క్రైమ్/లీగల్

మూడున్నర కోట్ల రుణాలు స్వాహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, మార్చి 20: ఎలాంటి భూమి లేకున్నా నకలీ పాసుపుస్తకాలు తయారు చేసి వాటి ద్వారా బ్యాంకు నుండి దాదాపు 3.50కోట్ల రుణాలు పొందినట్లు తహశీల్థార్ లక్ష్మణ్ చెప్పారు. మంగళవారం తహశీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దీనికి సంబందించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని గండీవేట్ గ్రామంలోని సిండికేట్ బ్యాంకు పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 745 మంది నకలీ పాసు పుస్తకాల ద్వారా 3.50 కోట్ల రుణాలు పొందినట్లు తమ విచారణలో తేనినట్లు వివరించారు. రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం బ్యాంకు పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 745 మంది వారికి ఎలాంటి భూములు లేకున్నా వారు మాత్రం నకలీ పాసుపుస్తకాల ద్వారా బ్యాంకులో రుణాలు పొందినట్లు వివరించారు. బ్యాంకు పరిధిలోని 900 మంది రైతులకు 2008 వ సంవత్సరం నుండి రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ కాకపోవడం జరిగినట్లు వివరించారు. వారి వివరాలను బ్యాంకు అధికారులతో కలసి రెవెన్యూ సిబ్బంది రికార్డులను పరిశీలించగా ఇందులో 745 మంది రైతులకు ఎలాంటి భూములు లేవని తేలినట్లు వివరించారు. దీంతో వారు నకిలీ పాసు పుస్తకాలు తీసుకుని రుణాలు పొందినట్లు వివరించారు. వారికి సంబంధించి ఎలాంటి భూములు లేవనే నివేదికను గండీవేట్ బ్యాంకు అధికారులకు అందజేసినట్లు తెలిపారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
భీమ్‌గల్, మార్చి 20: భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాభీమ్‌గల్ గ్రామ పంచాయతీకి ఆమ్లేట్ గ్రామనైన రూప్లాతండాకు చెందిన బుక్యా శంకర్(33)అనే రైతు సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య రాధాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రూప్లాతండాకు వెళ్లి విచారణ చేపట్టామని ఎస్‌ఐ వివరించారు. మృతుడు శంకర్‌కు అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనతో తిరుగుతున్నాడని స్థానికులు తెలుపడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామని ఎస్‌ఐ వివరించారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.