అంతర్జాతీయం

భారత్‌ది వసుధైక కుటుంబ భావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్/న్యూఢిల్లీ, మే 22:్భరత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఇరాన్ పర్యటనలో భాగంగా ఆదివారం టెహరాన్‌లోని ఒక గురుద్వారాను సందర్శించారు.్భయ్ గంగాసింగ్ సభా అనే ఇరాన్‌లోని ఈ ఏకైక గురుద్వారాలో ఆయన ప్రార్థనలు జరిపారు. ఇప్పటికి కూడా నారత సంస్కృతీ సంప్రదాయాలను పరరక్షిస్తున్నందుకు సిక్కు సంతతివారిని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరినీ భారతావని తన వారిగానే భావిస్తుందని, వసుధైక కుటుంబ సమున్నత భావనకు కట్టుబడుతుందని తెలిపారు. ఫ్రపంచమంతా ఒకే కుటుంబమని భావించడం వల్లే భారతీయులు ఎక్కడ ఉన్నా ఆ దేశాన్ని తమ మాతృదేశంగా భావించి దాని ప్రగతికి పాటుపడతారని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. అంతకు ఇక్కడికి చేరుకున్న మోదీకి ఇరాన్ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ స్వాగతం పలికింది.
కాగా, ఇరాన్‌తో కనెక్టివిటీని,వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భాగస్వామ్యం పెంచుకోవడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంటుందని ఆదివారం ఆ దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరాన్‌తో సంబంధాలు, ఇంధన భాగస్వామ్యం పెంపే తన పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంటుందని మోదీ పలు ట్వీట్లలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఇంధన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం కోసం మోదీ ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనితోను, ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీతోను చర్చలు జరుపుతారు. తన పర్యటనలో చాబహర్ ఒప్పందాన్ని కుదుర్చుకోగలుగుతామన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేస్తూ, భారత్, ఇరాన్‌ల మధ్య నాగరికతాపరమైన సంబంధాలున్నాయని, ఈ ప్రాంత శాంతిభద్రతలు, సుస్థిరత, అభివృద్ది పట్ల రెండు దేశాలకు ఒకే రకమైన ఆసక్తి ఉందని అన్నారు.