Others

ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశపు మట్టి, గాలి సమున్నతమైనవి. వాటిని ఏ రకంగానూ విడ దీయలేం. భారతదేశ మట్టి పూర్తి ప్రేమతో నిండినది. ఈ దేశానికి చెందామన్న భావనను గాలి మోసుకొస్తుంది. భిన్న భాషలు, భిన్న అభిరుచులు, భిన్న ఆహారపు అలవాట్లు, ఎన్నో వేషభాషలు, భిన్న సంస్కృ తులు ఉన్నప్పటికీ దేశ ప్రజలంతా సమైక్యంగానే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి ప్రజల హృదయం హిందూస్థానీ. భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న తరగతులకు చెందిన వారు ఎంతోమంది దేశంలో ఉన్నప్పటికీ దేశ సమై క్యతను మనసులో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ పథకాన్ని 2015 అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటించారు. సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటాం. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతుల పట్ల ఆయా రాష్ట్రాలు అవగాహన కలిగి ఉండేట్టు చేయడంతోపాటు, ఆయా రాష్ట్రాల మధ్య సానుకూల దృక్పథాన్ని పెంచి పోషించేలా పరస్పర సంబంధాలను మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం.
సానుకూల దృక్పథం...
ఒక దేశ సమగ్ర ప్రగతి దాని నైతిక ప్రగతి నుంచే వృద్ధి చెందుతుందని సర్దార్ పటేల్ చెప్పారు. దేశ నైతిక పురోగతికి అలాంటి భావాలను పిల్లల మనసులలో నాటాలి. ఆ రకంగా వారు వివిధ రాష్ట్రాల సంస్కృతిని అవగాహన చేసుకుని వాటిని గౌరవించే సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోగలుగుతారు. ఈ లక్ష్యాన్ని మనసులో ఉంచుకుని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ‘ఏక్‌భారత్.. శ్రేష్ఠ్ భారత్’ కింద 1000కి పైగా సాంస్కృతిక, కళా, క్రీడా ఈవెంట్‌లను దేశంలోని 227కు పైగా విశ్వ విద్యాలయాలు, 450 పాఠశాలల్లో నిర్వహించింది. ఇందులో సుమారు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులకు వివిధ సంస్కృతుల గురించి అవగాహన కల్పించారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన భాషా సంఘం పథకం కింద 1 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ కాకుండా అస్సామీ, బెంగాలీ, బోడో, తమిళం, తెలుగు, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, మరాఠి, నేపాలి, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సెంథలి, సింధి, డోంగ్రి వంటి ప్రాంతీయ భాషలలో వాక్యాలు ఎలా మాట్లాడాలో చెప్పడం జరిగింది.
దేశాన్ని సమైక్యభారతావనిగా తీర్చిదిద్దడానికి కారణమైన ఉక్కుమనిషి సర్దార్ పటేల్ ప్రేమ ఒక్కటే మార్గమని విశ్వసించారు. అలా ప్రేమించాలంటే అవతలి వ్యక్తిని సన్నిహితంగా అర్థం చేసుకోవడం అవసరం. ఏక్‌భారత్.. శ్రేష్ఠ్ భారత్ కింద దేశ యువత ఇతర రాష్ట్రాల వారిని బాగా అవగాహన చేసుకోవడానికి , వారి వారి పద్ధతిలో స్వయంగా వారిని అర్థం చేసుకునేలా చేయడానికి కృషి చేయడం జరుగుతోంది. ఇందుకు పర్యాటక మంత్రిత్వశాఖ భారత్ పర్వ్, పర్యాటన్ పర్వ్ కింద ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. దీనికింద వివిధ రాష్ట్రాలను అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అక్కడి వారి ప్రతిభను తెలుసుకోవడానికి వీలు కల్పించడం జరుగుతోంది. యువజన వ్యవహారాల శాఖ అంతర్ రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం కింద యువత తమ భాగస్వామ్య రాష్ట్రాన్ని సందర్శించి దాని గురించి అవగాహన చేసుకుని అక్కడి వారిని స్నేహితులుగా చేసుకోవడానికి వీలు కల్పిస్తోంది. ప్రధాని మోదీ రాగల మూడు సంవత్సరాలలో కనీసం దేశీయంగా 15 ప్రాంతాలలో పర్యటించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.
పరస్పర సహకారంతో...
ప్రతి వ్యక్తీ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని, ప్రపంచాన్ని తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏక్‌భారత్.. శ్రేష్ఠ్ భారత్ కింద వారికి తమ దేశం గురించి అవగాహన కలిగిస్తున్నారు. సాహిత్య, సాంస్కృతిక, క్రీడా. పర్యాటక ఈవెంట్‌లను అన్ని రాష్ట్రాలలో. కేంద్రపాలిత ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రం గురించి అవగాహనకు , వారి మధ్య అనుసంధానతలను ప్రోత్సహించడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాష్ట్రాల మధ్య అనుసంధానత ద్వారా వారి వారి ఆచారాలు, సంస్కృతులను ప్రోత్సహించడానికి వీలు కలుగుతుంది. ఈ పథకం కింద జమ్ము కశ్మీర్‌ను తమిళనాడుతో, పంజాబ్‌ను ఆంధ్రప్రదేశ్‌తో, హిమాచల్ ప్రదేశ్‌ను కేరళతో, ఉత్తరాఖండ్‌ను కర్ణాటకతో, హర్యానాను తెలంగాణతో అనుసంధానం చేశారు.
ఇవాళ అన్ని రాష్ట్రాల ప్రజలు చదువు కోసమో, పని కోసమో వివిధ రాష్ట్రాలకు వెళుతున్నారు. దీంతో ప్రజలు ఆయా రాష్ట్రాల పండగలను జరుపు కుంటూ అక్కడి సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో దుర్గా పూజ కానివ్వండి లేదా బీహార్‌ఛాత్ పూజ కానివ్వండి రెండూ న్యూ ఢిల్లీలో జరుపుకోవడం చూస్తుంటాం. మహారాష్టల్రోని గణేశ్‌పూజ ఉత్తర ప్రదేశ్,మధ్యప్రదేశ్ పట్టణాలకూ చేరింది. ప్రధానమంత్రి మోదీ ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ నినాదం ఈ కృషిని మరింత అద్భుతంగా ముందుకు తీసుకు పోవడానికి ప్రయత్నించింది. ఈ పథకం కింద గత కొనే్నళ్లలో వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు లెక్కలేనన్ని కార్యక్రమాలు, ఈవెంట్‌లు నిర్వహించాయి. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సాంస్కృతిక మంత్రిత్వశాఖ జాతీయ సాంస్కృతిక మెగా ఉత్సవాన్ని గుజరాత్,కర్ణాటక, ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో నిర్వహించింది. ఇందులో క్లాసికల్,పాపులర్ మ్యూజిక్‌కు సంబంధించిన ఈవెంట్‌లను, నృత్య రూపాల ప్రదర్శన, నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా రాష్ట్రాలను అనుసంధానం చేసేందుకు కృషి జరిగింది. కుంభమేళాలో సంస్కృతి కుంభ్ (ప్రయా గ్‌రాజ్)ను సంస్కృతి మహోత్సవ్ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఒక నెల రోజులపాటు తమ తమ రాష్ట్రాలకు చెందిన ప్రతిభా విశేషాలను అత్యద్భుతంగా ప్రదర్శించారు. సాంస్కృతిక కళా రూపాల ప్రదర్శనలు, కబీర్ ఉత్సవం (మహానగర్), నర్మదానాట్య మహో త్సవం (జబల్‌పూర్), స్వచ్ఛ కీ జ్యోతి (వారణాసి), అతుల్య భారత్ (పాట్నా), లోకోత్సవ్ (మోతిహరి) వంటివి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేలా దేశ ఐక్యతను ప్రతిబింబించాయి.
రాష్ట్రాలలో ఎంతో ఆసక్తి...
ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ పథకంపై రాష్ట్రాలలో ఎంతో ఆసక్తి నెలకొంది. హర్యానా, తెలంగాణాలు తమ భాగస్వామ్యానికి హర్యానాంగాణా గా పేరుపెట్టుకున్నాయి. వారు తమ తమ సాహిత్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. తెలంగాణా కళాకారులు ధుమార్ డాన్స్ నేర్చుకుని దాని ని ప్రదర్శించి చూపారు. ఈ రకంగా ఒక రాష్ట్ర సంస్కృతిని అందిపుచ్చుకుని ప్రదర్శించడాన్ని ప్రేక్షకులు ఎంతగానో అభినందించారు. తమిళనాడు పర్యాటక శాఖ జమ్ము కశ్మీర్ నుంచి వచ్చే పర్యాటకులకు 15 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. తమిళనాడు డవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో బసకు 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
భాష ద్వారా జన హృదయాల్లోకి...
భాష ద్వారా సరైన మాటలు ఎంతటి సంక్లిష్ట పరిస్థితులనైనా చక్కదిద్ద గలవని అంటారు. కొన్ని సందర్భాలలో ఎలాంటి మాటలు లేక పోయినా కేవలం హావభావాలు మొత్తం పరిస్థితిని అర్థమయ్యేలా చేయగలగుతాయి. మనదేశం గొప్పదనం ఏమంటే- మాట్లాడే భాషలకు మించి, భిన్న రుచులు, భిన్న అభిరుచులు ఉన్నాయి. ఏక్‌భారత్.. శ్రేష్ఠ్ భారత్ ఈ రుచులకు మరింత వనె్న తెస్తుంది. దక్షిణాది వంటకాలను న్యూఢిల్లీలో ఎంతగానో మెచ్చు కుంటుంటారు. ఉత్తరాది వంటకాలను మెచ్చుకునే వారిని దక్షిణాదిన చూడవచ్చు. ఇందుకు అనుగుణంగా ప్రజలను ఆయా రుచులతో అనుసంధానం చేసేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు.
*నేడు జాతీయ ఐక్యతా దినం

-ఓమ్ అవస్థి (పీఐబీ)