Others

ఫ్రమాదంలో జీవవైవిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అనంత విశ్వంలో జీవవైవిధ్యం ఉనికిని మనం ఒక్క భూమిపై మాత్రమే చూస్తాం. మానవజాతి మాత్రమే కాదు, వివిధ రకాల వృక్షాలు, జంతుజాలం, జలచరాలు, పక్షులు, క్రిమికీటకాదుల మనుగడకు ఈ భూమియే ఏకైక ఆధారం. కానీ ఆధునికత, శాస్త్ర సాంకేతిక ప్రగతి పేరుతో మానవుడు సాగిస్తున్న వికృత విధ్వంస కేళి మానవ జాతి మనుగడకే ప్రమాదకారిగా మారింది. సకల ప్రాణికోటికీ మరణ శాసనాన్ని లిఖిస్తున్నది. రానున్న సంవత్సరాలలో మానవాళి తీవ్ర ఆహారకొరతను ఎదుర్కోనున్నదనీ, స్వచ్ఛ జలాల వనరులు, ఇంధన వనరులు అంతరించిపోతాయనీ ఐక్యరాజ్య సమితి సహకారంతో జరిగిన ఒక జీవవైవిధ్య అధ్యయనం హెచ్చరిస్తోంది. ఈ అధ్యయనంలో 550 మంది ఉన్నత స్థాయి నిపుణులు పాల్గొన్నారు. వీరి మార్గదర్శనంలో రూపొందిన ఈ అధ్యయనం 129 దేశాల ప్రభుత్వాల ఆమోదం పొందింది కూడా. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల వల్ల 2050 నాటికి జీవ వైవిధ్యం పెను ముప్పును ఎదుర్కోనుందనీ, పర్యావరణ కాలుష్యం కారణంగా అడవులు అంతరించిపోనున్నాయనీ, వ్యవసాయ క్షేత్రా ల మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నదనీ ఈ అధ్యయనం పేర్కొంటోంది.
మన అస్తిత్వానికి ఆధారమైన భూమి ఆరోగ్యకరంగా మనుగడ సాగించాలంటే జీవవైవిధ్యం పరిరక్షింపబడాలి. కానీ జీవవైవిధ్యానికి కలుగుతున్న హాని మానవాళి మొత్తంపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఐక్యరాజ్యసమితి సహకారంతో జరిపిన అధ్యయనం అమెరికా, ఆసియా, పసిఫిక్, ఆఫ్రికా, ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు సంబంధించిన వేరు వేరుగా పర్యావరణ నివేదికలను సమర్పించింది. అమెరికాలో అక్కడి ప్రజలకు ఉపయోగంలో ఉన్న ప్రకృతి విలువ ఏడాదికి 24.3 ట్రిలియన్ల డాలర్లు. ఇందులో పంటలు, కలప, జల వనరులు, పర్యాటక ప్రదేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇది ఆలస్కా నుండి అర్జెంటీనా వరకు గల భూభాగం నుండి వచ్చే స్థూల ఉత్పత్తికి సమానం. ఇప్పుడు అమెరికాలో ప్రకృతి సహజమైన ఉత్పత్తులు మూడింట రెండు వంతులకు తగ్గిపోయింది.
‘అరుదైన సీతాకోక చిలుకలను, పక్షులను, రినోలను, వృక్షాలను సంరక్షించడం అవసరమే. కానీ ఇది మాత్రమే జీవ వైవిధ్య పరిరక్షణ అనుకుంటే పొరపాటే. జీవవైవిధ్యం అనేది ఒక్క పర్యావరణానికే పరిమితమైన సమస్య కాదు. అది మొత్తం మానవ మనుగడకు సంబంధించిన సమగ్ర అంశం’’ అని రాబర్ట్ వాట్సన్ అంటారు. ఈయన ‘ఇంటర్ గవర్నమెంటల్ సొసైటీ పాలసీ ప్లాట్‌ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టం సర్వీసెస్’ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. విపరీతమైన వాయు కాలుష్యం వల్ల మధ్య ఆఫ్రికాలో ఒక హెక్టారు (2.5 ఎకరాలు) విస్తీర్ణంలో ఏడాదికి సగటున 14 వేల డాలర్ల విలువ చేసే వన సంపద నష్టపోతోంది. ‘వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోతే మన భవిష్యత్తు ప్రశ్నార్థకమే’’ అని రాబర్ట్ వాట్సన్ అంటున్నారు. ఇక జల కాలుష్యం విషయానికి వస్తే పదింట ఎనిమిది నదులు ప్లాస్టిక్ మయమైపోయాయి. ఇలా కలుషితమైన నదులలో ఎక్కువగా ఆసియాలోనే ఉన్నాయి. ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో మత్స్య సంపద 2050 నాటికి దాదాపుగా అంతరించిపోనున్నది. ఆధునికత పేరుతో మానవుడు విచ్చలవిడిగా సాగిస్తున్న విధ్వంసక కార్యకలాపాల వల్ల ఆఫ్రికాలోని ఏనుగుల దగ్గర్నుంచీ ఐరోపాలోని వివిధ రకాల వృక్షాలు, నీటిలో పెరిగే నాచు మొక్కలు, నత్తగుల్లలు కూడా కనుమరుగు కానున్నాయి.
2100 నాటికి ఆఫ్రికాలోని వివిధ రకాల పక్షి జాతులు, క్షీరదాలు సగానికి పైగా అంతరించనున్నాయని ఎమ్మా ఆర్చర్ అంటారు. ఈయన ‘ఆఫ్రికన్ అసెస్‌మెంట్ సంస్థ’కు కో-చైర్మన్‌గా ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా గణనీయంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రభుత్వాలు కొత్త విధానాల రూపకల్పన చేయవలసి వుంది. ఇందులో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి.

-డాక్టర్ దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690