అంతర్జాతీయం

దావూద్‌కు కరాచీలో ఆరు నివాసాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 23: పాకిస్తాన్‌లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన చిరునామాలుగా భారత్ పేర్కొన్న తొమ్మిందింటిలో ఆరు సరయినవేనని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ కమిటీ నిర్ధారించింది. మిగతా మూడు అడ్రస్సుల్లో ఒకటి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ దౌత్యవేత్త మలీహా లోధీ అడ్రసుగా ఉండడంతో దాన్ని తన జాబితానుంచి తొలగించింది.
1993 ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే దాగి ఉన్నాడని మన దేశం మొదటినుంచీ చెప్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిసారి కూడా పాక్ ప్రభుత్వం దావూద్ తమ దేశంలో లేడని, ఉన్నాడని నిరూపించే సాక్ష్యాధారాలను చూపించాలంటూ మెలిక పెడుతున్న విషయం తెలిసిందే. దీంతో మన ఇంటెలిజన్స్ ఏజన్సీలు తీవ్రంగా శ్రమించి కరాచీలో దావూద్ ఇబ్రహీంకు చెందిన తొమ్మిది నివాసాల చిరునామాలను సేకరించాయ. వీటి వీడియోలను సైతం తీసి ఇటీవల పాకిస్తాన్‌తోపాటుగా ఐక్యరాజ్య సమితికి కూడా పంపించింది. పాకిస్తాన్‌లోని ఈ తొమ్మిది నివాసాలు దావూద్ ఇబ్రహీంకు చెందినవేనని, ఇక్కడినుంచే దావూద్ భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఆదేశాలు ఇస్తుంటాడని కూడా ఆ లేఖల్లో తెలిపింది.
దీంతో ఐక్యరాజ్య సమితికి చెందిన కమిటీ ఈ జాబితాను నిశితంగా పరిశీలించిన తర్వాత ఆ తొమ్మిదింటిలో మూడు మాత్రం దావూద్‌కు చెందనవి కావని, మిగతా ఆరూ సరైన అడ్రసులేనని తేల్చింది. అంతేకాదు ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన వివరాల్లో ఈ ఆరు నివాసాల వివరాలను కూడా చేర్చింది. ఐరాస తొలగించిన మూడు అడ్రస్సుల్లో ఒకటైన కరాచీలోని మార్గల్లా రోడ్, స్ట్రీట్ నంబరు 22, ఇంటినంబరు 7 చిరునామా కలిగిన ఇల్లు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ రాయబారి మలీహా లోధీకి చెందినదిగా తేలిందని పేర్కొంటూ కమిటీ జాబితానుంచి దాన్ని తొలగించింది. అలాగే క్లిఫ్టన్ ఏరియాలోని తల్లార్ ఏరియా మెహ్రాన్ స్క్వేర్, ఎనిమిదో అంతస్తు నివాసం, డిఫెన్స్ హౌసింగ్ ఏరియాలోని మరో నివాసం కూడా దావూద్ ఇబ్రహీంకు చెందినవి కాదని కూడా ఐరాస పేర్కొంది. అయితే ఆ జాబితాలోని మిగతా అడ్రసులను ఐరాస భద్రతా మండలికి చెందిన కమిటీ కొట్టివేయలేదని భారత్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు. అంటే దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నాడనే విషయాన్ని ఐరాస సైతం నిర్ధారించినట్లయింది. కాశ్మీర్‌లో ఇటీవల పాక్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లను సొమ్ము చేసుకోవడానికి పాక్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడన్న విషయం స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిరూపితం అయిన తర్వాత ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.