అంతర్జాతీయం

ఈ-మెయిల్ ఆవిష్కర్త టామ్లిన్‌సన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రోగ్రామర్, 1970వ దశకంలో ఈ-మెయిల్ విధానాన్ని ఆవిష్కరించడంతో పాటు సందేశాలను పంపించే పద్ధతికి బఅనే చిహ్నాన్ని ఎంపిక చేసిన రే టామ్లిన్‌సన్ (74) కన్నుమూశారు. టామ్లిన్‌సన్ 1971లో నేరుగా ఎలక్ట్రానిక్ మెసేజ్‌లను పంపించే పద్ధతిని కనుగొన్నారు. అంతకుముందు వినియోగదారులు కేవలం పరిమితమైన నెట్‌వర్క్‌లో మాత్రమే సందేశాలను రాసి పంపగలిగేవారు. టామ్లిన్‌సన్ మృతి చెందిన విషయాన్ని ఆయన పనిచేసిన సంస్థ యజమాని, రక్షణ ఉత్పత్తుల కాంట్రాక్టర్, ఎలక్ట్రానిక్స్ నిపుణుడు రేథియోన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘నెట్‌వర్క్‌డ్ కంప్యూటర్ల తొలి రోజులలో ఈ-మెయిల్ విధానాన్ని మనకు అందించిన నిజమైన సాంకేతిక పరిజ్ఞాన వైతాళికుడు రే టామ్లిన్‌సన్’ అని రేథియోన్ పేర్కొన్నారు. టామ్లిన్‌సన్ ఆవిష్కరణ ప్రపంచ సమాచార మార్పిడి తీరునే మార్చివేసిందని ఆయన శ్లాఘించారు. అలాంటి టామ్లిన్‌సన్‌ను మనందరం కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టామ్లిన్‌సన్ శనివారం మృతి చెందినట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. టామ్లిన్‌సన్‌కు ఆన్‌లైన్ ప్రపంచం ఘనమైన నివాళి అర్పించింది. టామ్లిన్‌సన్ మృతి తీవ్ర విషాదకరమైన వార్త అని అమెరికాకు చెందిన డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డిఎఆర్‌పిఎ) ఒకప్పటి మేనేజర్, ఇంటర్నెట్ ఆవిష్కర్తల్లో ఒకరిగా భావిస్తున్న వింట్ సెర్ఫ్ పేర్కొన్నారు.