బిజినెస్

ఉపాధి అవకాశాలు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రభుత్వరంగ సంస్థలు తమ వద్ద ఉన్న మిగులు భూములను విక్రయించటం ద్వారా వచ్చే నిధులు, ఆర్థిక వనరులను పెట్టుబడిగా పెట్టటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచి దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపిచ్చారు. ప్రైవేట్ రంగం నుండి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వరంగ సంస్థలు తమ వనరులను సమీకరించుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రభుత్వరంగ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ‘స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్’ (స్కోప్) ఉత్తమ అవార్డులను బహూకరించారు. ప్రభుత్వరంగ సంస్థలు పరస్పర సహకారంతో తమ వనరులను సమీకరించుకుని, ప్రైవేట్ రంగం నుండి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనాలని ఆయన సూచించారు. కాగా, వినియోగదారుల అభిరుచుల మేరకు నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయాలని ప్రణబ్ అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు మానవ వనరులను, పెట్టుబడులను ఉపయోగించుకుని, పటిష్టమైన వ్యూహాలను రూపొందించుకోవాలని, పనితీరును మెరుగుపరుచుకుని అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో విజయం సాధించాలని రాష్టప్రతి హితవు పలికారు. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచటం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వరంగ సంస్థలు తమ వద్ద ఉన్న మిగులు భూములను విక్రయించాలని ప్రణబ్ సూచించారు. ఈ చర్యతో ఆయా సంస్థలకు అవసరమైన పెట్టుబడులు లభిస్తాయని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల వద్దనున్న మిగులు నిధులను కూడా పెట్టుబడిగా పెట్టాలని ఉద్ఘాటించారు. ప్రభుత్వరంగ సంస్థలు గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం అభివృద్ధి రేటును సాధించాయన్నారు. గత మూడేళ్లలో సగటున 1,15,426 కోట్ల లాభాలను గడించాయి, స్థూల టర్నోవర్, రెవెన్యూ 20,02,591 కోట్లు సాధించి 57,115 కోట్ల డివిడెండ్లు చెల్లించాయని రాష్టప్రతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, స్కిల్ బిల్డింగ్, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల విజయానికి ప్రభుత్వరంగ సంస్థలు చేస్తున్న కృషిని ప్రణబ్ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పొల్గొంటున్నందుకు కూడా ఆయన ప్రభుత్వరంగ సంస్థల యాజమాన్యాలు, సిబ్బందిని ప్రశంసించారు. దేశాభివృద్దికి సంబంధించిన ఒక కార్యక్రమంపై దృష్టి సారించి మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని ఆయన ప్రభుత్వరంగ సంస్థలకు పిలుపు ఇచ్చారు.
హెచ్‌ఎఎల్‌కు స్కోప్ అవార్డు
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్)కు ప్రతిష్ఠాత్మక స్కోప్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టి సువర్ణరాజు అవార్డును అందుకున్నారు.

చిత్రం ప్రభుత్వరంగ దినోత్సవం కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తదితరులు