయంలేదు. కానయితే తరగతి గదిలో ఆయన ఇచ్చే ‘నోట్సు’ ఉన్నదున్నట్టు అచ్చువేసేంత పకడ్బందీగా వుండేది.
కళాశాల జీవితంలో, ఉద్యోగంలో వున్నపుడే కెవిఆర్ రెండుసార్లు అరెస్టుయ్యారు. 1974లో సికింద్రాబాద్ కుట్ర కేసు మొదటగా ఎదుర్కొన్నారు. మూడు నెలలు జైలుశిక్ష అనుభవించారు. అపుడు రోజువారీగా రాసిన డైరీ ‘జైల్లో మూణ్ణెల్ల ముచ్చట’గా గ్రంథస్థమైంది కూడాను. 1955 ప్రాంతాల్లోనే ఆయన తొలి కవితా సంపుటి ‘అంగారవల్లరి’ వెలువడింది. దిగంబర కవిత్యోద్యమాన్ని కెవిఆర్ వత్తాసు పలకలేదు. అయితే అరసం పట్ల విముఖత కలిగి విశాఖలో శ్రీశ్రీ షష్టిపూర్తి సభలో సాహిత్య వ్యక్తిగా విరసం ఆవిర్భావంతో ఆయన పునర్జన్మ ఎత్తాడు. 1948లో విశాఖలో అరసం సభ్యుడై ఆ సంస్థకు అపార సేవలందించిన కెవిఆర్ విరసంలో చేరాక ముందున్న స్నేహాలు దూరమయ్యాయి. అవి ఆయనకు మనస్తాపం కలిగించాయి. వారితో వాదోపవాదాల లేఖలు సాగాయి. ఆధునిక సాహిత్య రచన విషయంలో గురజాడపై ఆయన రాసిన ‘మహోదయం’ మొదలు గద్దర్ ‘పోరాట ప్రజల గుండెచప్పుళ్ళు’ ప్రతిస్పందనదాకా ప్రజాస్వామిక సంస్కృతిని వివరించడంలో ఆయనకు ఆయనేసాటి. సాహసికమైన సత్యనిష్ఠతో విమర్శకునిగా కె.వి.రమణారెడ్డి ఎంతో ప్రసిద్ధికెక్కారు.
అటువంటి కెవిఆర్‌తో వకులాభరణం రామకృష్ణ, లలిత గారలు ఆయన స్నేహ ప్రపంచంలోని విశిష్ట వ్యక్తులుగా తలపోసుకుని అందించిన విలువైన జ్ఞాపకాల సంపుటీకరణం ‘మా జ్ఞాపకాల్లో కెవిఆర్’ గ్రంథం. తమ కుటుంబంతో ఆయనకున్న స్నేహం, అనుబంధం కలబోసుకుంటూ, తమ కోణం నుంచి కెవిఆర్ వ్యక్తిత్వాన్ని, ఆయన పుస్తకాలకు రామకృష్ణగారు రాసిన ముందుమాటలుని, అలాగే కెవిఆర్ వకుళాభరణం రామకృష్ణగారికి రాసిన జాబులునూ ఈ గ్రంథంలో పొందుపరిచారు.
మార్క్సిస్టు మేధావిగా, సాహితీవేత్తగా ఖ్యాతిగాంచిన కె.వి.రమణారెడ్డిగారిని అక్షరాలా మూర్తిమత్వం గావించిన ఈ పుస్తకం అవశ్య పఠనీయం.

-సుధామ 98492 97958