Others

ధర పతనమైనా.. పత్తి దిగుబడి ఘనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా ‘తెల్ల బంగారం’ (పత్తి) పంట విస్తీర్ణం పెరుగుతోంది. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కారణమైన ఈ పంట ఇలా విస్తరించటం వ్యవసాయ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక పక్క దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులున్నా ఈ ఏడాది పత్తి దిగుబడుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రథమ స్థానం పొందనుంది. అమెరికా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ప్రత్తి దిగుబడుల్లో చైనాను రెండో స్థానానికి నెట్టివేసి ప్రథమ స్థానాన్ని భారత్ కైవసం చేసుకోనుంది. 2013-2014లో భారతదేశంలో ప్రత్తి విస్తీర్ణం 370 లక్షల ఎకరాలయితే ఈ సంవత్సరం 405 లక్షల ఎకరాలకు పెరిగింది. గత సంవత్సరం దిగుబడి 73 లక్షల బేళ్ళు అయితే ఈ సంవత్సరం 88 లక్షల బేళ్ళుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలం క్రిందటే 50 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగవుతూ వస్తోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సంఖ్య 59 లక్షల 70వేల ఎకరాలకు చేరుకుంది. తెలంగాణలో 41 లక్షల 42వేల 500 ఎకరాలలోను, ఆంధ్రప్రదేశ్ 18 లక్షల 27వేల 500 ఎకరాలలోను సాగయింది.
పత్తి ధర క్వింటాల్‌కు 5000 నుండి 3500 రూపాయలకు పడిపోవటంతో రైతులు కుదేలవుతున్నారు. విదేశీ మార్కెట్‌లో టన్ను ధర 43,500 రూపాయల నుండి 35,000 రూపాయలకు పడిపోయింది. అమెరికా, చైనా, పాకిస్తాన్‌ల నుండి దిగుమతికి ఆర్డర్లు లేకపోవటంతో భారత్‌లో పత్తి మార్కెట్ అతలాకుతలమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పత్తి విస్తీర్ణాన్ని 40 లక్షల ఎకరాల దగ్గర స్థిరీకరించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2010-2011 సంవత్సరంలో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 50 లక్షల ఎకరాల మార్కును, మరుసటి సంవత్సరం 55 లక్షల ఎకరాలకు దాటినప్పుడు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇప్పుడు ఏకంగా 60 లక్షల ఎకరాలకు చేరుకుంది. ప్రత్యామ్నాయ పంటగా వచ్చిన మొక్కజొన్న, జొన్న, సోయాబీన్‌లు పత్తి సాగు దూకుడును అడ్డుకోలేకపోయాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పత్తిసాగు కొత్త పుంతలు తొక్కుతోంది. తొలిసారిగా ఈ ఏడాది 60 లక్షల ఎకరాల మైలురాయిని చేరుకుంది. ఇది ఆనందపడవలసిన విషయమా? ఆందోళన చెందవలసిన అంశమా? అన్నదానిపై చర్చలు మొదలయ్యాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో జరిగిన గోదావరి జిల్లాల వ్యవసాయ సాంకేతిక సలహా మండలి సదస్సులో మాట్లాడిన శాస్తవ్రేత్తలు ఈ పంట విస్తీర్ణం పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార ధాన్యాలు పండించే విస్తీర్ణంలో 18 శాతాన్ని పత్తి పంట ఆక్రమించిందని, భవిష్యత్తులో ఇంకా ఇది పెరిగే అవకాశమున్నదని ఈ సదస్సు హెచ్చరించింది. ఏపీలో పత్తి సాగు సగటు విస్తీర్ణం కంటే 37 శాతం అధికంగా జరిగినట్లు వ్యవసాయ శాఖ వివరాలు తెలియజేస్తున్నాయి.
పత్తి సాగు తెలియని తూర్పుగోదావరి జిల్లాలో ఈ సంవత్సరం 35వేల ఎకరాలలో పత్తి నాట్లు పడ్డాయి. ఈ పంట కర్ర పెండలం దుంప సాగయ్యే భూములను ఆక్రమించింది. దీని ప్రభావం సగ్గు బియ్యం మిల్లులపై పడుతుంది. వాస్తవానికి గత సంవత్సరం రాష్ట్రంలో పత్తి పంటకు పెద్దగా గిట్టుబాటు ధర లభించలేదు. సగటున క్వింటాలుకు రూ.3,600 ధర లభించింది. రైతులు దగ్గర అమ్మకాలు పూర్తయిన తర్వాత జూన్, జూలై నెలల్లో రూ.5,000 ధరకు చేరుకుంది. పత్తి దిగుబడికి కనీస హామీ ఉండడంతో ముందుగానే ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించటం, బి.టి. పత్తి వల్ల తెగుళ్ళు తక్కువగా ఉండటం ఈ పంట పట్ల మోజు పెరుగుతోంది.
పప్పు దినుసులు, నూనె గింజలు సాగుచేసే రైతులకు దిగుబడులు గిట్టుబాటు ధరలు లభించకపోవటమే ప్రత్తి పంట వైపు వారు మొగ్గడానికి కారణం. ప్రస్తుతం మొక్కజొన్న మాత్రమే పత్తి పంటకు పోటీగా నిలువగలుగుతోంది. కాలక్రమంలో చెరువులు, గొట్టపు బావుల కింద సాగయ్యే మొత్తం వరి విస్తీర్ణాన్ని కూడా పత్తి పంట ఆక్రమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ,3,700గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన సగటున ఎకరానికి 10 క్వింటాళ్ళ దిగుబడి సాధించే రైతు రూ.3,7000 స్థూల ఆదాయం పొందుతాడు. వరి ఎకరానికి సగటు దిగుబడి 20 క్వింటాళ్ళు చూస్తే, కనీస మద్దతు ధర రూ.1,250 మేరకు 25వేల రూపాయలు స్థూల ఆదాయం వస్తుంది.
తెల్ల బంగారంగా పేరుపొందిన పత్తి- రైతుల ప్రాణాలు బలిగొన్న విషయంలోను చరిత్రను సృష్టించింది. పత్తి పంటను ఆశించే పురుగులను చంపడంలో విఫలమైన రైతులు అదే పురుగుల మందు తాగి చనిపోయేవారు. ఈ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందితే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం పొందింది. మేధావుల పోరాటానికి లెక్కచేయకుండా బి.టి. పత్తిని ప్రవేశపెట్టడంతో రైతుల దశ తిరిగింది. దేశంలో బి.టి. పత్తి రకం లేకపోతే పత్తి పంటకు నూకలు చెల్లినట్లే. 2002లో బి.టి. పత్తికి వ్యవసాయశాఖ అనుమతి ఇచ్చిన విషయంపై 2013లో పార్లమెంటు స్థారుూ సంఘం గుర్రుమంది.
2002లో కేవలం 14 లక్షల ఎకరాల్లో సాగయ్యే బి.టి. పత్తి ఇప్పుడు ఏకంగా 400 లక్షల ఎకరాలకు పెరగటం ఈ కోపానికి ప్రధాన కారణం. ఇది భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు తెస్తుందని దాని వాదన. అమెరికాలో మొక్కజొన్నతో ఇలాంటి ప్రమాదమే ఏర్పడింది. ఈ దేశం మొత్తం విస్తీర్ణంలో మొక్కజొన్న 65 శాతానికి చేరుకుంది. జీవ ఇంధనం కోసం మొక్కజొన్న సాగును విపరీతంగా చేపట్టడం వల్ల మిగిలిన దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా దేశ శ్రేయస్సు దృష్ట్యా పత్తి పంట స్థానే నూనె గింజలు, పప్పు దినుసులు పంటలను ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఉంది.

-పుట్టా సోమన్న చౌదరి