Others

పండగ సందడి ఆవిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి దసరా సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలకు పదిహేను రోజులు సెలవులు ఇచ్చినా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి సంతోషం లేకుండాపోయింది. ఓవైపు విష జ్వరాలు విజృంభించాయి, మరోవైపు ఆర్టీసీ సమ్మెతో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. విష జ్వరాలు వ్యాపించడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాధిగ్రస్తులతో కిక్కిరిసిపోయాయి. పల్లెలలోని ఆర్‌ఎంపీ డాక్టర్లు మొదలుకొని కార్పొరేటు వైద్యాలయాల వరకు అందరికీ కాసుల వర్షం కురుస్తోంది. ఆస్పత్రి ఖర్చులు భరించలేక సగటు మానవుడు అష్టకష్టాలు పడిన దృశ్యాలు కళ్ళకు కట్టినట్లుగా కన్పిస్తున్నాయి. ‘‘గాలి వున్నప్పుడే తూర్పాలా బట్టుకోవాలి’’ అనే సామెత మాదిరిగా ప్రైవేటు ఆస్పత్రుల వారికి- ఈ ‘వ్యాధుల సీజన్’లో అడ్డుచెప్పేవారే కరువయ్యారు.
ప్రభుత్వం మాత్రం ‘మందులన్నీ సమకూర్చాము.. డాక్టర్లను నియమించాము.. రాష్టమ్రంతటా ఎలాంటి ఆందోళనలు లేవు..’ ప్రకటనలు ఇచ్చుకొని సరిపెట్టుకుంది. ఒక్కసారి గ్రామీణ ప్రాంతంలోకి, వాటికీ దూరంగావున్న చిన్నచిన్న పట్టణాలకు వెళ్ళి దవాఖానాలలో చూస్తే అసలు నిజమేంటో తెలుస్తుంది. గ్రామస్థాయిలో పనిచేసే ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు ప్రత్యేక విధులు నిర్వర్తించేలా, ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది. డబ్బున్నవారికి ఎలాంటి అవస్థలు వచ్చినా సులభంగా తీర్చుకుంటారు గానీ సామాన్య పేదలకు అది కుదరదు కదా! దానిని భర్తీచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనే ఉంది. ఇక బతుకమ్మ చీరలను పంచిపెట్టి.. మా పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటున్నామోనని ప్రకటనలిచ్చుకుంటే సరిపోదు. ఇచ్చిన చీరలను ఎంతమంది ధరిస్తున్నారో ఒక సర్వేచేసి, వాస్తవాలను సమాజానికి తెలియబర్చడానికి ప్రయత్నించాలి. అపుడు అసలు నిజం ఏంటో తెలుస్తుంది. అనవసరంగా డబ్బు వెచ్చించి నాసిరకం చీరలను తెచ్చి ప్రజాధనాన్ని వృథా చేయకుండా.. వాటిలో లాభాలను చూసుకోకుండా.. పేదవారికి ఉపయోగపడేలా ఖర్చుపెడితే బాగుంటుంది.
ప్రభుత్వం తరపున వైద్యానికి ఎంత డబ్బు వెచ్చించారో, బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఇంకెంత వెచ్చించారో లెక్కలు చూసుకుంటూ, ఎవరికో అప్పజెప్పితే.. నాణ్యత లోపించి, ‘బూడిదలో పోసిన పన్నీరు’వలే అవుతుంది. లోటుపాట్లను సరిచేసుకుంటూ, పేదవాడికి మేలుజరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది. పనిచేశామని చేతులు దులుపుకొని, లెక్కలకే పరిమితమైతే- ఆ ప్రయత్నాల వల్ల ప్రభుత్వానికి పేరు రాకపోగా, నేతలు అభాసుపాలు అయ్యే పరిస్థితి ఏర్పడుంది. ఇక దసరా సెలవుల్లో వివిధ పనులరీత్యా, ఉద్యోగాల రీత్యా వివిధ గ్రామాలకు, పట్టణాలకు వలస వెళ్ళిన వ్యక్తులు తమ స్వంత ఊరికి వచ్చి పండుగ జరుపుకోవాలని తహతహలాడుతుంటారు. గానీ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు తమ డిమాండ్లను తీర్చుకోవాలనే నెపంతో సమ్మె సైరన్ మ్రోగించారు. వీలైనంత త్వరగా వారితో చర్చలు జరిపి, సానుకూల ప్రకటన వచ్చేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నది. ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేటి ఈ సమాజంలో అన్ని విషయాలపట్ల, సామాజిక జ్ఞానం కలిగివున్నవారు అనేకం ఉన్నారు. ఏదిచేసినా న్యాయస్థానం ద్వారా నిరూపించుకోవడానికి చట్టాలు, హక్కులున్నాయి. ప్రశ్నించే గొంతులను మూసేయాలనుకోవడం చాలా తప్పు. కక్షగట్టే ధోరణి అవలంబిస్తే పాలకులకు గుణపాఠం తప్పదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

-డా. పోలం సైదులు 94419 30361