అంతర్జాతీయం

ఉగ్రదాడుల నిరోధానికి బ్రిటన్‌లో ప్రత్యేక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 7: ఉగ్రవాదుల దాడులను ముందస్తుగా గ్రహించి, నిరోధించటానికి బ్రిటన్ నిఘా వ్యవస్థ ఎంఐ5 ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. బిహేవియిరల్ సైన్స్ యూనిట్ (బిఎస్‌యు) పేరుతో ఏర్పాటుచేసిన ఈ యూనిట్ థేమ్స్‌హౌస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఒకరి మాటలు, ప్రవర్తన ద్వారా హత్య చేయటం వంటి హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలను గ్రహించి ముందుగానే నిరోధించటం తమ విధి అని ఈ యూనిట్‌లో ఆరేళ్లుగా పనిచేస్తున్న నీల్ అనే అధికారి వెల్లడించారు. తాము ఒక అంచనాను మాత్రమే నిఘా సంస్థలకు వెల్లడిస్తామని.. తమ నివేదికపై తుది నిర్ణయం తీసుకోవలసింది దర్యాప్తు అధికారులేనని ఆయన స్పష్టం చేశారు. అనూహ్యమైన కదలికలను పసిగట్టడం, వాటి తీవ్రతను గుర్తెరిగి దానికి సంబంధించిన సమాచారాన్ని నిఘా సంస్థలకు అందించటం బిఎస్‌యు పని. క్రిమినాలజిస్టులు, సైకాలజిస్టులు, ఆంత్రోపాలజిస్టులు, విద్యావేత్తలతో కూడిన బృందం ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది.

ఆయా ప్రాంతాల్లో ‘నడిచేవాళ్లు, మాట్లాడేవాళ్ల’ ప్రవర్తన ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించినా దాన్ని విశే్లషించి దర్యాప్తు అధికారులకు చేరవేస్తారు. ఇది వాస్తవంగా 2004లోనే బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.