Others

సాదాసీదా ఉయ్యాలవాడ ‘సైరా’ ఎలా అయ్యాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర గర్భంలో మహనీయులకు, మహానుభావులకు కొదవ లేదు. అలాంటి మహనీయుల సరసన మహానుభావులు కానివారూ, ఎలాంటి త్యాగాల అర్హతలు లేనివారూ కూడా చారిత్రక పురుషులుగా చేరిపోయారు. ఏ మూలాధారాలు, చారిత్రక సాక్ష్యాలు లేకుండా ఉదరపోషణ కోసమో, కళాపోషకుల మెప్పు కోసమో అలనాడు కొందరు చరిత్రకారులు చేసిన తప్పిదాలను నేటి చరిత్రకారులూ చేయటం అదే ఉదరపోషణ, మెప్పులలో భాగమే అని చెప్పక తప్పదు. మహనీయులు కానివారిని సైతం కొందరు చరిత్రకారులు చరిత్రలో మహనీయుల పక్కన చేర్చారు. నాటి చరిత్రకారులు వారి రచనావశ్యకత, స్థానిక పరిస్థితులు, అవసరాలు, కళారాధకుల కోర్కెలు, దీవెనలకు అనుగుణంగానే ఈ చారిత్రక తప్పిదాలకు పాల్పడ్డారు. అలాంటి తప్పిదాల చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర కూడా ఒకటి అనే ఆరోపణలు లేకపోలేదు.
ప్రఖ్యాత నటుడు చిరంజీవి హీరోగా దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ‘సైరా’ నరసింహారెడ్డి పేరిట తెరకెక్కించే ప్రయత్నం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా టీజర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇపుడు చర్చనీయాంశమైంది. 1857 నాటి తొలి భారత సంగ్రామానికి ముందే రవి అస్తమించని బ్రిటీషు పాలకులను గడగడలాడించిన యోధునిగా, చేత ఖడ్గము బట్టి బ్రిటీషు దొరల, పాలనాధికారుల తలలను వాయువేగంతో తెగనరికిన ‘సమరసింహం’గా పోల్చడం ఈ సినిమాలో ప్రధాన కథాంశం. కానీ సాదాసీదా ఉయ్యాలవాడ చరిత్ర ’సైరా’ సినిమాకు పూర్తిగా భిన్నం. నరసింహారెడ్డి భారత స్వాతంత్య్రం కోసం, తెల్లదొరల దాస్యశృంఖలాలను తెంచడం కోసం పోరాడిన వ్యక్తికాదు. ఆయన తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించనూ లేదు. బ్రిటీషు సైన్యాలతో యుద్ధం చేయనూ లేదు. స్వాతంత్య్ర పిపాస ఆయనకు లేనే లేదన్న వాదనలూ లేకపోలేదు.
1790లో నాల్గవ కర్నాటక యుద్ధం జరిగింది. టిప్పు సుల్తానుకు చెందిన భూభాగం మొత్తం నిజాం నవాబుకు దక్కింది. నిజాం నవాబుకు సైనిక సహకారం అందించినందుకు ప్రతిగా 1800 అక్టోబరు 12న జరిగిన ఒప్పందం ప్రకారం నాటి బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాలలో పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని బ్రిటీషువారు పొందారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ‘పాలెగాళ్ళ’దే రాజ్యం. దాదాపు 84 మంది పాలెగాళ్ళు వంశపారంపర్యంగా తమ అధికారాలను చెలాయించేవారు. వీరు ఎవరికీ సామంతులు కాదు. జమిందార్లు, అలాంటి పాలెగాళ్ళలో కర్నాటి జయరామిరెడ్డి ఒకరు. ఇతని ప్రాంతం నొస్సం. పాలెగాళ్ళు బ్రిటీషువారికి సక్రమంగా పన్నులు జమచేసేవాళ్ళు కాదు. దీనితో బ్రిటీషు అధికారులు పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేశారు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టి నేరుగా రైతుల నుండే తమ అనుయాయులతో పన్నులు వసూలు చేయించారు.
ఇలా పాలెగాళ్ళ వ్యవస్థ రద్దుకారణంగా నష్టపోయిన పాలెగాళ్ళకు భరణం (పింఛను) ఇచ్చేవారు. అలా జయరామిరెడ్డి కుటుంబానికి 11 రూ.ల, 10 అణాల, 8 పైసలు పింఛనుగా లభించేది. జయరామిరెడ్డికి మగ సంతానం లేకపోవటంతో తన కుమార్తె కొడుకైన నరసింహారెడ్డిని దత్తత స్వీకరించారు. దత్తత తీసుకున్న వారిని వారసులుగా బ్రిటీషు ప్రభుత్వం గుర్తించేది కాదు. అందువల్ల జయరామిరెడ్డి మరణానంతరం కూడా పింఛనును నరసింహారెడ్డి కొంతకాలం పొందాడు. ఈ విషయం తెలిసి బ్రిటీషు అధికారులు నరసింహారెడ్డి పింఛను నిలిపివేశారు. 1886లో అచ్చయిన కర్నూలు మాన్యువల్‌లో నరసింహారెడ్డి పింఛను తీసుకున్నట్లుగా లిఖించబడింది. పింఛను నిలిపివేయటంతో ఆగ్రహించిన ఉయ్యాలవాడ ఒక తలారి కోవెలకుంట్ల ట్రెజరీకి తన జీతం తీసుకోవటానికి వెళుతుండగా, తన పింఛను కూడా తీసుకురావలసిందిగా కోరాడు. అలా కోవెలకుంట్ల వెళ్ళిన తలారితో అధికారులు ఉయ్యాలవాడను దూషిస్తూ మాట్లాడారు. ఆ తలారి తిరిగి వచ్చి అవే మాటలను నరసింహారెడ్డికి చెప్పటంతో ఇక పింఛను రాదని గ్రహించిన అతను సమీపంలోని కలసాల గ్రామానికి వెళ్ళి అక్కడ తనకు సన్నిహితంగా వున్న బోయలను తీసుకుని కోవెలకుంట్ల ట్రెజరీపై జూన్ 10, 1846న దాడి చేశాడు. తహశీల్దార్‌ను, ట్రెజరీ అధికారిని చంపి ఎనిమిది రూపాయలు దోపిడీ చేశాడు. చంపిన వారి తలలను ఒక పాడుపడ్డ శివాలయంలో దాచాడు.
హత్యోదంతం తెలుసుకున్న బ్రిటీషు పోలీసులు రంగంలోకి దిగారు. నరసింహారెడ్డిని విచారించగా అతడు తనకేమీ తెలియదని చెప్పాడు. ఈ సందర్భంగా బ్రిటీషు పాలకులపై నరసింహారెడ్డి తిరగబడనూ లేదు, చేసిన పనిని ధీరుడిలా ఒప్పుకోనూ లేదు. ఆ తరువాత నేర పరిశోధనలో బ్రిటీషు పోలీసులు శివాలయంలో పాతిపెట్టబడ్డ రెండు తలలనూ గుర్తించారు. నరసింహారెడ్డి సన్నిహితుల ద్వారా నిజాలను రాబట్టారు. ఈ విషయం తెలిసి నరసింహారెడ్డి అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. నరసింహారెడ్డిని పట్టుకునేటందుకు బ్రిటీషు పోలీసులు పలు ప్రయత్నాలు చేశారు. కానీ పట్టుకోలేకపోయారు. నరసింహారెడ్డి ఎప్పుడూ ఒకచోట ఉండకుండా, నిరంతరం స్థావరాలను మార్చుతూ నల్లమల అడవులలో తిరిగేవాడు. ఒకసారి అవుకు రాజైన నంద్యాల నారాయణరాజును కలిశాడు. బ్రిటీషు పోలీసుల నుంచి తనకు రక్షణగా నిలవాలని కోరగా- అందుకు నారాయణరాజు అంగీకరించలేదు. దీంతో ఒంటరి అయ్యాడు. కోవెలకుంట్ల సంఘటనలో తనకు సహకరించిన బోయలనే అనుచరులుగా ఎంచుకున్నాడు. దొంగతనాలు చేసుకుని జీవించే బోయలు ఆస్తిపాస్తులు ఏవీలేని నరసింహారెడ్డి వెనుక ఎందుకు నిలబడ్డారు? ట్రెజరీపై దాడిచేసిన సమయంలో లభించిన సొమ్మును నరసింహారెడ్డి బోయలకు ఇచ్చాడు. లెఫ్టినెంట్ వాట్సన్ నరసింహారెడ్డిని పట్టుకోవటానికి గిద్దలూరు వద్ద కాపుకాశాడు. ఈ విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి అర్ధరాత్రి సమయంలో అనుచరులతో కలసి కంభం తహశీల్దారును చంపాడు. వాట్సన్ వచ్చేలోపే పారిపోయాడు. ఆ తర్వాత నరసింహారెడ్డి వల్ల తమకు ఎలాంటి ఆదాయం లేకపోగా, ప్రాణాలుపోయే ప్రమాదం వుండటంతో బోయలు ఒక్కొక్కరుగా జారిపోయారు.
ఇక నరసింహారెడ్డి చేసేది లేక బ్రిటీషువారిపై దాడులకు స్వస్తిచెప్పి తప్పించుకుని తిరిగే పనిలో పడ్డాడు. బ్రిటీషు ప్రభుత్వం నరసింహారెడ్డిని ఆచూకీ చెప్పిన వారికి ఐదువేల రూపాయలు, పట్టించిన వారికి పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. ఆ తర్వాత నరసింహారెడ్డి కదలికలపై బ్రిటీషు పోలీసులు నిఘా పెట్టారు. నరసింహారెడ్డి ఉంపుడుగత్తెను ప్రలోభపెట్టారు. పేరు సోముల సమీపంలోని జగన్నాథకొండపై బాగా మద్యం సేవించి కదలలేని స్థితిలో వున్న నరసింహారెడ్డిని 1846, అక్టోబరు 6వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. కేవలం రెండున్నర నెలలు మాత్రమే నరసింహారెడ్డి బ్రిటీషు పోలీసులపై పోరాటం చేశాడు. ఈ రెండున్నర నెలల్లో కోవెలకుంట్ల, గిద్దలూరు సంఘటనలు మినహా ఎలాంటి సంఘటనలు రికార్డు కాలేదు. అరెస్టు తర్వాత నాలుగు నెలలు విచారించి 1847 ఫిబ్రవరి 22న జుర్రేటి ఒడ్డున వున్న చెట్టుకు నరసింహారెడ్డిని బ్రిటీషు పోలీసులు, రెండు వేల మంది ప్రజల సమక్షంలో కలెక్టర్ కాట్రేన్ ఉరితీయించారు. ఆ తరువాత ఆయన తలను కోవెలకుంట్ల కోటలో వున్న ఉరికంబానికి వేలాడదీశారు.
నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్ధమ్మకు ఒక కుమారుడు, రెండవ భార్య పేరమ్మకు ఒక కుమార్తె, మూడవ భార్య ఓబులమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర. ఇలాంటి సాదాసీదా ఉయ్యాలవాడ కథకు ఎన్నో హంగులు, ఆర్భాటాలు, మసాలాలు, తమాషాలు కలిపి సినీ రచయితలు ‘సైరా’గా మార్చారు. కల్పితమైన కథకు వాస్తవ రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఒక వర్గం వారు నరసింహారెడ్డిని తమ ఆరాధ్యదైవంగా తెలుగు ప్రజలముందు నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. తెలుగు చిత్రసీమలో ఎవరి డప్పులు వారు కొట్టుకుంటున్న నేపథ్యంలో ‘సైరా’ డప్పును ఆ సామాజికవర్గం వారు భుజానికెత్తుకున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి లాంటివారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కేంద్ర ప్రభుత్వం జాతీయ యోధునిగా గుర్తించాలని, అన్ని భాషలలోకి ఆయన జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చాలని, పార్లమెంటు ఆవరణలో సైతం నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని సంతకాల సేకరణోద్యమం చేపట్టారు. ఇది ఒక అవాస్తవాన్ని వాస్తవ రూపంగా ప్రచారం చేసే కల్పిత కథ. మెప్పుకోసమో, డబ్బులకోసమో చరిత్రను వక్రీకరించి చరిత్రలోని ఝాన్సీలక్ష్మీబాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ వంటి పుణ్యపురుషుల సరసన చేరిస్తే చారిత్రక ద్రోహులుగా మిగులుతాము.

-పోతుల బాలకోటయ్య 98497 92124