అంతర్జాతీయం

అమల్లోకి వచ్చిన వీసా ఫీజు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 13: హెచ్-1బి, ఎల్-1 వీసాల ఫీజులను పెంచడంపై తీవ్రస్థాయిలో ఐటి కంపెనీల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఈ నిర్ణయాన్ని అమెరికా అమల్లోకి తెచ్చింది. భారీగా పెంచిన ఈ ఫీజుల వల్ల భారత్‌కు చెందిన ఐటి కంపెనీలపై తీవ్రస్థాయిలో ఆర్థిక భారం పడుతుంది. హెచ్-1బి, ఎల్-1 వీసాలపై అదనంగా 4000 డాలర్ల ఫీజు వసూలు చేయాలని అమెరికా నిర్ణయించింది. దీన్ని అమలుచేయాలని నిర్ణయించినట్టు యుఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) వెల్లడించింది. హెచ్-1బి వీసాలకోసం 2015 డిసెంబర్ 18 తరువాత దరఖాస్తు చేసుకున్నవారంతా అదనపుభారం భరించాల్సిందే. అదనంగా 4వేల యుఎస్ డాలర్లు చెల్లించాలని యుఎస్‌సిఐఎస్ పేర్కొంది. ఎల్-1ఏ, ఎల్-1బికి దరఖాస్తు చేసుకున్నవారైతే 4,500 ఫీజు చెల్లించాలన్నారు. ఈ వీసాల ఫీజు పెంపునకు సంబంధించిన ఫైలుపై గత నెల 18న అధ్యక్షుడు సంతకం చేశారు. బేస్ ప్రొసీడింగ్స్ ఫీజులకు ఇది అదనం అని యుఎస్‌సిఐఎస్ వివరించింది. ఈ అదనపు ఫీజుల విధానం 2025 సెప్టెంబర్ 30 వరకూ అమల్లో ఉంటుందని చెప్పారు.