బిజినెస్

దేశీయ మార్కెట్లు భారీగా పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఆరంభం నుంచే భారీ నష్టాల దిశగా పయనించిన మార్కెట్లు ముగిసే సమయానికి కుప్పకూలాయి. ఈ ఏడాది బ్రెగ్జిట్‌ తర్వాత ఇదే అత్యధిక పతనమని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 444 పాయింట్లు కోల్పోయి 28,353 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 8,715 వద్ద ముగిసింది. ప్రపంచమార్కెట్ల ప్రభావంతో ఓ దశలో సెన్సెక్స్‌ 550 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 8,700 దిగువకు పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.92 వద్ద కొనసాగుతోంది.