Others

అవగాహనతోనే అవినీతికి కళ్ళెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా మంచి పని చేద్దాం రండి అంటే రాని మన సమాజం దోచుకుందాం రా.. అంటే మన సమాజం లేచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ‘మమ్మల్ని పరిపాలించండి సార్’ అని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కిన తర్వాత దోచుకోవడం, దాచుకోవడం అంటేనే పాలన అన్నట్లుగా వ్యవహరిస్తుంది రాజకీయం. ప్రజలు రాజకీయ నాయకులని మించి సలహాలిచ్చే సమాజాన్ని అభివృద్ధి చెయ్యండి అంటూ అధికారాన్నిస్తే ప్రభుత్వాధికారులు పాలకులతో కుమ్మక్కయిపోయి అవినీతికి పాల్పడుతున్నారు. ప్రపంచంలో ఒక్కరోజు జరుగుతున్న అవినీతి 620 లక్షల కోట్ల రూపాయలు. కనీసం ఒక రోజయినా అవినీతి చెయ్యకపోతే 620 లక్షల కోట్ల రూపాయలు మిగిలిపోతాయనే ఉద్దేశంతో ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవంగా పేర్కొన్నారు. కానీ యిప్పట్లో అవినీతి ఏమి ఆగే పరిస్థితి మచ్చుకు కూడ కన్పించడం లేదు.
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం ఆర్థికంగా అభివృద్ధిచెందుతుంది. అలాంటి ఊర్లు, గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ మూల పురుషుడు. నిస్వార్థంగా సేవలందించి, ప్రజలకు సేవలు చెయ్యాల్సిన సర్పంచ్‌లు కాసులకోసం కక్కుర్తి పడుతున్నారు. నిధులు వస్తే చాలు పనులుచేయకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పారదర్శకత పాటించాల్సినవారు డబ్బుకోసం అవినీతికి పాల్పడుతున్నారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాల్సిన వీరు నిధులు స్వాహాచేస్తూ కళంకం తెస్తున్నారు. ఎవరి విషయంలోనైనా అవినీతి నిర్ధారణ అయితే వారి చెక్‌పవర్ రద్దుచేయాలి. నిధులు స్వాహాచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన సర్పంచ్‌లు మళ్ళీ ఎన్నికల్లో పోటీచెయ్యకుండా చట్టం తీసుకువచ్చి, వాటిని సక్రమంగా అమలుపరచాలి.
అలాగే ఆర్థిక వృద్ధిరేటు అన్ని పాయింట్లు మెరుగుపరుస్తాం, ఇన్ని పాయింట్లు మెరుగుపరుస్తాం అంటూ రేట్లు పెట్టుకొనే అధికారులు అవినీతి విషయంలో ఏం మాట్లాడరు. దేశానికి ఉన్న చెడ్డ ఇమేజ్‌ని దూరం చెయ్యడానికి ఏమాత్రం ప్రయత్నం చెయ్యరు! ఏ ఒక్కరు కూడ అవినీతి నిర్మూలనకి ఉద్యమించరు. అన్నాహజారే లాంటి వారు ఉద్యమాలు, ధర్నాలు చేస్తుంటే వారితో చేతులు కలుపుతారే తప్ప అవినీతిని సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చెయ్యరు ఏ ఒక్కరూ కూడా. ఈ విషయం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్ నేషనల్ సర్వే స్పష్టం చేసింది. 100కు 100 పాయింట్లు సాధించిన దేశాలకు అవినీతి రహిత దేశాలుగా గుర్తింపు నిద్దామని లెక్కలుకడితే మన భారతదేశం 36 పాయింట్లతో పాస్ మార్కులు తెచ్చుకోవడానికే పరిమితమైంది. 64 పార్కులు వెనుకబడి 176 దేశాలలో 94వ స్థానానికి పరిమితమైంది. నూటికి నూరుపాళ్ళు వున్న మన దేశం ఇమేజ్‌ని నూరవ ర్యాంక్ సమీపంలో వుండేలా చేసింది. దేశాన్ని, పట్టిపీడిస్తున్న అవినీతి ఆర్థికాభివృద్ధికి పెద్ద అడ్డంకిగా తయారైంది. నాయకులు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవినీతిని అంతం చెయ్యకుండా సాధించేదీ శూన్యమని సర్వే తేల్చిచెప్పింది. ఎంతమంది నాయకులు వచ్చినా అవినీతిని అరికట్టలేకపోతున్నారు. దీర్ఘకాల రోగమైన అవినీతి అన్ని రంగాలకు పాకింది.
పాలకుల్ని చూసి ఉన్నతాధికారులు, వాళ్ళని చూసి క్రిందిస్థాయి ఉద్యోగులు, వీళ్ళందర్నీ చూసి అందర్ని సమన్వయపరిచే బ్రోకర్లు ఇలా లంచాల రూపంలో అవినీతి సంపాదన అనేది అతి సహజమైన వ్యసనంగా మారి పోయింది. ఎప్పుడు చేస్తారని ఓటరు ప్రజలు, నిలదీసి పనిచేయించుకోవాల్సిన ప్రజాస్వామ్యంలో ఎందుకు చేస్తారు అనే పరిస్థితిలో వున్నాం మనం. దేశాన్ని క్యాన్సర్ నుండి కాపాడే మందులున్నాయి కాని, దేశాన్ని అవినీతి నుంచి రక్షించేవాళ్ళు లేక భరతమాత విలవిల్లాడిపోతుంది. బ్రిటీష్ వారినుంచి రక్షణ కల్పించిన మహాత్మాగాంధీ సైతం అవినీతి జాఢ్యాన్ని రూపుమాపలేక పోయారంటే ఇక అవినీతి రహిత సమాజం కావాలంటే ఎంతమంది గాంధీజీలు వచ్చి పోరాడాలో మనం ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితిలో అవినీతి వ్యతిరేక దినం మనం పాటించాల్సి రావడం దురదృష్టం అనుకోవాలో, అదీ ఒక మంచి పరిణామం అనుకోవాలా? అనే సందిగ్ధంలో మనం వున్నాం. ఈ ఒక్కరోజు విలువ 620 లక్షల కోట్లు. అందులో మన వాటా సగం. ఈ ఒక్కరోజన్నా, అవినీతిని ఆపగలిగితే మన దేశానికి 310 లక్షల కోట్లు ఆదా అయినట్లే. ఈ డబ్బు ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది.
ప్రజలకు సేవలందించడానికి అధికారులున్నారు. వారు అందించే సేవలకు జీతం యిస్తున్నారు. దాంతో తృప్తిపడితే ఒక పద్ధతిగా వుంటుంది. వచ్చే జీతంకన్నా ఎక్కువ కావాలి అని ఆశించడమే అవినీతి. అవినీతికి పాల్పడిన వాళ్ళని సమాజం చిన్నచూపు చూసిన రోజున ఈ అవినీతి కొంతమేర తగ్గే అవకాశం వుంది. కాని ‘ఎవరైనా, ఏమైనా తినండి నేను డబ్బులిస్తాను, నా పని నాకు చేసిపెట్టు’అనే ప్రజలు కూడ వున్నారు. ఈ పద్ధతి ఇలా మ్యూచువల్‌గా తయారైంది. ముందు సామాన్య మానవునిలో కూడా మార్పు వస్తే కానీ అవినీతి నిర్మూలన అనేది జరగదు. ఇలా అవినీతి అనేది ఆర్థిక అవివీతి, ఆలోచనా విధానంలో అవినీతి. ఇది సమాజంలో పూర్తిగా చొచ్చుకుపోయింది. ముందు వ్యవస్థలో ప్రక్షాళన రావాలి. మనం మన డిపార్టుమెంట్లు, శాఖలు దాటిపోయాము. ఎల్లలు దాటేసి పంచభూతాలను కూడా కబ్జాచేసి అవినీతికి పాల్పడుతున్నారు.
ఇంకా ప్రజలు కూడా ‘మా కోసం ఏం చేస్తారు?’ అని కాకుండా ‘మాకు ఎంతిస్తారు?’ అనే స్థాయికి ప్రజలు వచ్చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది కూడా ఇదే. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రజల తప్పనుకోవాలా? అవినీతికి కూడ ఇదే మూలం. ముందుగా ప్రజల్లో అవగాహన రావాలి. ఎలాంటి లీడర్ అయితే మన అవసరాలు తీరుస్తారు, సమాజానికి ఉపయోగపడతారు అని ఆలోచించి ఓటెయ్యాలి. అప్పుడు కొంతవరకు అవినీతిని అరికట్టగలుగుతాం. నేటి బాలలే రేపటి పౌరులు అన్న వ్యవస్థను తయారుచేస్తున్న విద్యావ్యవస్థలో కూడ అవినీతి కొంతమేర వుంది. ర్యాంకులు కొనుక్కోవడం, మాస్ కాపీయింగ్, అడ్మిషన్స్ మొదలైన వాటికి లంచం బాగా వుంది. మన ప్రభుత్వ రంగంలోనే అవినీతి వుంది, ప్రైవేట్ వ్యాపారంలో ప్రక్షాళనలతో చాలా అద్ధుతంగా వుంది అనుకొంటాము. ప్రైవేటు రంగంలో కూడ ఏమాత్రం తీసిపోకుండా అవినీతి వుంది. ఆఖరికి మత సంస్థల్లో, స్వచ్ఛంద సంస్థల్లో కూడా అవినీతి రాజ్యమేలుతుంది. ఎక్కడ స్టార్ట్ చెయ్యాలి ఎక్కడ ఎండ్ చెయ్యాలి అనే దానికి కొలబద్దలేకుండా అన్నిచోట్ల అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలుతుంది. దాన్ని మార్చాలని చూసేవాళ్ళు కొంతమేర మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మనీ ఎట్ పవర్. ఇదీ ఎప్పుడు కూడ మనిషిని సంతృప్తిపరచలేదు. ఎక్కువ వుంటే యింకా యింకా కావాలనిపిస్తుంది. నలుగురికి హెల్ప్‌చేస్తే వచ్చే సంతృప్తి, ఆనందం లంచం తీసుకొంటే వస్తుందా? అనే దాన్ని ప్రతీ ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి.
ఈ అవినీతిని నిరోధించాలంటే చట్టాలను కరెక్టుగా అమలుపరిస్తే లేదా ఈ చర్యలకు పాల్పడితే ఈ శిక్ష ఏదైతే చట్టంలో వుందో అవి ఖచ్చితంగా అమలుఅవుతాయి అని చూపించగలిగితే అప్పుడయినా అవినీతి కొంతమేర తగ్గవచ్చు. అలాగే ఈ చట్టాలను కరెక్టుగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు నిజాయితీగా వుంటే అంటే దాన్ని వ్యవస్థల్లోని వ్యక్తులు వాళ్ళకున్న అధికారాల్ని విచక్షణతో ఉపయోగిస్తే తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. కాని అలాంటి వాళ్ళని పై అధికారులు భరించే స్థితిలో వుండరు. అధికారులు సరిగా వుంటే పొలిటికల్ వ్యవస్థ సరిగా వుంటుంది. కానీ సమాజంలో రకరకాలుగా తయారైపోయి ఈ పనిచేయకపోతే తప్పేమో, చెయ్యకపోతే ఇతని చేతకాని తనమని అనుకుంటారనే పరిస్థితి నుంచి మనం, మన సమాజం మారాలి. అందరు గౌరవించే విధంగా మనం వుండాలి. ఈయన చాలా బాగుంటాడు. ఈయన చాలా కష్టపడి పనిచేస్తాడు, సమాజంలో అందరికి ఉపయోగపడతాడు. ఈయన చేసే పనులన్నీ ప్రజలకి ఉపయోగపడతాయి అనే గౌరవం వచ్చేవిధంగా తప్పకుండా ప్రతీ ఒక్కరు ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. అందర్నీ అలా ఉండమని కోరుకుంటూ..

- పింగళి భాగ్యలక్ష్మి, 9704725609