మీకు మీరే డాక్టర్
పచ్చకర్పూరం తెచ్చే మేలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రశ్న: కర్పూరానికీ, పచ్చకర్పూరానికీ తేడా చెప్పగలరు. వీటికి ఏమైనా వైద్య ప్రయోజనాలున్నాయా?
జ: కర్పూరం అనేది హారతి కర్పూరం, పచ్చకర్పూరం పేర్లతో రెండు రకాలుగా దొరుకుతుంది. అసలు ఆరతి కర్పూరం చాలా ఘాటుగా ఉంటుంది. అనేక వైద్య ప్రయోజనాలు కలిగిన గొప్ప ఔషధ ద్రవ్యం. దీన్ని ముద్ద కర్పూరం పేరుతో కేవలం దైవ సంబంధమైన సందర్భాల్లో మాత్రమే వాడుకొంటున్నాం. కానీ, ఆయుర్వేద వైద్యంలో ఆరతి కర్పూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
ఆరాత్రిక అంటే రాత్రిని లేదా చీకటిని పోగొట్టేది కాబట్టి, ఆరతి లేదా హారతి అన్నారు. వేదకాలం నాటి యజ్ఞయాగాల ఆచారానికి ఈ ఆరతి ఒక కొనసాగింపు.
కర్పూరం చెట్టు జిగురును వండి దాని సారాన్ని తీస్తారు. అదే ముద్ద కర్పూరం లేదా హారతి కర్పూరం అంటే! ఇది చేదుగా, ఘాటుగా వెగటుగా ఉంటుంది. కానీ కర్పూర సుగంధం చాలా పరిమళ భరితంగా ఉంటుంది. కనీసం ఒక వంద బాధల మీద దీని ప్రయోగాలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి. అంత ప్రాముఖ్యత దీనికుంది. కర్పూరం బిళ్ల పేరుతో మార్కెట్లో మనకు దొరికేవి మైనం లాంటి పదార్థాలతో కృత్రిమంగా తయారైనవి కావచ్చు. కాబట్టి వాటికి కర్పూరానికి చెప్పిన వైద్య ప్రయోజనాలు ఉంటాయనుకోకూడదు. అవి కేవలం ఆరతి ఇచ్చేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. టర్పంటైన్తో తయారుచేసిన కృత్రిమ కర్పూరం కూడా అమ్ముతున్నారని తెలుస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. ముద్దకర్పూరాన్ని మాత్రమే వైద్య ప్రయోజనాల కోసం సాహసం చేయకుండా ఉండటమే మంచిది.
ముద్ద కర్పూరం నాణ్యమైనది దొరక్కపోతే బదులుగా నాణ్యమైన పచ్చకర్పూరం తీసుకోవచ్చు. దీనికి ఆరతి కర్పూరంతో సమానమైన గుణాలే ఉన్నాయి. ఇది బోర్నియో, సుమత్రా, సింగపూర్, జపాన్ మొదలైన దేశాల నుండి దిగుమతి అవుతోంది. ఆరతి కర్పూరాన్ని కొన్ని ఇతర ద్రవ్యాలతో కలిపి వండుతారు. ఇది తెల్లగా లేదా కొద్ది పసుపు రంగులో ఉంటుంది. భీమసేనీ కర్పూరం అని కూడా దీనే్న పిలుస్తారు.
ఆరతి కర్పూరం తీక్షణంగా ఉంటుంది. బాగా వేడిచేసే స్వభావం కలిగి ఉంటుంది. పచ్చకర్పూరం సౌమ్యంగా ఉంటుంది. చలవ చేస్తుంది. దీని సువాసన ఆరతి కర్పూరం కన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కంటికి సంబంధించిన వ్యాధులు, రక్తస్రావం అయ్యే వ్యాధులు, ఒళ్లంతా మంటలు, అరికాళ్లు అరిచేతుల్లో మంటలు, జ్వరం వచ్చినట్టు వేడిగా ఉండటం, క్షయ వ్యాధి, పొడిదగ్గు, మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు ఇవి ఉన్నవారు పచ్చకర్పూరాన్ని వాడుకొంటూ ఉంటే వ్యాధి త్వరగా తగ్గుతుంది.
5 గ్రాములు జాజికాయ, 5 గ్రాములు జాపత్రి, 2-3 గ్రాముల ముద్దకర్పూరం లేదా పచ్చకర్పూరం, ఈ మూడింటినీ తీసుకుని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఒక గ్లాసు వేడి పాలలో పావుచెంచాకన్నా తక్కువగా ఈ పొడిని కలిపి రోజూ రాత్రి పడుకోబోయే ముందు తాగితే కమ్మని నిద్రపడ్తుంది. దీర్ఘకాలంపాటు ఇలా రోజూ తాగవచ్చు కూడా! పావుచెంచా మోతాదు మించి ఈ పొడిని తీసుకోకండి. ఎక్కువగా తీసుకుంటే జలుబు చేస్తుంది. ఈ పొడిని పాలతో ప్రతీ రాత్రి తాగుతూ ఉంటే పైన చెప్పిన వ్యాధులన్నింటిలోనూ చాలా ప్రయోజనం కలుగుతుంది.
దీనివలన స్ర్తి పురుషుల్లో సెక్సు సమర్థత పెరుగుతుంది. పురుషుల్లో జీవ కణాలు తక్కువగా ఉన్నవారికి కణాలు పెరగటానికి ఇది తోడ్పడుతుంది.
నాడీ వ్యవస్థని ఇది శక్తిమంతం చేస్తుంది. నరాల బలహీనత తగ్గుతుంది. ఫిట్స్ జబ్బు ఉన్నవారికీ, పార్కిన్ సోనిజం అనే వణుకు వ్యాధి ఉన్నవారికి ఈ పొడి కలిపిన పాలు రోజూ రెండు పూటలా ఇవ్వటం మంచిది.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి దీన్ని తప్పనిసరిగా ఇవ్వటం మంచిది.
ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని పోగొడుతుంది. ఉబ్బసాన్ని పోగొడుతుంది.
గుండె ఎక్కువగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది.
రక్తనాళాల్లో చేరిన కొవ్వును పోగొడుతుంది. దీన్ని లేఖనం అనే గుణంగా చెప్తారు. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. నోరు తడారిపోవటం ఆగుతుంది.
తాంబూలంలో దీన్ని కూడా కొద్దిగా చేర్చి నమిలితే నోటి దుర్గంధం తగ్గుతుంది.
6-7 తులసి ఆకులతో ఈ పొడిని చిటికెడంత కలిపి నమిలితే గొంతులో గరగర తగ్గుతుంది. శరీరంలో విష దోషాలు తగ్గుతాయి. ఉబ్బసానికి, పడిశ భారానికి ఇది గొప్ప ఔషధం.