Others

లేత మనసుల గుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది లేత మనసుల గుడి.. లేత మనుషుల గుడి. ఇప్పటివరకు మనం పలకాబలపంతో చదువు మొదలుపెట్టాం. ఈనాడు లేత మనసుల కలలను ఆవిష్కరిస్తున్నారు. పాఠశాలకు పలకాబలపంతో రావడం లేదు. కానీ ఎన్నో వేలకొద్దీ భావాలతో ఎగురుకుంటూ పసిపిల్లలు మన తరగతి గదిలోకి ప్రవేశిస్తున్నారు. వారికి అక్షరాభ్యాసం కాలేదు. ఏ మంత్రులు దిద్దించలేదు. కానీ మనసునిండా ఎన్నో భావాలు ఏర్పడ్డాయి. వాటిని ప్రోత్సహించేందుకు తరగతి గదిని తీర్చిదిద్దుకొని సిద్ధం చేయవలసి ఉంది. వారికి సైంటిఫిక్ ప్రయోగాలకన్నా పిల్లలకు తమ ప్రయోగాలే ఆనందం కలిగిస్తాయి. ఈ పిల్లలకు మ్యూజియంలకు, జంతు ప్రదర్శన శాలలకు, పర్యాటక కేంద్రాలు, ప్రసిద్ధ దేవాలయాలు, జలవనరుల సాగరాలకు వెళ్లాలనే కుతూహలం బాగా ఉంటాయి. ఇపుడు మనవి మొబైల్ క్లాస్‌రూమ్స్ అయ్యాయి. ఆటలను ఆధారం చేసుకుని వారికి విలువలను నేర్పవలసి ఉంది. విలువలు సమాజానికి సంబంధించినవి. పిల్లలను ఉత్తమ పౌరులుగా రూపొందించడానికై ఉపాధ్యాయులు ఆ విలువలను పాటించి నేర్పుతాడు. పిల్లలను చూడగానే వారిని పేర్లుపెట్టి పిల్లలను పిలుస్తూ నమస్కారం అని చెప్పాలి. మరునాడు టీచర్ పేరు పెట్టి పిలవగానే పిల్లలు తిరిగి నమస్కారం చేస్తారు. పెద్దలను చూడగానే నమస్కారం చేస్తారు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే నమస్కారం చేస్తారు. పిల్లలను ఉపాధ్యాయుడు గౌరవిస్తే ఆ పిల్లలు సమాజాన్ని గౌరవిస్తారు. ఈనాడు ఉపాధ్యాయునికి కొత్త బాధ్యతను అప్పగిస్తుంది. ఇప్పటివరకు తరగతి గదిలో టీచర్‌ను చూసి భయపడే పిల్లలను, ఏడ్చే పిల్లలను చూశాం. ఇపుడు తరగతి గదిలో ప్రేమించే ఉపాధ్యాయుణ్ణి, పిల్లలను అక్కున చేర్చుకునే ఉపాధ్యాయుణ్ణి చూపాలి. అన్నం తినిపించే ఉపాధ్యాయుణ్ణి చూపాలి. కథలు చెప్పే ఉపాధ్యాయుణ్ణి చూపాలి. ఇపుడు తరగతి గదిని చిన్నపిల్లలకు సారవంతమైన క్షేత్రంగా మార్చుకోవాలి. అప్పుడే ఈ పిల్లలనే మొక్కలు నాటుకుని ఎదుగుతాయి. ఆ పిల్లల కలలే దేశ భవిష్యత్తుకు మూలం అవుతాయి.
అన్ని మొగ్గల్ని వికసించనివ్వాలి
కొంతమంది తరగతి గదికి జీవనోపాధికోసమో, వృత్తిని ఎంచుకునో వస్తూంటారు. దీనిని మనం కాదనలేం. కానీ కొంతమంది మాత్రం ఉత్తమ పౌరులుగా రూపొందడానికై సామాజిక కార్యకర్తలుగా సిద్ధపడటానికి వస్తూంటారు. రెండో లక్ష్యం మొదటి లక్ష్యంలోనే ఇమిడి ఉండాలేగానీ కేవలం తరగతి రెండో లక్ష్యమే అనుకుంటే అది ప్రవచనశాలగా మారిపోతుంది. ప్రవచనశాలగా మారడం తరగతి లక్ష్యం కాదు. రెండో లక్ష్యాన్ని సూటిగా చెప్పకూడదు. మొదటి లక్ష్యంలోనే రెండో లక్ష్యాన్ని ఇమడ్చాలి. అది ఉపాధ్యాయునికే సంభవం. పసిపిల్లలు కాబట్టి ఉపాధ్యాయుడు దానిని ఆచరిస్తేనే అవి ఉపదేశాలుగా కాకుండా ఆచరణయోగ్యం అవుతాయి. ఉపాధ్యాయుని జీవితం పాఠ్యాంశ భాగమే అనుకోవాలి. ఇది ఉద్యోగంగా పరిమితం అనుకుంటే పిల్లలపైన దాని ప్రభావం ఉండదు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిననాడే దానికున్నటువంటి కావాలసినటువంటి గుణాలను కూడా అలవర్చుకోవాలి. విలువలు ఆ వయసు తగినట్లు ఉండాలి. దేశభక్తికన్నా మానవత్వాన్ని ప్రేమించే లక్ష్యం మొదలు తీసుకురావాలి. పిల్లలకు విలువలను నేర్పాలి. అది సున్నితమైన కార్యక్రమం. మనది విభిన్నమైన సాంస్కృతిక వ్యవస్థ. ఏ మతానికి, ఏ వర్గానికి ఇబ్బంది కాకుండా విలువలను తరగతి గది నేర్పాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయుడు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అతడు ఒకవైపు మొగ్గు చూపకూడదు. అన్ని మొగ్గలను వికసింప చేయాలి. పిల్లలకు ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి. క్లిష్టమైన సమాజంలో వాటికి అతీతంగా ఉన్నప్పుడే సరస్సులోని కమలంలా తరగతి గది ఎదుగుతుంది.

-డా.చుక్కా రామయ్య