Others

దారి తప్పుతున్న విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘విద్య అంటే అత్యంత ప్రధానమైన మూలభూత తత్వాన్ని, మన కళ్ల ఎదుటనున్న సత్యాన్ని యథాతథంగా చూడగల సామర్థ్యం - జీవిత పరమార్ధాన్ని, దాని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటూ మన మనసులో నుండి ప్రతిఫలాపేక్షను తొలగించుకోవడం విద్యయొక్క పరమ ప్రయోజనం’’ అన్నారు ప్రముఖ విద్యాతత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. అసలు తెలివిడికి, విజ్ఞానానికి, ఆలోచనల విస్తృతికి, అధ్యయనాని, అభ్యాసానికి బీజరూపమైన పునాదులు నిర్మించాల్సినది పాఠశాల విద్య. ఇది గతి తప్పింది. వందల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా ప్రాథమిక విద్య అసలు లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రంగంలో చేస్తున్న ప్రయోగాలు వెర్రితలలు వేస్తున్నాయి. ప్రభుత్వరంగంలో పాఠశాల స్థాపన, సిబ్బంది నియామకాలు, రేషనైలేజేషన్ పేరుతో పాఠశాలల మూత అన్నీ రాజకీయ కోణమే. ఉపాధ్యాయవర్గాలూ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదు. అర్ధం లేని, అవసరం లేని సిలబస్, కొరకరాని మూల్యాంకన విధానం, ప్రచారార్భాటం, మాతృభాషలో కావలసిన గుణాత్మక విధానాలను తోసిరాజనడం విద్యారంగానికి శాపాలు. విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపే, విలువలు ప్రబోధించే ప్రణాళికలు లేవు. సామాజిక స్ఫూర్తి కలిగించే అంశాలు పాఠశాల విద్యలో లేవు. మాతృభాషలో బోధన, అధ్యయనాల వల్ల ఆంతరంగిక శోధన జరిగి విశే్లషణాశక్తి మెరుగుపడుతుంది. అన్య మాధ్యమాలలో అధ్యయనం కేవలం నేర్చుకునేందుకు, వాటిని గుర్తుంచుకునేందుకు తప్ప ఆకళింపునకు దోహదపడదు. అధ్యాపకులు చెప్పిన అంశాన్ని స్వీయ అవగాహనతో వివిధ రంగాలకు అన్వయించుకోగల సామర్థ్యం అమ్మభాష ద్వారానే సాధ్యం. పాఠశాల విద్యలో మాధ్యమంపై ఇప్పుడు ఒక రకంగా విషప్రయోగం జరుగుతోందనే చెప్పాలి. భావ వ్యక్తీకరణకు, స్వీయ అవగాహనకు ప్రాథమికంగానే కాకుండా ప్రభావవంతంగా ఉపకరించే మాతృభాష నిరాదరణకు గురికావలసి రావడం చింతించాల్సిన విషయం. గణితం, భౌతిక, రసాయనిక, సాంకేతిక శాస్త్రాలను కూడా పూర్తిగా తెలుగులో తగిన పదజాలాలతో భాషాంతరీకరణలు చేసి సగటువారికి చేరువ చేయాల్సి ఉండగా, అసలు తెలుగునే మాయం చేసే అంశం ఖచ్చితంగా మాయదారి పోకడ. ‘ప్రపంచీకరణ - ప్రపంచ భాష’ అని జపించడంవల్ల మన ప్రస్తుత విధానం దారి తప్పిపోయింది. మాధ్యమాల సంగతి అటుంచితే ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు చదివే పిల్లలు కనీసం 3వ తరగతి పాఠ్యపుస్తకాలు చూసి కూడా చదవలేకపోతున్నారంటూ ఒకవైపు అసోచామ్, అసర్, ప్రధమ్ వంటి సర్వే నివేదికలు ప్రస్ఫుటంగా చెబుతున్నాయి. అయినా తాజాగా పాఠశాల విద్యాశాఖ వింత ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నూతన ప్రయోగం ఏమిటంటే ఈ సంవత్సరం నుండి 8,9 తరగతులకు వ్రాత పరీక్షలు ఉండవు. అన్నీ బహుళైచ్చిక ప్రశ్నలే. ఒక్కొక్క అధ్యయనాంశంలో 80 ప్రశ్నలు. ఒక్కొక్కదానికి నాలుగు జవాబులు, సరైన జవాబు గుర్తించి ఒఎమ్‌ఆర్ కాగితంపై మన ఐచ్ఛికాలను దిద్దితే చాలు. వారాంతాల నుండి వార్షిక పరీక్షల దాకా అన్నీ ఈ పద్ధతిలోనే. పైగా వచ్చే ఏడు నుండి ఆరు, ఏడు తరగతులకు కూడా ఇదే పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే మన చదువులు అటకెక్కినట్లే. చదవడం, వ్రాయడం అనే కలల్ని ఇకపై ఊహించలేం. విద్యార్థులు అసలు కళాశాల ముఖమే చూడకుండా సాగిపోతున్న డియిడి, బియిడి, ఎంయిడి చదువులు, ఆపై ప్రహసనంగా మారుతున్న పాఠశాల విద్యావిధానాలు. ఈ వక్రగతికి అసలు కారణం ఏమిటి? పాలకుల ఉదాసీనత, ప్రైవేటు రంగం వ్యాపారీకరణతో విద్యారంగం సుప్తచేతన స్థితికి చేరింది.

-డా. కప్పగంతుల మల్లికార్జున్