Others

మహాత్ముని అంతిమ క్షణాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్మునిగా భారత జాతికే కాకుండా ప్రపంచ మానవాళికి ఆరాధ్యనీయులైన గాంధీజీ మన జాతిపిత, మాతృదేశ స్వాతంత్య్రానంతరం కేవలం అయిదు నెలల పదిహేను రోజులు జీవించారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్ర సాధనలో, మూడు దశాబ్దాలకుపైగా సత్యాగ్రహ, అహింసాయుత గాంధేయ సిద్ధాంత ప్రవక్తగా సారథ్యం వహించిన గాంధీజీ 79 సంవత్సరాలు, భూమిపై ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చేటప్పటికి, వయోవృద్ధుడైన గాంధీజీ, దేశ విభజన సృష్టించిన మత విద్వేషాన్ని రూపుమాపి హిందూ-ముస్లిం జనావళి శాంతి, సౌభ్రాతృత్వం, సహనంతో కలసిమెలసి జీవించే స్వతంత్ర భారతావని ప్రగాఢంగా ఆకాంక్షించి, తుపాకీ కాల్పులకు బలి అయ్యే ఆఖరి క్షణాల వరకు ప్రాణాలను లెక్కచేయకుండా శ్రమించారు. ‘ఈశ్వర్ అల్లా తేరేనామ్’ అంటూ ‘సబ్‌కో సన్మతి దే భగవాన్’ అంటూ సర్వాంతర్యామిని ప్రార్థించాడు. ప్రప్రథమ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పూజ్య బాపూజీ పాల్గొనలేదు. భారత దేశానికి స్వాతంత్య్రం, మత ప్రాతిపదికన విభజన సృష్టించిన విద్వేష, పరిణామాల కారణంగా వ్యక్తిగత వైఫల్యంగా తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. ఆగస్టు 15న కలకత్తా సమీపంలోని నౌఖరీలో హిందు- ముస్లిం సమైక్యత సాధించే సత్కృషిలో నిమగ్నం అయ్యారు. స్వతంత్ర భారతంలో గాంధీజీ మతసహనం, జాతి ఐక్యత కోరుతూ నిరాహారదీక్షలు చేపట్టారు. కలకత్తా, శ్రీనగర్, ఢిల్లీ ఎక్కడ శరణార్థులు హింసాకాండలకు గురి అయినా గాంధీజీ, స్వయంగా విద్వేషాన్ని చల్లార్చడానికి అక్కడకు వెళ్లేవారు. 1948 జనవరిలో ఢిల్లీలో, హత్యకు ముందు రోజులలో 19వ తేదీన నిరాహార దీక్షలో కృంగి కృశించి ప్రాణాలు అర్పించే పరిస్తితి తలఎత్తినా, వెనుకంజ లేదు. 1948 జనవరి 27 మెహ్రోలీలో ఖ్వాజా కుతుబుద్దీన్ దర్గాలో, ప్రసంగించారు. ముస్లిమ్ పక్షపాతిగా, హిందూ మతోన్మాదులు తనను హత్య చేసే ప్రయత్నాలు చేస్తున్నా, గాంధీజీ 1948 జనవరి నెలాఖరులో కూడా ప్రార్థనా సమావేశాలకు వచ్చే జనాన్ని పోలీసులు చెక్‌చేసే ముందు జాగ్రత్త చర్యను చేపట్టడానికి ప్రభుత్వం అసలు అంగీకరించలేదు. 1948 జనవరి 30న, గాంధీజీ హత్యకు నాధూరామ్ గాడ్సే, బెర్రెట్టా 9 ఎమ్.ఎమ్. సెమి ఆటోమేటిక్ ఆయుధం అందువల్లనే తేలికగా తెచ్చి దానిని పేల్చగలిగాడు. తన ప్రాణం భగవంతుని చేతిలో వుందని, తనకు సెక్యూరితో బతికే హక్కులేదని గాంధీజీ సెక్యూరిటీని తిరస్కరించారు. కేంద్ర హోంశాక మంత్రి సర్దార్ పటేల్‌తో గాంధీజీ సమావేశం అదే సాయంత్రం 5 గంటల పది నిమిషాల వరకు అయింది. గాంధీజీ హత్య 5 గంటల 17 నిమిషాలకు జరిగింది.
మహాత్ముని కార్యదర్శి ‘కళ్యాణం’.. ఏం చెప్పారు..
మహాత్మాగాంధీ ఆఖరి వ్యక్తిగత కార్యదర్శిగా, ఆయన అంతిమ క్షణాలను చూసిన వి.కళ్యాణం ప్రస్తుతం 95 సంవత్సరాలు పైబడిన వయస్సులో చెన్నైలో తన సందర్శకులకు గాంధీజీ ఆఖరి జీవిత విశేషాలను చెబుతూంటారు. 1944లో గాంధేయ సిద్ధాంతాలకు ఆకర్షితుడై కళ్యాణం, సేవాగ్రాం వార్థా ఆశ్రమంలో చేరారు. 1948లో ఆ విషాద సంఘటన సమంలో స్వయంగా గాంధీజీతో ఉండటం వల, డెబ్బయి ఏళ్లనాటి ఆ దుర్ఘటన గురించిన సజీవ సాక్షి, నేట కళ్యాణం ఒక్కరే. యిటీవల గాంధీజీ హత్యాసంఘటన సందర్భంలో తలఎత్తిన వివాదం, నాటి ప్రత్యక్ష సాక్షి కళ్యాణం, ఖండించారు. బిర్లాహౌస్ నుంచి సరిగ్గా ఆ సాయంత్రం 5 గంటలకు ప్రార్థనా సమావేశానికి రావలసిన గాంధీజీ 15 నిమిషాలు ఆలస్యంగా ‘అభా’, ‘మను’ల భుజాలపై చేతుల ఆసరాతో వస్తూండగా, కళ్యాణం వెనుకనే వున్నారు. ముకుళిత హస్తాలతో గాడ్సే తాను దాచిన రివాల్వర్ తీసి, ఎడమవైపు నుంచి వచ్చి మూడు బుల్లెట్లు కాల్చాడు. అక్కడ రివాల్వర్‌తో కాల్చిన వ్యక్తి ఒక్కరేనని, నాల్గవ బుల్లెట్ పేలిందని, మరోవ్యక్తి కాల్చాడనే యిప్పటి కొత్త వాదన వాస్తవం కాదని కళ్యాణం యిటీవల ధ్రువీకరించారు. అదే విధంగా ‘హేరామ్’ అనటానికి కూడా ఆఖరి శ్వాసలో ఆస్కారం లేకుండా, గాంధీజీ ప్రాణం పోయిందని స్పష్టీకరించారు. తనకు ఆరు అంగుళాల సామీప్యంలో ఆ బుల్లెట్ మిస్ అవడం కారణంగా బతికి,తాను నేడు ఆ సంఘటన చెప్పగలుగుతున్నానని కళ్యాణం అన్నారు. 1944 మే నెలలో, కళ్యాణంకు ముంబైలో గాంధీజీ పరిచయం లభించింది. గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి మహదేవ్ దేశాయ్, మరణం తరువాత, ఇన్సూరెన్సు కంపెనీ ఉద్యోగం వదిలిపెట్టి కళ్యాణం, గాంధీజీ పీఏగా చేరారు. హత్యానంతరం 1956లో ఎస్.సి, ఎస్‌టి ప్రాంతీయ కమిషనర్ ఉద్యోగ బాధ్యత నిర్వర్తించారు. రూ. 60 జీతంపై గాంధీజీ దగ్గర చేరిన రోజులలో, గాంధీజీ డిక్టేట్ చేసిన ఉత్తరాలు టైప్ చేసేవారు. స్వాతంత్య్రానంతరం దేశంలో మత విద్వేషం కారణంగా చెలరేగుతున్న అమాను, మారణకాండల క్రూరత్వానికి గాంధీజీ చలించిపోయేవారని, ఆ పాశవిక మతకల్లోల అమానవీయతను నిస్సహాయంగా, నిశ్శబ్దంగా చూడవలసిన దుస్థితి నుంచి, దేవుడు తనను తీసుకుపోవాలని ప్రార్థించేవారని కళ్యాణం అన్నారు. గాడ్సే చర్య ద్వారా భగవంతుడు, గాంధీజీ ప్రార్థనను కరుణించాడని, ఆఖరి శ్వాసను ఎటువంటి శారీరక వేదన, బాధ లేకుండా సునాయాసంగా గాంధీజీ విడిచి భగవంతునిలో ఐక్యమయ్యారని కళ్యాణం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

-జయసూర్య 9440664610