Others

అందరికీ వరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని ఒడిదుడుకులు వున్నప్పటికీ ఇండియా జాతీయ ఆదాయ పెరుగుదల నిలకడగా, సంతృప్తికర స్థాయిలో వుందనవచ్చు. దేశాభివృద్ధికి స్పష్టమైన సూచి మానవాభివృద్ధే. వెనుకబడిన కొన్ని ఆఫ్రికా దేశాలకన్నా విద్య, వైద్యరంగాల్లో ఇండియా దిగువనే వుండటం విచారకరం. ఉప ఖండంలోని పొరుగు పేద దేశాలు కూడా మనకన్నా మానవాభివృద్ధిలో ముందున్నాయి. పెరిగిన జాతీయ సంపద జాతి జనులందరికీ చేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయనడం అసత్యారోపణ కానే కాదు. ఫలితంగా మానవాభివృద్ధి దేశంలో నత్తనడక నడుస్తోన్నది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, రోజుకూలీలు, చేతివృత్తులవారు, అసంఘటిత రంగ కార్మికుల బ్రతుకులు దుర్భరంగానే వున్నాయి. ఏవో కొన్ని నామమాత్రపు చర్యలు తప్ప వీరికి సామాజిక భద్రత కరువే.
దినదిన గండంగా గడుస్తున్న పేదల జీవన వెతలు వర్ణనాతీతం. ఆర్థిక నిపుణులు పేదరిక నిర్మూలనకు రెండు సూచనలు చేస్తున్నారు. ప్రయివేటీకరణ, కనీస ఆదాయ పంపిణీలు. ప్రయోగాత్మకంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ల్లో 2010-13 మధ్య 6వేల మంది లబ్ధిదారులకు కనీస ఆదాయ పంపిణీ చేశారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని అధ్యయనం తెలుపుతోంది. చిన్న మొత్తంలోనైనా నగదు పొందిన లబ్ధిదారుల కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగుపడినట్లు అధ్యయనకర్తలు గమనించారు. ఆ 6వేల కుటుంబాల్లో పోషకాహారం తీసుకోవడం పెరిగింది. వారి పిల్లలను బడికి పంపుతున్నారు. బడిలో చేరిన బాలికల హాజరు పెరిగింది. ఒక మేరకైనా వారి రుణ భారం తగ్గిందని గమనించారు.
ఆదాయ సహాయం ఎందుకంటే ప్రశ్న కొందరిలో కలుగుతుంది. జాతీయ ఆదాయం గణనీయంగా పెరిగిన దేశ ఆర్థిక వాతావరణంలో ఇది అవసరమా అనేవారు వుండవచ్చు. పేదలు, గ్రామీణులకు అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవసాయం, పలు సంప్రదాయ ఆర్థిక రంగాలను ఆర్థిక సంస్కరణలు విస్తరించాయి. ఆర్థిక సరళీకరణ, ఆధునిక సాంకేతికత వినియోగం జతగా జాతీయ ఆదాయం పెరుగుదలకు తోడ్పడ్డాయి. కానీ దేశ ప్రజలందరూ సమానస్థాయిలో లాభపడలేదు. ధనిక, మధ్య తరగతులకే ఆ ఫలాలు దక్కాయి. దీన్ని సమతులాభివృద్ధి అని అనగలమా. దేశ ప్రజలందరికీ మెరుగైన జీవనం కల్పించే విధానం కావాలి. సమతులాభివృద్ధికి బాటలు వేసే అభివృద్ధి నమూనా పట్టాలెక్కేవరకు నెలనెలా నగదు బదిలీ అవసరమే.
కనీస ఆదాయ పథకాన్ని అంచెలంచెలుగా అమలుచేసే దేశవ్యాప్త ప్రణాళికగా రూపొందించింది. పైలట్ ప్రాజెక్ట్ అమలులో ఎదురయ్యే లోటుపాట్లు పరిష్కారాలతో అమలు మొదలుపెట్టాలి. నిర్దిష్ట ప్రణాళికగా రచిస్తే, ఈ పథకాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేసారి అమలుచేసే సమగ్ర పథకంగా రూపొందుతుంది. స్థానిక సంస్థల సహాయంతో దీన్ని తక్కువ ఖర్చుతో అమలుచేయవచ్చు. నెలనెలా నగదు సహాయం తొలుత అత్యంత పేదలతో ప్రారంభించి క్రమంగా అందరికీ వర్తింపజేయాలి. పథకంగూర్చి ప్రచారం, లబ్ధిదార్ల ఎంపిక మొదలుకొని అమలు, నిర్వహణ, విస్తరణలపై స్థానిక సంస్థలకు మంచి శిక్షణ ఇచ్చి అమలు ప్రారంభించడం మేలు. దేశ ప్రజలందరికోసం ఈ పథకం. స్ర్తిలకో, నిరుద్యోగులకో, సామాజికంగా వెనుకబడిన వర్గాలకో ఉద్దేశింపబడినది కాదనే భావనను వివిధ ప్రసార మాధ్యమాల సహాయంతో ప్రజల్లో కలిగించాలి. సహాయం కొందరికే పరిమితం కానిస్తే అవసరమైనవారు విస్తరింపబడతారు. మహిళలకు మాత్రమే సహాయంచేస్తే పురుషులు అందులో వాటా అడుగుతారు. కొందరు స్ర్తిలు పురుషులకు వాటాయిస్తారు. కొందరు వ్యతిరేకత తెలిపే అవకాశం వుంది. ఇటువంటి ఎంపిక పద్ధతి ఇంట్లో అభిప్రాయ బేధాలకు తావిస్తుంది. అందరికి సహాయం చేయాలి. సమభాగస్వామ్యం స్ర్తిపురుష బంధాలు బలపరుస్తుంది. ఇంట్లోను, సంఘంలోను సంఘీభావం పెరుగుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపరచటం, సామాజిక సంబంధాలు పటిష్టతలు రెండే ముఖ్యమే.
పలు దేశాలు ఈ పథకం గూర్చి తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. కెనడా, కెన్యా, స్పెయిన్, అమెరికా తదితర దేశాలు ప్రయోగాత్మకంగా కనీస ఆదాయ పథకాన్ని పరిశీలిస్తున్నాయి. ఫిన్‌లాండ్ ప్రభుత్వం 2వేల మందికి 2 సంవత్సరాలపాటు నెలనెలా నగదు సమకూర్చింది. సహాయం పొందిన వారు అన్నిరకాలుగా సంతృప్తిగా వున్నట్టు అక్కడి అధ్యయనం గమనించింది. ఇండియాకు ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయగల సాంకేతిక, ఆర్థిక బలాలు వున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 5 లక్షల కోట్లు కేవలం పన్నుల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అమలులోవున్న సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించుకొని వాటిని క్రమబద్దీకరించడం, అనవసర సబ్సిడీలను తగ్గించడం ద్వారా పథకం అమలుకు అవసరమైన వనరులు సమీకరించుకోవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆధార్ అనుసంధానంతో బోగస్ లబ్ధిదారులను చాలావరకు అడ్డుకట్టవేయవచ్చు. పైగా ఇది సార్వత్రిక పథకం. జాతీయ ఆదాయం పెరిగి దేశ ఆర్థికశక్తి బలపడింది. ఈ పథకం ద్వారా అందించిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు తమకు ఇష్టమైనరీతిలో వినియోగించుకొనే స్వేచ్ఛ వుంది. తమ ఆలోచనలు నిజం చేసుకొనేందుకు ఎవరైనా ప్రభుత్వ చేయూత కోరితే వారికి అందించాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణ రంగాలపై ప్రభుత్వ దృష్టిసారిస్తే అసమానతలు తొందరగా తొలగుతాయి. మానవాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఆర్థిక అభద్రత జాతిని నిర్వీర్యం చేస్తోంది. నెలనెలా కొంతకాలం కనీస ఆదాయం అందించడం ద్వారా వారి శక్తిసామర్థ్యాలు సద్వినియోగపడి దేశం ముందడుగు వేస్తుంది. సంతోష భారతిగా వెలుగొందుతుంది.

- వి. వరదరాజు.. 9492542033