Others

బాల్య వివాహాలకు పేదరికమే కారణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, ఆచార వ్యవహారాలు ఎక్కువగా కనిపించే మన దేశంలో బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత వల్ల ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి, చేతులు దులుపుకునే పరిస్థితి ఇంకా కనిపిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు రాజా రామ్మోహన్‌రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలు బాల్యవివాహాలను రూపుమాపటానికి ఎనలేని కృషిచేశారు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఇంకా అడపాదడపా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ పాలనలోనే 1929లో ‘చైల్డ్ మ్యారేజ్ యాక్ట్’ను తీసుకువచ్చారు. ఆ చట్టం బాల్య వివాహాలను ఆపలేకపోయింది.
ఇప్పటికీ బాల్య వివాహాలకు పేదరికమే కారణం కావడం గమనార్హం. చదివించే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు ఆడపిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా, బలవంతంగా పెళ్లి చేసి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. ‘ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్‌మ్యారేజ్ యాక్ట్-2006’ ప్రకారం 18 ఏళ్ళలోపు ఆడపిల్లలను, 21 ఏళ్ళలోపుమగపిల్లలను ‘బాలలు’గానే పరిగణించాలి. ఇప్పటికీ తెలంగాణలో బాలికలకు చిన్నతనంలోనే వివాహాలు జరిపిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. పేదకుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలను 18 ఏళ్లలోపు చేస్తున్నారన్న అంశంపై ఆర్థిక సామాజిక అధ్యయనాల కేంద్రం, మహిళా ఫౌండేషన్, ప్లాన్ ఇండియా ఆధ్వర్యంలో ఓ అధ్యయనం చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సేకరించిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే పలు ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి.
తెలంగాణలో 20-24 ఏళ్ల మధ్యవయస్సు కలిగిన వారిలో 25.7 శాతం మంది బాలికల వివాహాలు మైనారిటీ తీరకుండానే జరిగినట్టు సర్వేలో గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో 15.7 శాతం, గ్రామాల్లో 25 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక కట్టుబాట్లు, అభద్రతా భావంతో పేద కుటుంబాలు బాల్యవివాహాలకు మొగ్గుచూపుతున్నాయి. ఆడపిల్లలను చదివించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రోత్సాహకాలను సరిగ్గా కల్పించక పోవడం, అందుబాటులో విద్యావకాశాలు లేకపోవడం, తల్లిదండ్రులకు ఉపాధి భరోసా లేకపోవడం వంటివి కూడా బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. మహబూబ్‌నగర్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో బాల్యవివాహాల వెనుక ఆర్థిక, సామాజిక కారణాలు కనిపిస్తున్నాయని సర్వేలో గుర్తించారు. బాల్య వివాహాలలో 86 శాతం వరకు పేదరికం వల్లనే జరుగుతున్నాయని సర్వేలో తేలింది. బాల్య వివాహాలను నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా సర్వే సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు.
ఆడపిల్లల చదువుకోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, బాల్య వివాహాలను నియంత్రించడానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను అన్ని రాష్ట్రాల్లో అమలు జరిగితే- ఆడపిల్లలకు ఆర్థిక స్వావలంబనతోపాటు ఉన్నత చదువులకు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. సామాజికంగా ఆడపిల్లల తల్లిదండ్రులపై పెరుగుతున్న ఒత్తిడులు కూడా బాల్య వివాహాలు కొనసాగడానికి కారణం. పెద్ద చదువులు చదివించలేక, భారీగా వరకట్నం ఇచ్చుకోలేక పేద కుటుంబాల్లో మైనారిటీ తీరని ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా ఇలా జరుగుతున్నాయంటే చట్టాలు, పాలకుల విధానాలు విఫలమవుతున్నాయని చెప్పాలి. బాల్య వివాహాలు కనుమరుగయ్యే విధంగా పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంది.

-్భమ్‌రాజ్ చిప్ప 99858 98315