Others

‘సేవాదళ్’తో సంస్కారం సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేల సంవత్సరాల నుంచీ, వేదకాలం నుంచీ మనుగడ సాగిస్తున్న భారతదేశానికి ఘనమైన గతం ఉన్నా, వర్తమానం తప్పదు గదా! ఇంతవరకూ ప్రపంచంలో ఎవ్వరూ ‘వేదాలు అబద్ధం’ అని కాని, అవి తమ దేశంలో పుట్టాయి’ అని గాని అనలేదు. అలాగే ఇస్లాం, క్రిష్టియానిటీలు ఈమధ్య జన్మించిన మతాలు, ధర్మాలు. కాని భారత ధర్మం, భారతీయత చరిత్రకు అందని కాలం నుంచీ ఉన్నాయి. ఇది తిరుగులేని సత్యం.
ఇప్పుడు మన సమీప గతాన్ని చూద్దాం.. మనకు బ్రిటీష్ వారి నుంచి 1947 ఆగస్టులో స్వాతంత్య్రం లభ్యమైంది. వేల సంవత్సరాల నుంచీ అఖండంగా ఉన్న భారతదేశాన్ని రెండు ముక్కలుగా చేశాకే స్వాతంత్య్రాన్ని ప్రసాదించారు. దానికే మనం సంతోషించాం కదా. స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే నాధూరాం వినాయక గాడ్సే చేతిలో జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు గురయ్యాడు. నిజానికి ‘మహాత్ముడు’ రాజకీయ రంగంలో లేకుండా ఉంటే- మనకీ ఖండిత భారతమన్నా దక్కేదికాదేమో..!
గాంధీజీ హత్య తర్వాత దేశంలో అనూహ్య పరిణామాలు చూశాం. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)ను నిషేధించారు. తరువాత అనేకానేక సంఘటనలు, సత్యాగ్రహాలు, వేలాది మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు జైలుపాలవటం జరిగింది. చివరగా ఆర్‌ఎస్‌ఎస్ వారికి గాంధీజీ హత్యతో సంబంధం లేకపోవటంతో, ఆ సంస్థపై నిషేధం ఎత్తివేశారు. కాలం గడచిపోతుండగా- 1962లో మనం అమితంగా నమ్మిన చైనాయే మనపై దురాక్రమణ చేసింది. అప్పటి మన ప్రధాని నెహ్రూజీ దీనినెంతమాత్రం ఊహించలేదు. ఇప్పటికీ మన భూభాగంపై చైనా ఆక్రమణలకు పాల్పడుతోంది. ఇకనైనా- మన దేశంపై చైనాకు ఒక విధమైన బెదురును లేదా ‘్భరత్‌తో తప్పక జాగ్రత్తగా ఉండాల్సిందే’ అనే భావం ఎలా కలిగించాలి?
1963లో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జరిపిన ప్రదర్శనల్లో మన సైనికులు యథాప్రకారం పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వారిలోనూ తగినంత ధైర్యం, క్రమశిక్షణ వగైరాలున్నాయి. స్వయంగా ప్రధాని నెహ్రూజీయే ‘సంఘ్’ కార్యకర్తలను ఆహ్వానించారు. ఆర్‌ఎస్‌ఎస్ వారు సంతోషంగా, పూర్తి యూనిఫాంతో, సైనికులతోపాటుగా రిపబ్లిక్‌డే ప్రదర్శనలో పాల్గొన్నారు. నెహ్రూజీ ఆహ్వానించే నాటికి ఆర్‌ఎస్‌ఎస్ 38 సంవత్సరాలను పూర్తి చేసుకున్న జాతీయవాద సంస్థ. 1925లో విజయదశమి రోజున ఆర్‌ఎస్‌ఎస్‌ను డా.కేశవరావు బలీరాం హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రెండు, మూడు తరాల క్రితం తెలంగాణలోని బోధన్ తాలూకా కందకుర్తి గ్రామం నుంచి హెడ్గేవార్ వంశస్థులు మహారాష్టల్రోని నాగపూర్‌కు వలస వెళ్లారు. కందకుర్తి త్రివేణీ సంగమం లాంటి గ్రామం. గోదావరి, మంజీరా, హరిద్రి నదులు అక్కడ కలుస్తాయి.
‘డాక్టర్‌జీ’గా ప్రసిద్ధుడైన హెడ్గేవార్ దేశ పరిస్థితులను, కాంగ్రెస్ పార్టీని నిశితంగా పరిశీలించి ఒక నిర్ణయానికొచ్చారు. ‘ఈ దేశాన్ని కలిపి ఉంచగలిగేది, పూర్తిగా మాతృభూమి అనే భావంతో ఉండగలిగేది హిందువులే. అయితే దానికి కేవలం రాజకీయాలొక్కటే మార్గం కాదు. మనమందరం భారతీయులం, మన సంస్కృతే మనకు రక్ష అనే ధోరణితో ఏకం కావాలి..’అని ఆయన భావించారు. ఆయన ఆలోచనలకు రాజకీయేతర మార్గమే ఆర్‌ఎస్‌ఎస్.
ప్రతిరోజూ ఒక గంటసేపు ముఖ్యంగా బాలురు, తరుణులు సమావేశమై దేశాన్ని గురించి ఆలోచించాలి, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి. ఆ తరువాత ప్రార్థనతో తమ కార్యక్రమం ముగించాలి. బాలురు, తరుణులకు సాయంత్రం వేళలోనే కుదురుతుంది. కాని పెద్దవారు, వ్యాపారస్తులు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకూ కార్యాలయాల్లో ఉండేవారి కోసం ప్రౌఢ శాఖ అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించేవారు. వారు ఉదయం 6 గంటల నుంచి కనీసం ఒక గంటసేపు ‘సంఘ్’ కార్యక్రమాలు సాగించేవారు.
ఒక గ్రామం, పట్టణం, నగరంలోని వారంతా ప్రతి ఆదివారం ఉదయం ఒకచోట కలవాలి. ఫలితంగా వారంతా ఒకరికొకరు పరిచయం అవుతారు. అంతేకాదు.. సంవత్సరానికొకసారి స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవుల్లో - కొంతమంది నెలరోజులపాటు కలిసి ఉంటూ సామూహిక జీవనం గడిపేవారు. ఇలా వివిధ ప్రాంతాల్లోని వారికి పరిచయాలు పెరిగాయి. ఇలా రెండు సార్లు సంవత్సర సమావేశాల్లో పాల్గొన్నవారు మూడవ సారి యావద్భారత శిక్షణ సమావేశం (నాగపూర్‌లో)లో పాల్గొనేవారు. ఇలా ‘సంఘ్’ కార్యకర్తలకు దేశమంతటా పరిచయాలు ఏర్పడే వీలు కలుగుతుంది.
ఆర్‌ఎస్‌ఎస్ శాఖల్లో, వారి శిక్షణా తరగతుల్లో ఎక్కడా కులం ప్రసక్తి ఉండదు, ఉండరాదు. వివిధ ప్రాంతాల్లో సంఘ్ కార్యకర్తలు భేద భావాలు విడనాడి.. ఒకేచోట కూర్చుని సహపంక్తి భోజనాలు చేసేవారు. కొందరు వడ్డనలు చేసేవారు, ఇంకొందరు వంటలు చేసేవారు. అంతా కలసి మెలసి తమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గొప్ప గొప్ప ఉపన్యాసాలతో పనిలేకుండా ఆచరణ ద్వారా ఆదర్శాలను, సంస్కారాన్ని పంచే వ్యవస్థగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రశంసలు పొందింది. కాగా, ఇటీవలి కాలంలో ‘కాంగ్రెస్ సేవాదళ్’ అనే పేరు అక్కడక్కడా వినపడుతోంది. సేవాదళ్ జాతీయ అధ్యక్షుడు లాల్జీ దేశాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మధ్య సేవాదళ్ శ్రేణులు రామగుండంలోని తబితా పిల్లల ఆశ్రమంలో జరిపారట. జిల్లా చీఫ్ ఆర్గనైజర్ గోలివాడ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ- సేవారంగంలో సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్న ఘనత తమ సేవాదళ్‌కు దక్కిందన్నారు. ఆశ్రమ పిల్లల మధ్య కేకును కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేశారు. రామగుండం పట్టణ చీఫ్ ఆర్గనైజర్ ఎం.డి.జబ్బార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాదళ్ పలు శాఖల బాధ్యులు 14 మంది దాకా పాల్గొన్నారట.
సంతోషం.. బహుశా ఇక తమ శాఖల విస్తరణపై సేవాదళ్ వారు దృష్టిపెడతారేమో! కానీ- ఒక సందేహం.. వీరు సంస్కారాన్ని పంచగలరా? నేటి యువ భారతం ఎలా తయారవుతున్నదో ఆందోళన చెందుతున్నవారు ఎవరైనా స్పందించాల్సిందే. ఈ పని సేవాదళ్‌కు సాధ్యమవుతుందా? ఎందుకీ సందేహమంటారా? ఇది కాంగ్రెస్ సేవాదళ్. ఆ పార్టీలో ఇప్పుడు రాహుల్ గాంధీ తిరుగులేని నాయకుడు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థి ఆయనేనని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఎంతో ఎదగాల్సిన యువకుడైన రాహు ల్ లోక్‌సభలో కన్నుకొట్టటం సంస్కారమా? లోక్‌సభలో సాక్షా త్తూ ప్రధాని మోదీని ఆకస్మికంగా ఆలింగనం చేసుకొని, తిరిగి తన స్థానంలో కూర్చుని, ఒక కాంగ్రెస్ సభ్యునికి రాహుల్ కన్నుకొట్టారు. దీన్ని ఏమనాలి? ఇది సంస్కారమా? కాంగ్రెస్ సేవాదళ్‌కు ఇలాంటి సంస్కారాన్ని అలవర్చవద్దని రాహుల్‌కు విజ్ఞప్తి చేద్దాం. దేశంలోని వ్యవస్థలకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ చేసిన నష్టాన్ని తమ పార్టీ మాత్రమే పూడ్చగలదని ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎంపీ పేర్కొనడం ఆశ్చర్యకరం. దేశానికి ఆర్‌ఎస్‌ఎస్ చేసిన నష్టం ఏమిటో, దాన్ని పూడ్చడం ఎలాగో ఆ నాయకుడు వివరించి ఉంటే బాగుండేది.
(సమాప్తం)

-చాణుక్య