Others

‘స్మార్ట్’ జీవితమా? సాయుధ పోరాటమా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూజ్‌మాడ్.. అంతు చిక్కని ఓ ప్రహేళిక.. ఇది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్టల్ల్రో విస్తరించింది. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఈ అరణ్య ప్రాంతం ఉంది. దేశానికి స్వాతంత్య్రం లభించాక ఇప్పటికీ అక్కడ ‘సర్వే’ జరపలేదని అంటారు. దాంతో ఆ ప్రాంతంపై ఆదివాసీలకు తప్ప ఇతరులకు సంపూర్ణ అవగాహన లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ దుర్గమ ప్రాంతంలో ఆదివాసీలు, అడవి జంతువులు తప్ప ఇతరులకు స్థానం లేని దృష్ట్యా మావోయిస్టులు అక్కడ ‘స్థావరాలు’ ఏర్పరచుకున్నారు. దీన్ని తమ కంచుకటగా భావిస్తూ ఉన్నారు. ఈ కంచుకోట మంచులా విచ్చుకుపోయేలా భద్రతా బలగాలు ఇప్పుడు వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో ‘సమాధాన్’ ఒకటి. అంతకుముందు ‘గ్రీన్ హంట్’ పేర భద్రతా దళాలు ‘జల్లెడ’ పట్టాయి. క్యాంపులను ఏర్పాటు చేసుకున్నాయి.
తాజాగా నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. బర్చా పోలీసుస్టేషన్ పరిధిలోని దుర్బేడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు గెరిల్లా శిక్షణా శిబిరం నిర్వహిస్తున్న సంగతి తెలుసుకుని భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళగా ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో వీరు మరణించారు. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని ఆ రాష్ట్ర డిజిపి అవస్థి చెప్పారు.
సంఘటనా స్థలం నుంచి కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ జవాన్లు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్లు ఈ ఎదురుకాల్పుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మిగతా మావోలు దట్టమైన అడవిలోకి పారిపోయినట్టు పోలీసులు ప్రకటించారు.
నాలుగువేల పైచిలుకు విస్తీర్ణంలో ఉన్న అబూజ్‌మాడ్ అంతా అంధకారమేమీ కాదు. గత కొన్ని సంవత్సరాల్లో అనేక మంది మీడియా ప్రతినిధులు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వారు అక్కడికెళ్ళి వివిధ దాడులు, మందు పాతరల పేలుడు సంఘటనలను రిపోర్టు చేశారు. అంతేగాక జన సాంద్రత కొంత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రామకృష్ణ మిషన్, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు వివిధ విద్యా ఆరోగ్య కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ‘అభివృద్ధి మంత్రం’తో మావోయిజాన్ని ఎదుర్కోవాలని భావించి ప్రభుత్వం సైతం ఎన్నో ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది. ఆ విధంగా ఆయా ప్రాంతాల ప్రజలకు కొన్ని వౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ అవి ఏ మూలకూ సరిపోవడం లేదు.
పైగా శతాబ్దాలుగా ఆదివాసీలు తమదైన జీవన విధానానికి, వ్యవసాయ పద్ధతులకు అలవాటుపడి ఆ ధోరణికే ప్రాధాన్యమివ్వడం వల్ల వాటికి భిన్నమైన వాటిపట్ల ఆసక్తి చూపకపోవడం సహజంగానే కనిపిస్తోంది. ఆ రకంగా వారి ఎదుగుదల- అభివృద్ధి సూచీ ఆశించిన స్థాయిలో కనిపించదు. దీనికంతటికీ పాలకులే కారణమన్న వాదన వినిపిస్తూ మావోయిస్టులు తమ స్థావరాలను పదిలపరచుకుంటున్నారు. జల్-జంగిల్- జమీన్ ఆదివాసులకే చెందుతాయి. కాబట్టి ఎవరూ అటువైపు తొంగి చూడవద్దన్న రీతిలో ‘పతల్ గడీ’ పాలనకు శ్రీకారం చుడుతున్నారు. చివరికి ఈ పాలన తమది ప్రత్యేక ‘దేశం’,‘ప్రాంతం’ అన్న ఆలోచనను బలపరిచే స్థాయికి తీసుకెళుతున్నారు.
అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో, జమ్మూ కశ్మీర్‌లోని వేర్పాటువాదులతో జతకట్టి దేశాన్ని చిన్న చిన్న ప్రాంతాలుగా విడగొట్టి, బలహీనపరిచి అంతిమంగా ఎర్రకోటను స్వాధీనం చేసుకోవాలన్న ఓ వికృత వ్యూహంతో పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థుల్లో అగ్గిరాజేసి వేర్పాటువాద నినాదాలు ఇప్పిస్తూ ‘ఆజాదీ’ అని ఓ కృత్రిమ ఉద్యమానికి ఊపిరులు ఊదుతూ ఉన్నారు. ఇదంతా ‘ఆరోగ్యకర’ ఆదివాసీలను, మరోవైపు దళితులను (్భమాకోరేగావ్), వేర్పాటువాదులను (జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు) రెచ్చగొట్టి అశాంతి ప్రబలేలా చేసి ఆ వాతావరణాన్ని తమ ‘విప్లవానికి’ వాడుకోవాలని మావోయిస్టులు ఓ ‘మాస్టర్ ప్లాన్’ రచించారు. అందులో భాగమే అబూజ్‌మాడ్‌లో గెరిల్లా దళాల కదలికలు. వీటిని ప్లటూన్లుగా మలిచి భారీ స్థాయి ‘పీపుల్స్ ఆర్మీ’ని రూపొందించి తూర్పు కనుమలనే కాదు, పశ్చిమ కనుమలను సైతం స్థావరాలుగా మలచుకుని ఆసేతు హిమాలచలం ‘కదం’ తొక్కాలని ఓ భారీ ప్రణాళికలోని అంతర్భాగమే పోలీసులతో, పారా మిలటరీ బలగాలతో ఈ పోరాటం.
అందులో భాగంగా ఇప్పటికే వందలాది మంది జవాన్లను మందుపాతరలతో, మర తుపాకులతో హతమార్చారు. జవాన్ల ఆయుధాలను, వాకీటాకీలను, బైనార్క్యులర్లను, బూట్లను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ‘‘దోచుకున్నారు’’ శత్రు బలగాలే మనకు ఆయుధ సంపత్తి అందిస్తుందని మావో నాయకులు తమ సభ్యులకు, గెరిల్లాలకు తరచూ బోధిస్తారు. తదనుగుణంగానే మెరుపుదాడులు నిర్వహిస్తారు. ఈ వ్యూహ రచనతోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నో దాడులు జరిగాయి. గాలింపుకోసం వెళ్ళిన భద్రతా బలగాలను మాటువేసి... దాడి చేసి పదుల సంఖ్యలో వారిని నేలకూల్చి ఆయుధాలను లాక్కెళ్ళిన సంఘటనలు అనేకమున్నాయి. రోడ్డు నిర్మాణ పనులకు భద్రత కల్పించే పనుల్లో ఉన్న జవాన్లను సైతం మావోయిస్టులు కాల్చి చంపిన సంఘటనలు అనేకమున్నాయి.
మరీ లోతట్టు ప్రాంతాలలో స్థావరాలు ఏర్పరచుకుని ఫైరింగ్ రేంజ్‌లను రూపొందించుకుని శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సాయుధ బలాన్ని మావోలు పెంచుకుంటున్నారు. ఇలా సాయుధ గెరిల్లా శిక్షణ పొందుతున్న వారిలో ఆదివాసీ యువతులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ఆ పార్టీలోకి రిక్రూట్‌మెంట్లు లేనందువల్ల వారిప్పుడు పూర్తిగా ఆదివాసీ యువతీ యువకులపైనే ఆధారపడుతున్నారు. వారికి అక్షర జ్ఞానం లేదు. అంకెలు కూడా తెలియవు. తెలిసిందల్లా అడవి మార్గాలు, ఆయుధం పేల్చడం, రోజుల తరబడి నడవడం. ఈ నైపుణ్యాల ఆధారంగా మావోయిస్టులు ఆదివాసీల ప్లటూన్లను రూపొందిస్తున్నారు. వారిని భద్రతా బలగాలొచ్చినప్పుడు ముందుకు తోస్తున్నారు. దాంతో వారు శలభాల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు ఎంతమంది ఆదివాసీ యువతీ యువకులు మరణించారో లెక్కేలేదు. ఇది ఏరకంగా ఆహ్వానించదగ్గ అంశమవుతుంది? మైదాన ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి దండకారణ్యంలోకి వెళ్ళిన మావోలు తొలుత వారికి చెప్పిందేమిటి?... ఇప్పుడు చేస్తున్నదేమిటి?... బీడీ ఆకుల, వెదురుమోపుల రేట్లు పెంపుకోసం పోరాడుతామని, ‘అన్న’లు (దాదాలు)గా వెంట ఉంటామని చెప్పి వారి ‘విశ్వాసం’ చూరగొన్నాక ఆయుధం చేతికిస్తే అదెలా న్యాయమవుతుంది? అభం శుభం ఎరుగని ఆ అమాయక ఆదివాసీల మధ్య తంపులు సృష్టించి ఒకరిపై ఒకరిని ఎగదోసి ఆ క్రమంలో తమకు కావలసిన వారిని ‘‘ఏరుకుని’’ ఎర్రజెండాలు చేతికిచ్చి, ఊరేగింపులు జరిపించి, పాటలు పాడించి, నృత్యాలతో తమని తాము మరచిపోయేలా చేసి, లేని వర్గకసిని నూరిపోసి, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం, ప్రపంచ బ్యాంకు, పెద్దన్న అమెరికా దాష్టీకం, ఆ అమెరికాకు ఊడిగం చేస్తున్న భారత పాలకులు... వారి ప్రతినిధులైన పోలీసు- అటవీ సిబ్బంది మిమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారు... దోచుకుంటున్నారు... ఇట్లా అసంగతమైన అంశాలు ఒకటికి వందసార్లు బోధించి ‘ఎర్రసైన్యం’ నిర్మాణమవుతోందని మావోయిస్టులు మురిసిపోతూ ఉన్నారు. అలా వారు తమ కలల ప్రపంచంలో తేలిపోతూ ఉండగా అప్పుడప్పుడు ఇలా ఎన్‌కౌంటర్లతో ఉలిక్కిపడుతున్నారు తప్ప వాస్తవ ప్రపంచమేమిటి? తాము చెబుతున్న ‘వైరుధ్యాలు’ ఆదివాసీల బుర్రల్లోకి ఎక్కుతున్నాయా?... అసల ఆ వైరుధ్యాలు ప్రపంచంలో ఇప్పుడు ఉన్నాయా? అని ‘చెక్’ చేసుకునే సమయం లేనంతగా కలల లోకంలో వారు మునిగి ఉన్నారు.
అక్షరం ముక్క రాని ఆదివాసీలేంటి? అణ్వాయుధ ప్రభావం గూర్చి తెలుపడమేమిటి? ఆర్థిక మాంద్యంతో తలెత్తే సమస్యలేంటి?.. ప్రస్తుతం ఈ ప్రపంచం ఏ ‘ఇరుసు’పై తిరుగుతోంది?... ఇలాంటి అనేక విషయాలు వారికి తెలియవు. వారి పరిధిలోకి అవి రావు. అయినా వాటికోసమే ఆదివాసీలు పోరాడుతున్నారని, ‘కొత్త వ్యవస్థ’ నిర్మాణం కోసం కదులుతున్నారని మావోయిస్టులు గొప్పగా గోబెల్స్ ప్రచారం చేస్తుంటారు.
అర్బన్ నక్సల్స్ ఆ ప్రచారానికి మరింత వనె్నతెచ్చి పెట్టేందుకు పడరాని పాట్లు పడతారు. అందుబాటులో ఉన్న అన్ని ప్రసార- ప్రచార మాధ్యమాల ద్వారా ఆ ‘సందేశం’ విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. చివరికి సోషల్ మీడియాను సైతం పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు.మొత్తం సమాజం ‘రీ డిజైన్’ జరిగి, సమీకరణలు మారి, డిజిటల్ ఎకానమీ అంతటా కమ్ముకుంటున్న వేళ, ప్రపంచ చలనగతులు సంపూర్ణంగా మారి కృత్రిమ మేధ తన విశ్వరూపం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ నగరాలు, చివరకు స్మార్ట్ గృహాలంటూ ప్రపంచం అటుగా కదులుతూ ఉంటే... మావోయిస్టుల కార్యాచరణ ఆదివాసీలు ఆ ఎత్తుకు ఎదిగేందుకు ఉపకరించేలా ఉందా?... లేక మరింత అంధకారంలోకి జారుకునేలా ఉందా?... ఎవరికి వారే ప్రశ్నించుకుని సమాధానం చెప్పుకోవలసిన సందర్భమిది.

-వుప్పల నరసింహం 99857 81799