మీకు మీరే డాక్టర్

గరుకు చర్మానికి చురుకైన చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: చర్మం బిగుసుగా, గరుకుగా ఉంటోంది. ఎందుకిలా జరుగుతోంది? ఆహారంలో మార్పులు, నివారణ చెప్పగలరు.
-కానగ శారదా హరగోపాల్
జ: చర్మం అనేది ఐదు జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఒక విధంగా శరీరావయవాల్లో కెల్లా పెద్దది కూడా! ఇది శరీరంలోపలి భాగాలకు రక్షణ కలిగించడంతోపాటు, శరీర ఉష్ణోగ్రతని అదుపు చేస్తుంది.
చర్మానికి రక్షణ కావాలంటే, దానికి కావలసినంత తేమ అందుతూ ఉండాలి. శరీరంలో కొన్ని భాగాలు చెమ్మ లేకపోవటాన ఎండినట్టవుతాయి. తేమని కోల్పోవటం వలన ఉష్ణోగ్రతని చర్మం సమాన స్థాయిలో నిలబెట్టలేకపోతుంది.
చర్మం బిరుసుగా, బిగువుగా, ఎర్రగా, గరుకుగా, పొలుసులు పొలుసులుగా, పగుళ్లు బారుతూ, దురదపెడుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. చర్మం డ్రై కావటాన్ని గ్జిరాసిస్ అంటారు. గ్జీరో అంటే ఎండటం. ఓసిస్ అంటే వ్యాధి.
చర్మంలో ఏ భాగంలోనైనా సరే ఎండిపోయినట్టు కావచ్చు. సాధారణంగా ఇది కొద్దికొద్దిగా పెరుగుతూ పోయే వ్యాధి. తొలిదశలో జాగ్రత్త పడితే ఏ సమస్యా ఉత్పన్నం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా మడమల మీద పగుళ్లు కూడా ఈ ఎండు చర్మం వలన కలిగేవే! మన అశ్రద్ధ వల్ల పెరిగేవే!
కొన్ని రకాల మందులు వాడేప్పుడు నోరు ఆర్చుకు పోయినట్లయి పెదాలు బాగా డ్రై అయిపోతాయి. ఒక్కోసారి పగుళ్లు బారవచ్చు.
డెర్మటైటిస్, ఇక్తియోసిస్, కెరటోసిస్, పొలారిస్, సొరియాసిస్ లాంటి చర్మవ్యాధుల్లో చర్మం ఇలా ఎండిపోవటం జరుగవచ్చు. చక్కెర వ్యాధి వలన కూడా చర్మం ఎండిపోవటం, పగుళ్లు బారటం జరగవచ్చు. జననాంగాల దగ్గర పగుళ్లు ఏర్పడి డాక్టర్ దగ్గరకు వచ్చేవారిలో 90% మందికి షుగరు వ్యాధి వచ్చి ఉంటుంది.
చర్మ సంరక్షణని అశ్రద్ధ చేయడం దీనికి ముఖ్య కారణం. వాతావరణ పరిస్థితులు, జీవన విధానం, మానసిక పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చు.
సహజమైన లిపిడ్స్ లోపం వలన గుండె, రక్తనాళాల వ్యాధులు, చర్మం పొడబారటం జరగవచ్చు. లిపిడ్స్ లోపం వలన తడిని నిలవబెట్టగలిగే గుణం తగ్గిపోతుంది. చర్మంలో సహజమైన తేమ కలిగించే అంశాలు లోపిస్తాయి. అందువలన చర్మం పైపొరలు చెమ్మని కోల్పోతాయి. అది ఒరీజశ జూళ్దకజ్ఘూఆజ్యశ కు దారి తీస్తుంది.
చేతులు ఎప్పుడూ తడిలో నానుతూ ఉండే వారికి, కాస్టిక్ షోడా, బట్టలుతికే పౌడర్లు, అంట్లు తోమే పౌడర్లు లాంటి శక్తిమంతమైన క్షారాలను చేతులతో ఉపయోగించే వారికి చేతులు ఎండినట్టయి, పగుళ్లు బారతాయి. పాదాలకూ ఇదే వర్తిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి గృహిణులు బట్టలు ఉతికేప్పుడు బ్రషింగ్ చేయటం, ఉతకటం, జాడించటం చేసేప్పుడు ఈ క్షారాల వలన చేతులు, ఆ నీళ్లు తగిలి పాదాలు పగుళ్లు బారవచ్చు.
నీళ్లలో ఎక్కువగా నానుతూ ఉండే వాళ్లకు చేతులు, పాదాల్లాంటి చోటుల్లో లిపిడ్స్ లోపం ఏర్పడి అవి పగుళ్లు బారతాయి.
తీవ్రమైన చలి, ఎండ, పొడి గాలులు లాంటి అంశాలు చర్మం పై పొరల మీద చెడుని కల్గిస్తాయి. ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వ్యాధి స్వయంకృతాపరాధమే అవుతుంది.
ఎండలో కాకిలా తిరిగే వాళ్లని నల్లబడిపోతావని, ముఖంలో కళ తగ్గిపోతుందని, ముసలోడివై పోతావని పెద్దవాళ్లు కేకలేస్తూంటారు. ఇలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలు చర్మం పై పొరల్ని బాగా దెబ్బ తీస్తాయి. దాని వలన ఔళ్ఘౄఆఖూళ ఘ్ళజశ, జూకశళఒఒ యఛి ఒరీజశ లాంటి లక్షణాలు కలుగుతాయి.
శరీరానికి నూనెను గానీ లేదా వెన్నను గానీ బాగా పట్టించి సున్నిపిండితో నలుగు పెట్టుకుని కొద్దిసేపు ఆరనిచ్చి నలుగును వలిచి స్నానం చేస్తూ ఉంటే సహజంగా తేమనిచ్చే మాయిశ్చరైజర్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు, కేలరీలు తక్కువగానూ ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే, చర్మం పదిలంగా ఉంటుంది.
రసాయనాలు కలిసిన మాయిశ్చరైజర్లు ఎప్పటికైనా హాని చేస్తాయి. సహజంగా సున్నిపిండి తయారుచేసుకోండి. కల్తీ లేని నూనెను చర్మానికి పట్టించుకోండి. వారానికి కనీసం రెండుసార్లయినా నలుగు పెట్టుకుని స్నానం చేయండి. చేతులు, పాదాలు, జాయింట్ల దగ్గర, ముఖ్యంగా చంకలు, గజ్జల్లో చర్మం పొడిబారటం ఎక్కువగా ఉంటుంది. అక్కడ వీలైతే రోజూ నూనె లేదా వెన్న రాస్తూ ఉండండి.
ఏమైనా చర్మం మీద ఇలాంటి బాధలు రావటంలో మన అశ్రద్ధ ప్రధానమైన కారణం. నివారణ కూడా మన చేతుల్లోనే ఉంది. రెండింటినీ వదిలేసి మందుల మీద ఆధారపడాలనుకోవటం వలన అపకారమే ఎక్కువ జరుగుతుంది.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com